ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రతి నెల "ఉద్యోగుల గ్రీవెన్స్ డే" నిర్వహించమని నేడు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందుకు గౌ ||ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.......బొప్పరాజు & పలిశెట్టి.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపార్టుమెంటులలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారంచేందుకు ప్రతీ నెలా అన్ని డిపార్టుమెంటులలో ఆయా విభాగాధి పతుల స్ధాయిలోను, జిల్లాస్దాయిలో కలెక్టర్లు, ఇతర జిల్లాస్దాయి అధికారులతోను గ్రీవెన్సు డే  సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తూ ఉంటే ఉద్యోగులలో ఉన్న అసంతృప్తి పోతుందని ఈనెల 13 న గౌః ముఖ్యమంత్రి గారితో  ఏపిజెఏసి అమరావతి అనుబంద సంఘాలతో జరిగిన సమావేశంలో తెలియజేసిన వెంటనే ఛీఫ్ సెక్రటరీ గారికి అదే సమావేశంలోనే  ముఖ్యమంత్రిగారు ఇచ్చిన ఆదేశాలమేరకు ముందుగా ఈనెల 23,27,30 తేదిలలో ఉద్యోగసంఘాలతో ఆయా శాఖల కార్యదర్శులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

అలాగే జిల్లా స్దాయిలో కలెక్టర్లు మరియు ఆయా విభాగాల జిల్లా స్దాయి అధికార్లుతో కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ మాదిరి ప్రత్యేకంగా "ఉద్యోగుల గ్రీవెన్స్ డే " నిర్వహించాలని తద్వారా సమస్యలు పరిష్కారానికి దోహధపడాలని ఈనెల 23 న సియస్ గారిని కూడా కలసి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన లేఖ ఇచ్చిన వెంటనే,  జిల్లా స్దాయిలలో కూడా అందరూ జిల్లా కలెక్టర్లు గ్రీవెన్స్ డే లు ప్రతి నెల మూడవ శుక్రవారం నిర్వహించాలని నేడు ప్రభుత్వం GO RT No.1233 GA(cabinet-II) department ద్వారా ఉత్తర్వులు ఇవ్వడం పట్ల పట్ల గౌః ముఖ్యమంత్రి గారికి, గౌ|| ఛీఫ్ సెక్రటరిగారికి ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటీ తరుపున హృధయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేషట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి.కృష్టనాయుడు సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

  ఏపిజెఏసి అమరావతి ఆద్వర్యంలో 92 రోజులుగా చేపట్టిన ఉద్యమం వలన అన్ని డిపార్టుమెంట్లులో పని చేన్న ఔట్ సోర్శింగు ఉద్యోగి నుండి అధికారులు వరకు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను, ఇబ్బందులను తెలుకున్నామని, కనుక ఎప్పటికప్ఫుడు సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రతినెలా జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో "ఉద్యోగుల గ్రీవెన్సుడే లు" సంబందిత అధికారులు నిర్వహించడం ఒక్కటే దీనికి పరిష్కారం అని బావించి ఈవిషయాన్ని గౌ ||ముఖ్యమంత్రి గారి దృష్టికీ  ఈవిషయన్ని తీసుకొని వెళ్లామని దీనివలన భవిష్యత్ లో ఉద్యోగులకు దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, మంచి ప్రయోజానాలు చేకురతాయని బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు లు హర్షం వ్యక్తం చేసారు.

ధన్యవాదాలతో...
 బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు