- గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి, ప్రభుత్వ ముఖ్య సలహాదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు శ్రీ కె.ఆల్ఫ్రెడ్ వేడుకోలు.
- గత నెల 12 వ తేదీన మా పింఛను దారుల విషయాలు వారు పడుతున్న కష్ట నిష్టూరాలను కులకుశంగా విన్నవించడము జరిగినది.
- రాష్ట్ర జె.ఎ.సి.చైర్మన్ మాన్యశ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి లక్షలాది మంది తరపున వారి ఇబ్బందులు ద్వారా అన్ని విషయాలు విన్న విన్నవించిన శ్రీ కె.ఆల్ఫ్రెడ్
4 లక్షల మంది పింఛనరులకు సకాలములో పింఛను అందక ఆర్థికముగా చితికి పోతున్నారు. జనవరి మరియు ఫిబ్రవరి నెలలో చెల్లించవలసిన పింఛనులోని 20 మాసములకు చెందిన డి.ఆర్. మార్చి నెలలో చెల్లిస్తారని ఎదురు చూస్తున్నారు. కాని వారి బకాయిలు చెల్లించక పోగా జనవరి మరియు ఫిబ్రవరి మాసములలో ఇస్తానన్న 20 మాసముల బకాయిలను వారికి అందకుండానే వారి పింఛను ఆదాయ పన్ను రూపంలో మినహాయించి మార్చినెల పింఛనులో కోత విధించినారు. రాష్ట్రంలో పించను దారులకు రావలసిన పింఛనులో ఒక్కొక్కరికి దాదాపు 10 వేల రూపాయల నుండి 50 వేల రూపాయల వరకు ఆదాయ పన్ను రూపంలో విధించి వారికి మార్చినెల పింఛను చెల్లించినారు. వృద్ధులకు రావలసిన బకాయిలు ఇవ్వకుండానే సర్వీసు పింఛను మొత్తము ఆదాయ పన్ను రూపంలో భారీగా కోత విధించి ఇచ్చుట ఎంతవరకు ధర్మము అని మా మనసు క్షోభిస్తుంది. అందువలన ముఖ్యమంత్రి వర్యుల వారు దయతో గమనించి ఈ నెలాఖరుకైనా పింఛను దారులకు రావలసిన బకాయిలను ఇప్పించాలని కోరడం జరిగింది. ముఖ్యముగా 4లక్షల మంది పింఛనుదారలకు పింఛను ఇవ్వకుండా వారికి రావలసిన సొమ్మును మరియే ఇతరములకైనను వినియోగించి 4లక్షల మంది ప్రభుత్వానికి సేవచేసి సర్వీసు పింఛను పై ఆధారపడి జీవిస్తున్న మమ్ములను బలవ మరణాలకు కారకులు కాకుండా కాపాడాలని కోరుకుంటూ, మీ యెదల మాకు ప్రగాఢమైన విశ్వాసము కలదని విశ్వసిస్తూ ఫింఛనుదారల మొర ఆలకించి ముఖ్యమంత్రి వర్యులు తీసుకునే నిర్ణయం పైనే మా ప్రాణాలనకు రక్షణ వుందని విశ్వసిస్తున్నాము అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు శ్రీ.కె.ఆల్ఫ్రెడ్ ప్రభుత్వానికి విన్నవించారు
1 Comments
ధన్యవాదములు అమరావతి JaC వారికి . మాకు ముందుగా పెన్షన్ చెల్లించిన తర్వాతనే ఉద్యోగులకు జీతం ఇవ్వండని ప్రభుత్వనికి తెల్పినందులకు. అయినను ప్రభుత్వం అంగీకరించడం లేదు. మాలో గూడ ముందుగా Family pension వారికి ముందుగాను, తర్వాత 30,000 లు pension వారికి రెండవ విడతగాను, మిగతా 50వేలు ఆపైన వారికి తర్వాత ఇవ్వవచ్చును.
ReplyDeleteThanks For Your Valuable Feed Back