*ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న లక్షలాదిమంది  ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక, పెన్షనర్,కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ నమస్కారం 🙏*

*❗❗ఒక సగటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగిగా గత కొంత కాలంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని వాస్తవాలను మీ దృష్టికి తీసుకురాదలచాను*

*🚫 ప్రస్తుతం రాష్ట్రం లో ఉన్న నాలుగు ప్రధానమైన సంఘాలలో ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమం మొదలుపెట్టిన సంఘం ఏది ??*


🚫 గత సంవత్సన్నర కాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి సంఘాలన్ని కలిసి ఉద్యమం చేస్తే బాగుంటుంది అని సగటు ప్రభుత్వ ఉద్యోగులుగా మనం అందరం అనుకున్నామా లేదా ???

🚫 రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రధానమైన సంఘాలలో ఒక సంఘం ఉద్యోగుల పట్ల జరుగుతున్న పరిణామాలను చూడలేక నాలుగు అడుగులు ముందుకు వేసి మనం అందరం చూస్తూ వుండగానే ఉద్యమం మొదలు పెట్టింది.. మనలో కూడా అనేక వేల మంది  అందులో భాగస్వామ్యం అయ్యామా లేదా ??

*నోట్ :*ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ఏపీ జేఏసీ అమరావతి మొదలుపెట్టిన ఉద్యమం పట్ల మిగిలిన మూడు సంఘాల ధోరణి ఎలా ఉందో ఒకసారి చూద్దాము...*

🔥 ఉద్యమం మొదలు పెట్టే ముందు  ఏపీ జేఏసీ అమరావతి అది నాయకత్వం మిగిలిన ప్రధాన సంఘాల నాయకుల వద్దకు వెళ్ళి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యమం మొదలుపెడదాం అందరం కలిసి పనిచేసి ఉద్యోగుల న్యాయపరమైన సమస్యల పరిష్కార సాధనలో సఫలీకృతం అవుదాము అని ఏపీ జేఏసీ అమరావతి అధినాయకత్వం చెప్తే సదరు సంఘ నాయకులు *"తమ్ముడు బొప్పరాజు నువ్వు ముందు మొదలు పెట్టావు.. నీ వెనకనే మేము కూడా కలుస్తాము ఒకే రైలు కాకపోతే ముందు వెనక బోగీలు"* అని చెప్పి ఉద్యమ స్ఫూర్తిని వంచిచిన మాటలు మనం పత్రిక ముఖంగా చూడలేదా ?? 

🚫 ఏపీ జేఏసీ అమరావతి చేసే మొదటి దశ ఉద్యమంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతాము అని ఆ సంఘం పత్రిక ముఖంగా చెప్తే *ఇంకొక సంఘ నాయకుడు ఎంత అపహాస్యం చేస్తూ నల్ల బ్యాడ్జీలు వల్ల ఒరిగేది ఏమీ లేదు అన్నవాడికి* అదే నల్ల రిబ్బను తో దాదాపు 3600 కోట్లు రూపాయల ఉద్యోగులకు GPF/APGLI/ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పోలీస్ సోదరులకు T A బిల్లులు మొదలైనవి విడుదల చేపించుకున్న ఘనత ఏపీ జేఏసీ అమరావతి సంఘానిది  కాదా  ?? 

❗❗ *కొసమెరుపు* ఏంటంటే నల్ల రిబ్బను తో ఏమీ ఒరగదు అన్న నాయకుడు ఎక్కడకి పారిపోయాడో మనకి ఎవరికి అర్థం కావట్లేదు.. 🤔🤔❗❗

🚫 ఇంకొక పెద్ద నాయకుడు అని  చెప్పుకుని చెలామణి అవుతున్న వ్యక్తి అయితే మనం అసలు ఉద్యమాలు చేయాల్సిన అవసరమే లేదు అని బాహాటంగా చెప్పి ఉద్యమ ఐక్యతను దెబ్బ తీయాలని చూసి మన ఉద్యోగులను మోసం చేసింది మికేవరికి గుర్తులేదా !!!

🚩🚩 ఒక పక్క నుంచి ఎన్ని మోసాలు కుట్రలు జరుగుతున్న అవేవీ పట్టించుకోకుండా 92 రోజులు ఉద్యమాన్ని నిజాయితీగా,నిబద్ధతతో నడిపిన నాయకత్వం ఏదైనా ఉంది అంటే  అది ఒక్క ఏపీ జేఏసీ అమరావతి మాత్రమే .

🔥మీ అందరికీ గుర్తు ఉందో లేదో
CPS రద్దు చేసి OPS ని పునరుద్ధరించాలని మాట్లాడుతూ ..
*ప్రజాప్రతినిధులు mla గా చేస్తే ఒక పెన్షన్ , MP గా చేస్తే రెండు పెన్షన్లు, మంత్రిగా చేస్తే మూదు పెన్షన్లు తీసుకోవచ్చు కానీ మ ప్రభుత్వ ఉద్యోగి 35 ఏళ్ల పాటు ప్రభూత్వానికి జీవితాన్ని ధారపోసి సర్వీస్ చేస్తే మాకు పెన్షన్ ఇవ్వరా అని చెప్పి మీడియా ముఖంగా ప్రజాప్రతినిధులను ప్రశ్నించిన సంఘ నాయకుడు ఎవరో మీరు మర్చిపోయారా ???*


*ఒక సగటు ప్రభుత్వ ఉద్యోగిగా మనమందరం  ఏపీ జేఏసీ అమరావతికి చేయాలి  సెల్యూట్ 🫡*

😢 మిత్రులారా మన అందరికీ 92 రోజులు ఏపీ జేఏసీ అమరావతి చేసిన ఉద్యమ సంఖ్య మాత్రమే గుర్తుంటుంది.. 

🚩 కానీ ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గానికి, వాళ్ళ 26 జిల్లాల కార్యవర్గాలకి , దాదాపు 100కు పైగా అనుబంధ సంఘాల నాయకులకు , ఆ  కార్యవర్గాలకు ఆ 92 రోజులు ఎలా గడిచాయో, వాళ్ళు మన అందరి ఎంత కష్టపడ్డారో, ఎంత మానసిక వేదనకు గురయ్యారో, కుటుంబాలకు దూరంగా ఉంటూ  మండుటెన్డల్ని సైతం లెక్కచేయకుండా, తీవ్రమైన వడగల్పులను సైతం లెక్కచేయకుండా ఆఖరికి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా .. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క యోధులై మన ఉద్యోగ లోకం కోసం పోరాడారు..

🚩 ఆ 92 రోజులలో వారు ఎన్ని అవమానాలకి , ఎన్ని బెదిరింపులకి , ఎన్ని నిందలకీ బలయ్యారో వారికి మాత్రమే తెలుసు ఎందుకంటే ఇతర ప్రధాన సంఘాల సహకారం లేకుండా ఉద్యమం నడపడం అంత సులువైన పని కాదు🙏🙏🙏

*కానీ ఈ రోజున 92 రోజుల ఏపీ జేఏసీ అమరావతి చేసిన ఉద్యమాన్ని మరిచి చాలామంది పెయిడ్ ఆర్టిస్టులు , సంస్కారం లేని కుసంస్కారులు సోషల్ మీడియా వేదికగా అవాక్కులు చవాక్కులై పేలుతున్నారు* ఇది ఒక సగటు ఉద్యోగిగా ఏ మాత్రం సహించలేనిది మిత్రులారా..

👊👊 అయ్యా, మీ అందరికీ నేను గుర్తుచేస్తుంది ఒకటే. మనలో చాలా మంది ఉద్యమంలో పాలుపంచుకున్నాము, మన ఉద్యోగుల న్యాయపరమైన హక్కుల కోసం *ఒక మనిషి* ఒక శక్తిలా మారి కాలికి బలపం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న HOD లు అన్ని తిరిగినప్పుడు , మనం పనిచేసే కార్యాలయాలకు కూడా వచ్చి ఉద్యమానికి మద్దతు తెలపాలని మనల్ని కూడా కోరడం పచ్చి నిజం కాదా..!! మనం అంత రోజు పత్రికల్లో , టీవీ వార్తల్లో కళ్ళారా చూడలేదా !! చూసి మనం ఎన్ని సార్లు అనుకోలేదు మిగిలిన మూడు సంఘాల నాయకులు కూడా ఈ ఉద్యమం లో కలిస్తే సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయని.. !!!

🚩 ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వాలు మండల, డివిజనల్, జిల్లా శ్రేణులను ఉద్యమానికి సమాయత్తపరిచి 26 జిల్లాలలో ఒకటికి రెండుసార్లు సన్నాహక సమావేశాలు ,క్యాంపులు నిర్వహించి లక్షల మంది ఉద్యోగుల్లో ఉద్యమ స్ఫూర్తిని చైతన్యాన్ని నింపడం నిజం కాదా ... 

❗❗అసలు కరోనా సమయంలో చనిపోయిన మన సహచర ఉద్యోగుల కుటుంబాలను ఎవరైనా పట్టించుకున్నారా ?? వాళ్ళలో ఎంత మంది మనతోనే కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు ? ఆ కుటుంబాల సంక్షేమం కోసం పరామర్శ యాత్రలు పెట్టి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్ళకి రావాల్సిన బకాయిలను, వాళ్ళ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు జరిగేలా చూసిన ఘనత కేవలం ఒక సంఘానికి దక్కుతుంది అది ఏపీ జేఏసీ అమరావతి మాత్రమే.. 👏👏👏🫡

👉 సిపిఎస్ ఉద్యోగుల సమస్యల గురించి,  కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల గురించి,  రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల గురించి, గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సమస్యల గురించి ప్రత్యేక ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళ కష్టాలను బాధలను ఆ వేదికల నుంచి ప్రభుత్వానికి తెలియజేసేటట్టు చేసి ఈరోజు వారికి ఎంతో లబ్ధి చేకూరే విధంగా ఏపీ జేఏసీ అమరావతి పోరాడింది అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు... 

👉 ఇవేమీ మీకు గుర్తులేవా ??? గుర్తు లేకపోతే ఒకసారి గత మూడు నెలల పత్రికలను వెనకకి తిప్పి చూడండి అది చేతకాకపోతే ఒకసారి యూట్యూబ్ లో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం అని  ఒక్కసారి టైప్ చేయండి తెలుస్తుంది ఉద్యమం అంటే ఏమిటో... !!!✊✊🚩🚩


👇👇ఏపీ జేఏసీ అమరావతి సంఘం  పోరాటం వల్లే ఈ  విజయాలు అయిన మనం సాధించాము అని చెప్పటంలో నాకు ఎటువంటి అతిశయోక్తి లేదు అవి ఒకసారి తెల్సుకుందాం మిత్రులారా..👇👇

👉ఈ రోజు 12 వ పిఆర్సి కమిటీ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది..

👉 RTC లో ప్రమోషన్ పొందిన దాదాపు 2000 మందికి PRC వర్తింప చేశారు.

👉 RTC ఉద్యోగులకు అసలు ఊసే లేని OT సాధించారు.

👉 1200 మందికి కారుణ్య నియామకాలు రూపంలో ఉతర్వులు వెలువడ్డాయి.

👉పోలీస్ శాఖ వారికి దాదాపు 520 ఎర్న్డ్ లీవులు డబ్బులు జమ చేశారు.

👉కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ 

👉 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు టార్గెట్లు రద్దు చేయడం.

👉 రెండో విడత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డెకరేషన్ పూర్తి చేయుట.

 👉గ్రామ రెవెన్యూ సహాయకులు DA వర్తింపజేయుట.

👉 CPS ఉద్యోగుల PRAN ఖాతాల్లో 2443 కోట్ల రూపాయలు జమ చేయడం.

👉మహిళా ఉద్యోగులకు ప్రొబేషన్ కాలంలో తీసుకున్న 180 రోజులు ప్రసూతి సెలవులను సర్వీస్ లెక్కలోనికి తీసుకోవడం.

👉 GSWS ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో దివ్యంగులకు ప్రాధాన్యత కల్పించుట.

👉వైద్య విధాన పరిషత్ లో ఉద్యోగుల రెగ్యులరైజేషన్

👉 DRDA ఉద్యోగులను PR department లో విలీనం చేయటం.

👉 కొత్త DA వచ్చిన, పాత DA బకాయిలు లు, PRC బకాయిలు రిటైర్మెంట్ తర్వాత ఇస్తా అన్నారు కానీ ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ ఫలితంగా అవి నాలుగేళ్లకు సెటిల్ అయ్యాయి.

👉 ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ ఫలితాలను సాధించుకున్న విజయాలను ఒక కర పత్రిక రూపంలో ముద్రించి వాళ్ళు ప్రచురించారు.. అంటే ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం నిజాయితగా జరిగింది కాబట్టే కదా అంత దైర్యంఘా కరపత్రం ముద్రించి మరీ వాళ్ల విజయాలను తెలియచేస్తున్నారు.. 👌👌👌


🤬 బయట కొంతమంది సిగ్గులేకుండా మాట్లాడినంత మాత్రాన ఎవరికి ఏం ఒరిగేది ఉండదు... ఇప్పటికైనా గ్రహించండి సాటి ఉద్యోగ మిత్రులారా నోటికి మాటలు వస్తున్నాయి అని ..
ఫోన్లో డేటా ఫ్రీ గా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది మన ఉద్యోగుల ఐక్యతకు చేటు చేస్తుందీ..

ఏపీ జేఏసీ అమరావతి లాంటి సంఘాలు ఉద్యమానికి ముందుకు రాకపోతే మన ఉద్యోగుల పరిస్తితి ఏంటి ఒకసారి ఆలోచించండి ??? 


నేను మీ అందరికీ చెప్పదల్చుకుంది ఒకటే మిత్రులారా..

ఉద్యోగులకు ఏమీ చేయని సంఘాలు అన్ని మా వల్లే జరిగాయి అని డప్పు కొడుతు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు పత్రిక ముఖంగా మాట్లాడుతున్నారు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం..

 కానీ 92 రోజుల ఉద్యమాన్ని గానీ, అది నడిపిన నాయకుడ్ని గానీ, అందులో బాగస్వామి అయిన సంఘాల్ని , సభ్యుల్ని కించపరిస్తే అది మనల్ని మన ఉద్యోగుల్ని కించ పరుచుకున్నటే !!
 

ఇప్పుడికైన ఒక విషయం తెలుసుకోండి మిత్రులారా

 *🚩🚩పోరాడే సంఘాన్ని, నాయకులను విస్మరిస్తే మన బానిసత్వాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టు*  ✊✊

ఇట్లు
*ఒక విజ్ఞత కలిగిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి..*