*ఉద్యోగుల ఉద్యమచరిత్రలో ఇది ఉద్యోగుల చారిత్రాత్మిక విజయం..అందుకే ఈ 92 రోజు ల ఉద్యమాన్ని విరమించుతున్నాం..ఇంకా మిగిలి ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తాం.*
>>>>>>>>>>>>>>>>>>>>>
*ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో ముందుకు వచ్ఛిన ప్రభుత్వానికి ధన్యవాదాలు*
>>>>>>>>>>>>>>>>>>>>>
*బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు,టి.వీ.ఫణిపేర్రాజు*
>>>>>>>>>>>>>>>>>>>>>
👉ఏపిజెఏసి అమరావతి ఆద్వర్యంలో సియస్ కు పిభ్రవరి 9 న  ఇచ్చిన 48 డిమాండ్లు తో మెమోరాండ ఇస్తే అందులో 37 డిమాండ్లు ఈ 92 రోజుల ఉద్యమం ద్వారా సాధించుకున్నాం..ఇంకా మిగిలి ఉన్న 11 డిమాండ్లును కూడా సాధించుకొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తాము. 

👉 ఈ 92 రోజుల ఉద్యమకాలంలో అనేక శాఖల్లో పనిచేసే చిరు ఉద్యోగుల అంటే మునిసిపల్ వర్కర్స్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల, గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగులలో అనేక బాధలు గమనించాము, విన్నాము..భవిష్యత్లో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.. 

👉 ప్రధానంగా కొన్ని శాఖల్లో, వివిధ స్కీంల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనం పొందక, సకాలంలో జీతాలు రాక, కనీస రాయితీలు లేక పడుతున్న ఇబ్బందులు చాలా బాధాకరం.

👉ఏపి జెఏసి అమరావతి లక్ష్యం...శాఖాపరమైన సంఘాల సమస్యలు పరిష్కరించడం...కలిసి రండి...మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం.

👉కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయాలని ప్రతి సందర్భంలో గొంతెత్తి మాట్లాడింది, ప్రత్యేకంగా వారి కోసం ఒక రోజు ధర్నా నిర్వహించింది ఏపీ జేఏసీ అమరావతి మాత్రమే.

👉గ్రామ వార్డ్ సచివాలయంలోని ప్రతి ఉద్యోగి సమస్యలను బయటకు తెచ్చింది, అలాగే వారి కోసం ఒక రోజు ధర్నా నిర్వహించింది ఏపీ జేఏసీ అమరావతి మాత్రమే.

   ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక, రిటైర్డు,కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యోగుల పక్షాన పోరాడేందుకు గతంలో కలిసి పనిచేసిన ప్రధాన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను దఫదఫాలు ఆహ్వానించినప్పటికీ ఎవరూ కలిసిరాని కారణంగా ఏపీ జెఎసి అమరావతి అనుబంధ సంఘాలుగా ఉన్న 96 డిపార్ట్మెంట్‌ సంఘాల మద్దతుతో ఉద్యోగుల పక్షాన పోరాడాలని ఫిబ్రవరి 5 న కర్నూలులో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఫిబ్రవరి 9 న 50 పేజీల మెమోరాండంలో 48 డిమాండ్లతో కూడిన ఉద్యోగుల సమస్యలపై మెమోరాండాన్ని గౌ॥ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఇవ్వడం జరిగింది.ఈడిమాండ్లు సాదనకోసం తేది.9-3-2023 నుండి తేదీ.8-6-2023 వరకు 92 రోజుల పాటు ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో చేపట్టిన మూడు దశల ఉద్యమ కార్యాచరణతో 48 డిమాండ్లులలో 37 సాధించుకున్నాం,ఇది ఉద్యోగుల విజయం,ఇది మణందరం విజయం,ఇంకా మిగిలిఉన్న 11 డిమాండ్లు కు సంబందించిన ఉద్యోగుల సమస్యలు  సాధించుకొనేందుకు భవిష్యత్ లో కృషి చేస్తామని  ఏపిజెఏసి అమరావతి నాయకత్వం పై నమ్మకం పెట్టు కున్న ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరగకుండే ఉండేలా వారందరికీ అండగా ఉంటామని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జెనరల్  పలిశెట్టి దామోదరరావు,
అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు  తెలిపారు.
 గురువారం గుంటూరు రెవిన్యూ కళ్యణ మండపంలో జగిరిన ఏపిజెఏసి అమరావతి నాలగప్రాంతీ సధస్సును విజయోత్సవ సధస్సుగా మార్చుతూ సధస్సు జరిగింది.ఈసదస్సు గుంటూరు జిల్లా చైర్మన్ కనపర్తి సంగీతరావు అద్యక్షతన,జిల్లా ప్రధానకార్యదర్శి పి.ఏ.కిరణ్ కుమార్ ఆద్వర్యంలో జరిగింది.
  
*92 రోజుల ఏపిజెఏసి అమరావతి ఉద్యమం ద్వారా సాధించుకున్న విజయాలు*

1. అందరి ఉద్యోగులకు GPF/ Apgli/ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పోలీస్ శాఖ  వారికి T.A బిల్లులకి సంబంధించి రు.3600 కోట్ల రూపాయలు వారి అకౌంట్ నందు జమచేయుట
2 .RTC నందు పదోన్నాతలు పొందిన 2096 మందికి PRC వర్తింపజేయుట.
3. RTC ఉద్యోగులకు OTS సాదించుట.
4 .జీతం/ పెన్షన్ రూపేనా నెలకు రు.10,000/-సంపాదన పరులకు రైస్ కార్డు మరియు ఇతర సౌకర్యాలు కల్పించుట.(FCS01-FCCSOCSS ( MISC ) 29/2021-CS-I)
5. టైపింగ్ క్వాలిఫికేషన్ రద్దు చెయ్యుటనికి అంగీకరించారు.
6 .కారుణ్య నియమకాలు చేపట్టుట( 1158 మంది RTC నందు మరియు ఇతర శాఖలలో)
7. 1/2022 సంబందించిన DA విడుదల చెయుట. ( GO MS No 66 Fin(PC-TA) Dept,Dt:11.05.2023)
8. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ( అన్ని HODల నుండి డేటా అభ్యర్థించబడినది)
9. GSWS ఉద్యోగులకు టార్గెట్స్ రద్దుచేయుట. ( Circular No ROC No.185/F/GSWS/2023,Dt: 03-05-2023)
10. 10% CPS ఉద్యోగుల వాటా ఐన 2443 కోట్లు PRAN ఎకౌంటు నందు జమచేయుట.
11. కొత్తగా ఏర్పిడిన జిల్లా కేంద్రా కార్యాలయములలో పనిచేయుచున్న ఉద్యోగులకు 16 %  HRA వర్తింపచేయుట. ( GO MS No 69 Fin(PC-TA) Dept,Dt:09.05.2023)
12.గ్రీన్ ఛానల్ ద్వార EHS ను బలోపేతం చేయుట.( GO Rt.No.353, HM & FW (I.1) Dept:12.05.2023)
13. మెడికల్ రీఎంబెర్స్మెంట్ ఉత్తర్వులు పొడిగించుట. ( G.O.MS. No.341 HH& FW (I.1) Dept Dt:21.03.2022)
14 .RPAD Act 2016 ను అమలుచేయుట
15. PTI ఉద్యోగులు అనగా ఆర్ట్స్, క్రాఫ్ట్స్, సమగ్ర శిక్షా శాఖల వారికి అనుకూల ఉత్తర్వులు ఇచ్చుట. ( GO.Rt.No.73 SE ( PRRg.II) Dept,Dt :16.05.2023)
16 .పోలీస్ శాఖ వారికి 520 కోట్లు జమచేయుట.
17 .డ్రైవర్ అసోసియేషన్ కి OD సౌకర్యము కల్పించుట. (GO.Rt.No.895 General Administration ( Services Welfare ) Dept, Dt:10.05.2023)
18. గ్రామ రెవిన్యూ సహాయకులకు డిఏ వర్తింపచేయుటకు  అంగీకరించినారు.
19. గ్రామ రెవిన్యూ సహాయకులకు 10 % వాయిదా పడిన జీతం/ గౌరవ వేతనంవర్తింపచేయుట అంగీకరించినారు.
20. AP PTD ఉద్యుగుల సంఘమునకు గుర్తింపు పొందుట. ( Lr. No. GAD01-SW0APCS/3/2020-SW dt:21.12.2020)
21. ప్రభుత్వములో కలపకముందు APSRTC ఉద్యోగులకు పాత నిబందనలు వర్తింపచేయుటకు సూత్ర ప్రాయముగా అంగికరించియున్నారు.
22. వివిధ యూనిఫాం సర్వీస్ విభాగాలకు హోంగార్డుల కోటా/ రేషియో అమలు చేయుట.   
( CMP No. 1653/Addl.Sec/2020 dt:24.08.2020)
23. DRDA సిబ్బందిని PRI&RD లో విలీనం చేయడం మరియు కేవలం 3,500 వేలు ఉన్న సిబ్బందికి గ్రాడ్యుటిని ఉద్యోగులతో సమానముగా పెంచె విషయం త్వరలో పరిష్కరించడానికి అంగీకరించి వున్నారు.
24 .మహిళా ఉద్యోగులకు ఇస్తున్న 180 రోజుల మెటర్నరటీ లీవులు ను ఆన్ డ్యూటీగా పరిగణిస్తామని అంగీకరించుట.   ( CMP No.1661/ Addl. Sec/2020 dt:18.08.2020) ( E file No. 566593)

25 .ఈ క్రింది తెలిపిన వివిధ కేటగిరికి చెందిన  గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అంగీకారం తెలిపియున్నారు.

> గ్రామ/ వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ట్ల పేరు మార్పు  మరియు పదోన్నతి ఛానల్ ఏర్పాటు చెయుటకు.
> బదిలలో దివ్యoగుల గ్రామ/ వార్డ్ సెక్రటరీలకు ప్రాధాన్యత కల్పించుట.
> మహిళా కార్యదర్సిని మహిళా పోలీస్ గా కాకుండా, మహిళా కార్యదర్సిగానే విధులు నిర్వహించేలా ఉత్తర్వులు కోరుట .
>వార్డ్ శానిటరి కార్యదర్శిని మిగిలిన వార్డు కార్యదర్శులతో సమానముగా పనివేళలు                     కల్పించుట. 
>గ్రామ సచావాలయం నుండి వర్డు సచివాలయానికి మారిన ఉద్యోగుల సర్విస్ మేటర్స్ సెటిల్ చెయ్యటం.

26. మున్సిపల్‌ ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్‌ లో ఉన్న ఈ క్రింది సమస్యలను ప్రభుత్వము పరిష్కరించుటకు అంగీకారము తెలిపియున్నారు.

 > ULBలలో వార్డు సచివాలయాల ఏర్పాటు సమయంలో గతంలో హామీ ఇచ్చిన విధంగా క్యాడర్‌లను విలీనం  చేయుట.
>కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీలు,  మున్సిపాలిటీలు మరియు మునిసిపల్  కార్పొరేషన్‌లకు సిబ్బంది నమూనా ప్రకారం క్యాడర్  స్ట్రెంత్‌ను అందించడం.
> G.O.17 సవరణ చెయ్యటము.
> మున్సిపల్ ఉద్యోగులకు ZPPF అమలు చేయుట.
> BCom అర్హత కలిగిన క్లాస్-IV ఉద్యోగులకు జూనియర్ అకౌంటెంట్ ప్రమోషన్లు కల్పించుట.
> మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు &  అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల మధ్య ఏకీకృత              సర్వీస్ నియమాల ఏర్పాటు చేయుట.

28. రూరల్ వాటర్ వర్క్స్(RWS) డిపార్టుమెంటు నందు DY. EE పోస్ట్స్ జోన్- II మరియు జోన్- III నందు క్రొత్త పోస్ట్స్ సృస్టించుట 
29 .కొన్ని సంవత్సరాలుగా పెండింగులో వున్నNGO హౌస్ బిల్డింగ్ సొసైటీలలో ఇంటి స్తలం కొరకు నమోదు కాబడిన సభ్యులందరికి ఇంటి స్తలం మంజురు విషయములో ఒక ప్రత్యెక సమావేశం  గౌ|| సిఎస్ గారి ఆద్వర్యములో నిర్వహించటానికి ఒప్పుకోవటము జరిగినది.
30.1-7-2018 మరియు 1-1-2019 రెండు డి.ఎ లు అరియర్సు సంబంధించిన డబ్బులు, సరెండర్‌ లీవుల డబ్బులతో కలిపి సెప్టెంబర్‌  - 2023 లోపు  చెల్లిస్తామని తెలిపారు.
31. రెండు డి.ఎ లు (1-7-2019 డ 1-7-2021) కలిపి పిఆర్శీ అరియర్సు అన్నీ కలిపి గతంలో  రిటైర్డు మెంటు తర్వాత ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా, నిన్నటి చర్చల్లో ప్రభుత్వం పక్షాన 10 సంవత్సరాల్లో చెల్లిస్తామని ప్రతిపాదించగా, మేము ఒప్పుకోనందున, చివరకు మొత్తం పిఆర్శీ రెండు డి.ఏ అరియర్సు కలిపి షుమారు రూః 7370 కోట్లను పదహారు వాయిదాలలో జనవరి-2024 నుండి (సంవత్సరానికి 
  4 వాయిదాలు - క్వార్టర్లీ) నాలుగు సంవత్సరాల్లో చెల్లిస్తామని ఇరువురం అంగీకరించాము.
32. రాష్ట్ర విభజన నాటికి (02-06-2014)నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా ఐదు సంవత్సారాలు సర్వీస్‌ పూర్తయి,నేటికి ఆన్‌ రోల్‌ లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరిని క్రమబద్ధీకరిస్తూ కేబినెట్‌ లో నిర్ణయం తీసుకున్నారు.,  త్వరలో డిపార్టుమెంటు వారీగా గైడ్‌ లైన్సు ఇచ్చి  
క్రమబద్దీకరణ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 
33.స్పెషల్‌ పేలు ఇచ్చేందుకు అంగీకరించారు.
34.12 పిఆర్శీ కమీషనర్‌ ను నియమించేందుకు అంగీకారం.
35.సిపియస్‌పై అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా స్పష్టత ఇస్తూ క్యాబినెట్‌లో చర్చించి మెరుగైన పింఛను విధానం ప్రకటిస్తామని తెలిపారు.
36.వైద్యవిధానపరిషత్‌ ఉద్యోగుల జీతాలు 010 పద్దుకింద జీతాలు చెల్లిస్తామని అంగీకరించారు.
37.62 సం॥లు పెంపుదల పై గురుకులాలు, యూనివర్శీటీల లో పనిచేయుచున్న నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పెంపుదలకు అంగీకరించారు. కాని  సుప్రీం కోర్టులో కేసు పెండిరగు ఉన్నందున దానిపై క్లియరెన్స్‌ వచ్చిన వెంటనే 60 నుండి 62 సం॥లకు పెంపుదల చేస్తామని అంగీకరించారు.
    
 ఈ సందర్భంగా *ముఖ్య అతిథిగా హాజరైన సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కా: సి హెచ్ నరసింగరావు గారు మాట్లాడుతూ...* ప్రభుత్వం ఉద్యమాలను అణచివేస్తున్న ఈ తరుణంలో, ఇతర సంఘాలు కలిసి రాకపోయినా సరే... 13 లక్షల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ముందుకు వచ్చిన ఏపీ జేఏసీ అమరావతి గత 92 రోజులుగా ఉద్యమం చేయడం తద్వారా అనేక సమస్యలు పరిషరించుకుని విజయం సాధించినందుకు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులుకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో కూడా ఉద్యోగుల కోసం ఏ లాంటి ఉద్యమాలు చేపట్టినా తప్పకుండా సీఐటీయూ నాయకత్వం ఏపీ జేఏసీ అమరావతి పక్షాన నిలబడి ఉంటుందని తెలిపారు. 

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల కోసం నిజాయితీగా చేస్తున్న పోరాటంలోఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవిగా భావించి వాటిని పరిష్కరించేందుకు అంగీకరించిన ప్రభుత్వానికి,సియస్ గారికి,ఇతర ఉన్నతాధికార్లుకు మరియు ఉద్యమానికి సహకరించిన ఏఐటియుసి & సిఐటియు నాయకత్వానికి,ప్రీంటు & ఎలక్ట్రానిక్ మిడియా మిత్రూలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు,టి.వి.ఫణిపేర్రాజు తెలిపారు.

అలాగే ఈ ఉద్యమాన్ని నిజాయితీగా 92 రోజులపాటు రాష్ట్ర సంఘం ప్రతిపాదించిన కార్యాచరణలో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి జిల్లా చైర్మన్/ప్రధాన కార్యదర్శి మరియు అయా జిల్లాల కార్యవర్గ సభ్యులు అందరికీ శిరస్సు వంచి వారికి బొప్పరాజు గారు నమస్కరించారు.

   ఈసధస్సులో యస్. కృష్ణమోహన్.చేబ్రోలుకృష్ణమూర్తి,సంసాని శ్రీనివాస రావు,
యస్.మల్లేశ్వర రావు.జి.బ్రహ్మయ్య, కె. అంజనేయకమార్,డి.జి.ప్రసాధ్ రావు,జి.జ్యోతి ,అరలయ్యా
,కుమార్ రెడ్డి,S.B.T.S .దేవి,
యస్. శివకుమారీ రెడ్డి తోపాటు వివిదడిపార్టు మెంటు సంఘాలు నాయకులు,26 జిల్లాల చైర్మన్లు,ప్రధానకార్యదర్శులు పాల్గొని మాట్లాడారు.
ఈసదస్సులో సూమారు వేలాదిమంది ఉద్యోగులు పాల్గొన్నారు.

 *ఈ సధస్సు ప్రారంబానికీ ముందు మూడుబొమ్మల సెంటర్ నుండి రెవిన్యూకళ్యాణమండపం వరకు భారిర్యాలీ ని నిర్వహించారు.*
     
ధన్యవాదాలతో...

*బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు*