ఉద్యోగుల సమస్యలుపై నిజయాతిగా పోరుభాట సాగించిన ఏపిజెఏసి అమరావతి నాయకులకు, పాల్గొన్న ఉద్యోగులకు అభినందనలు.

👉 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు,జీతాలు పెంచాలి, రైస్ కార్డులు మరియు సంక్షేమ పథకాలు కొనసాగించాలి.

👉 తేదిః1-9-2004 ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులకు కేంద్రప్రభుత్వ నిబంధనల మేరకు ఓపియస్ విధానం వారికి అమలు చేయాలి.

👉 ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో చొరవ చూపిన ముఖ్యమంత్రి గారికి,సియస్ గారికి ధన్యవాదాలు తెలియజేసారు.

   ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక, రిటైర్డు,కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపి ఆర్దిక, ఆర్దికేతర సమస్యలు పరిష్కరం వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాధిమంది  ఉద్యోగుల ప్రయోజనాల కాపాడుకొనేందుకు అలుపుఎరుగని పోరాటాలు 92 రోజులు పాటు చేసి ఉద్యోగులలో ఆనందాన్ని నింపినందుకు,ఈ ఉద్యమం విజయవంతం కావడానికి కారకులైన జిల్లా స్దాయి ఏపిజెఏసి అమరావతి నాయకులను, కార్యకర్థలను అభినందించేందుకు ఆదివారం విశాఖపట్నం రెవిన్యూభవన్ లో విశాఖజిల్లా చైర్మన్ సత్తినాగేశ్వరరెడ్డి అద్యక్షతన జరిగిన అభినందన సభ జరిగింది. 

ఈ సమావేశంలో ముఖ్యఅతిధులుగా ఏపిజేఏసి అమరావతి స్టేట్  చైర్మన్ బొప్పరాజువెంకటేశ్వర్లు, సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు  పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేసిన నాయకులందరినీ సత్కరించి మెమోంటోలను అందించి అభినందించారు.

ఏపిజెఎసి అమరావతి నాయకత్వం చేపట్టిన ఉద్యమానికి ఏపి లో ఉన్న ప్రధాన ఉద్యోగసంఘల జేఏసిలు నాయకులను, ఉపాద్యాయ సంఘాలు కలసి వస్తామని చెప్పి కూడా రాక పోనప్పటకీ నిజాయితీగా, దైర్యంగా ఏపిజెఏసి అమరావతి నాయకత్వం చేపట్టిన ఉద్యమ ఫలితంగా ప్రభుత్వం స్పందించి పిభ్రవరి 13 న ప్రభుత్వప్రధానకార్యదర్శికి 50 పేజీలతో ఇచ్చిన మెమోరాండంలో ఉన్న 48 డిమాండ్లులో 37 డిమాండ్లును పరిష్కరించుకోవడంలో జరిగింది. ఈ విజయం ఉద్యోగుల విజయం. ఇది మనందరి విజయం అని ఈ విజయాన్ని ఉద్యోగులకే అంకితం అని  బొప్పరాజు వెంకటేశ్వర్లు,పలిశెట్టి దామోదరరావు అన్నారు.



  ఈసమావేశంలో చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ..

👉 94 డిపార్ట్మెంట్ ల కలయికతో ఏపి జెఏసి అమరావతి ఉన్నది కనుక అనేక డిపార్ట్మెంట్ కు చెందిన ప్రధానంగా ఆర్టీసీ, రెవెన్యూ, మునిసిపల్, గ్రామ వార్డ్ సచివాలయం తదితర శాఖల ఉద్యోగులు సమస్యలు పరిష్కరించుకున్నామని, అనేక శాఖల్లోని అనేకమంది కరోనా ముందు, కరోనా కాలం, కరోనా తర్వాత చనిపోయిన ఉద్యోగుల కుటుంబం లోని సభ్యులకు కారుణ్య నియామకాలు పొందమని, పెండింగ్ లో ఉన్న 1.7.2018 & 1.1.2019 డి.ఎ అర్రియర్స్ + సరెండర్ లీవులు కలిపి వెరసి షుమారు 1700 కోట్లు ఈ సెప్టెంబర్ ఆఖరు లోపు చెల్లిస్తామని తెలిపారని, అలాగే 1.7.2019 & 1.7.2021 రెండు డి.ఎలు + పి ఆర్ సి అర్రియార్స్ వెరసి షుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాలలో చెల్లిస్తామని తెలిపారని 

అలాగే ఉద్యమ ఫలితంగా  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దికరించేందుకు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయము ఇది, దీనివలన మిగిలిన కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా  ఏదో ఒకరోజు క్రమబద్దీకరీంచ బడతామన్న మనోదైర్యం వచ్చిందని అన్నారు. 

👉 అలాగే సిపియస్ ను మార్పుచేసి జిపియస్ గా చేసిన మార్పులు చేయాలన్న నిర్ణయం పై కూడా మాట్లాడూతు ఈ జిపియస్ స్కీమ్ సుమారుగా ఒపియస్ స్కీమ్ కు దగ్గర్లో ఉన్నందున కాస్తా పెద్దమనసు చేసుకొని మిగిలిన ఓపియస్ బెనిఫిట్స్ ను ఇచ్చేవిదంగా నిర్ణయాలు చేసి సిపియస్ ఉద్యోగులలో ఆనందం నింపాలని విజ్ఞప్తి చేసారు. 

👉అంతే కాకుండా ఔట్ సోర్శింగు ఉద్యోగులను cfms లో ప్రభుత్వఉద్యోగులుగా  చూపించి నందున వారికి, వారి కుటుంబ సబ్యులకు కూడా రేషన్ కార్డులతోపాటు ప్రభుత్వసంక్షేమపధకాలు కూడా రద్దు చేసినందున తిరిగి వాటిని పునరుధ్దరీంచాలని కోరారు.

👉 ప్రతి శాఖ కార్యదర్శి గారిచే ఆయా శాఖల HoD లను కలిసి ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు గల ఉద్యోగ సంఘాల నాయకులచే నెలకొకసారి సమావేశాలు నిర్వహించెలా ప్రభుత్వం ఆదేశించాలని కోరారు.

👉1.9.2004 ముందు నియామక ప్రక్రియ పూర్తయి, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారందరికీ అనగా 2003-DSC  టీచర్ రిక్రూట్మెంట్, 2003 - పోలీసు రిక్రూట్మెంట్, 2003 - group-II రిక్రూట్మెంట్ వెరసి షుమారు ఈ రాష్ట్రంలో 9000 మందికి పాత పింఛను విధానం అమలు చేయాలని గౌ||ముఖ్యమంత్రి గారిని కోరారు.

👉 అంతేకాకుండా ఉద్యోగులు సమస్యలు పేరుకు పోకుండా ఉండాలంటే, ప్రతినెలా అన్ని డిపార్టుమెంటు హెడ్ ఆఫీసులోను, అన్నిజిల్లాలలోను ప్రభుత్వగుర్తింపు సంఘాలతో సంబంధిత శాఖ రాష్ట్ర స్థాయి కార్యదర్శి గారితో సమావేశాలు, గుంటూరు జిల్లా కలెక్టర్ మాదిరి రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ గార్లచే ఉద్యోగుల గ్రీవెన్సుడేలు నిర్వహించాలని కోరారు. 

  ఈసమావేశంలో శ్రీకాకుళం జిల్లా చైర్మన్ కంచరాన శ్రీరాములు,ప్రధానకార్యదర్శి యస్.వి.రమణ,విజయనగరం జిల్ల చైర్మన్ కె.వి. రమణరాజు,ప్రధానకార్యదర్శి జి.విజయకుమార్,మణ్యం చైర్మన్ జీ.శ్రీరామూర్తి,ప్రధానకార్యదర్శి డి.జి.ప్రసాధ్,విశాఖజిల్లా చైర్మన్ సత్తి నాగేశ్వరరెడ్డి,ప్రధానకార్యదర్శి కె.శ్రీనివాసరావు,అసోషియేట్ చైర్మన్ యస్.ఏ.త్రినాధ్, అనకాపల్లి చైర్మన్ నాయుడు వాసు,ప్రధానకార్యదర్శి డి.లోవరాజు, తో పాటు జిల్లా నాయకులందరిని ఈ అభినందన సభలలో  సత్కరించారు.

    అలాగే ఈసమావేశంలో దివ్యంగుల అసోషియేషన్ రాష్ట్రప్రధానకార్యదర్శి ఏ.శ్రీనివాసరావు,ప్రభుత్వ డ్రైవర్సు అసోషియేషన్ రాష్ట్రఅధ్యక్షులు సంసాని శ్రీనివాస రావు,రాష్ట్ర ప్రభుత్వ క్లాస్ 4 ఎంప్లాయీస్ రాష్ట్రఅధ్యక్షులు యస్.మల్లేశ్వర రావు, రెవిన్యూ అసోషియేషన్ రాష్ట్రఉపాధ్యక్షులు పప్పల వేణుగోపాలరావు,కెజిబివి రాష్ట్ర అధ్యక్షురాలు యస్.బి.టి.యస్. దేవి,విఆర్ ఓ రాష్ట్రనాయకులు ఏ.సాంబశివరావు, ఏపిపిటీడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ డిప్యూటీజెనరల్ జెనరల్ సెక్రటరీ పి.బానుమూర్తి, ఏపిలేభర్ డిపార్టుమెంటు యన్.జి.ఓ రాష్ట్రఅధ్యక్షులు కె.ప్రభాకర్,ఏపి మున్సిఫల్  టీచర్సు ఫెడరేషన్ రాష్ట్రప్రధానకార్యదర్శి యం.రవి సిద్దార్ధ తధితర నాయకులు పాల్గిన్నారు. 

ధన్యవాదాలతో...

బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు