ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి చొరవచూపిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఏపిజేఏసి అమరావతి నాయకులు
👉 ప్రతి శాఖ అధిపతిచే ఆయా శాఖల ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు గల ఉద్యోగ సంఘాల నాయకులచే నెలకొకసారి సమావేశాలు నిర్వహించెలా ప్రభుత్వం ఆదేశించాలి..
👉 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రైస్ కార్డులు మరియు సంక్షేమ పథకాలు కొనసాగించాలి
👉 1.9.2004 ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులకు కేంద్ర నిబంధనల ప్రకారం పాత పింఛను విధానం అమలు చేయాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక, రిటైర్డు,కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపి ఆర్దిక, ఆర్దికేతర సమస్యలు కొన్ని సమస్యలు పరిష్కరించినందులకు
ఉద్యోగుల పక్షాన మంగళవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపుకార్యాలయంలో గౌ ||శ్రీ.వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి తో ఏపి జెఏసి అమరావతి అనుబందసంఘాలు నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గోన్న ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజువెంకటేశ్వర్లు, సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు,అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు,కోశాధికారి వి.వి.మురళికృష్టనాయుడు తో పాటు 23 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈసమావేశంలో ప్రధానంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలుపై గత 92 రోజులుగా చేపట్టిన ఉద్యమ ఫలితంగా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకొని ప్రధానంగా ఇచ్చిన 48 డిమాండ్లులో 37 డిమాండ్లును పరిష్కరించిన ముఖ్యమంత్రి గారికి,మంత్రివర్గఉపసంఘం సబ్యులకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ధన్యవాదాలు తెలియజేసారు.
👉 ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దికరించేందుకు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయము ఇది, దీనివలన మిగిలిన కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఏదో ఒకరోజు క్రమబద్దీకరీంచ బడతామన్న మనోదైర్యం వచ్చిందని అన్నారు.
👉అలాగే సిపియస్ ను మార్పుచేసి జిపియస్ గా చేసిన మార్పులు చేయాలన్న నిర్ణయం పై కూడా మాట్లాడూతు ఈ జిపియస్ స్కీమ్ సుమారుగా ఒపియస్ స్కీమ్ కు దగ్గర్లో ఉన్నందున కాస్తా పెద్దమనసు చేసుకొని మిగిలిన ఓపియస్ బెనిఫిట్స్ ను ఇచ్చేవిదంగా నిర్ణయాలు చేసి సిపియస్ ఉద్యోగులలో ఆనందం నింపాలని విజ్ఞప్తి చేసారు.
👉అంతే కాకుండా ఔట్ సోర్శింగు ఉద్యోగులను CFMS లో ప్రభుత్వఉద్యోగులుగా చూపించి నందున వారికి, వారి కుటుంబ సబ్యులకు కూడా రేషన్ కార్డులతోపాటు ప్రభుత్వసంక్షేమపధకాలు కూడా రద్దు చేసినందున తిరిగి వాటిని పునరుధ్దరీంచాలని కోరారు.
👉 ప్రతి శాఖ కార్యదర్శి గారిచే ఆయా శాఖల HoD లను కలిసి ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు గల ఉద్యోగ సంఘాల నాయకులచే నెలకొకసారి సమావేశాలు నిర్వహించెలా ప్రభుత్వం ఆదేశించాలని కోరారు.
👉 1.9.2004 ముందు నియామక ప్రక్రియ పూర్తయి, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారందరికీ అనగా 2003-DSC టీచర్ రిక్రూట్మెంట్, 2003 - పోలీసు రిక్రూట్మెంట్, 2003 - group-II రిక్రూట్మెంట్ వెరసి షుమారు ఈ రాష్ట్రంలో 9000 మందికి పాత పింఛను విధానం అమలు చేయాలని గౌ||ముఖ్యమంత్రి గారిని కోరారు.
👉 అంతేకాకుండా ఉద్యోగులు సమస్యలు పేరుకు పోకుండా ఉండాలంటే, ప్రతినెలా అన్ని డిపార్టుమెంటు హెడ్ ఆఫీసులోను, అన్నిజిల్లాలలోను ప్రభుత్వగుర్తింపు సంఘాలతో సంబంధిత శాఖ రాష్ట్ర స్థాయి కార్యదర్శి గారితో సమావేశాలు, గుంటూరు జిల్లా కలెక్టర్ మాదిరి రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ గార్లచే ఉద్యోగుల గ్రీవెన్సుడేలు నిర్వహించాలని కోరారు. అని ఈసమావేశంలో చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ తెలియచేసారు.
ఈసమావేశంలో ఏపిజేఏసి అమరావతి సెక్రటరీజెనరల్ మరియు ఏపిపిటిడి(ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రఅధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు మాట్లాడు ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం చేసి 50 వేల మందికి ఉద్యోగ బద్రత కల్గించి నందుకు,ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేఅన్నిసౌకర్యాలు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ విలీనం ముందు ఆర్టీసి ఉద్యోగులకు ఉన్న(మెడికిల్ సౌకర్యాలతోపాటు) అన్నిసౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేసారు.
ఈసమావేశంలో మున్సిఫల్ ఎంప్లాయీస్ అసోహియేషన్ రాష్ట్రఅధ్యక్షులు యస్.కృష్టమోహన్, దివ్యంగుల అసోషియేషన్ రాష్ట్రప్రధానకార్యదర్శి ఏ.శ్రీనివాసరావు, ఏపివర్క్ఆర్ట్&పిఇటి ఇనస్ట్రక్టర్సు యూనిటీ వెల్పైర్ అసోషియేషన్ రాష్ట్రఅధ్యక్షురాలు సైకం శివకుమార్ రెడ్డి, ఏపిగవర్నమెంటు డాక్టర్స్ అసోషియేషన్ రాష్ట్రఅధ్యక్షులు డాఃడి.జయధీర్,ఏపికాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె.సుమన్,ఏపి గ్రామవార్డుసచివాలం ఉద్యోగులసంఘం రాష్ట్రఅధ్యక్షులు వి.అరలయ్య ,కాంట్రాక్టుఉద్యోగుల సంఘం నాయకురాలుటి.ఇందిరా ప్రభావతి గార్లు వారివారి డిపార్టీమెంటు ఉద్యోగులకు జరిగిన ప్రయోజనాలపై మాట్లాడూతు మూఖ్యమంత్రీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈసమావేశంలో చేబ్రోలుకృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి, APRSA, సంసాని శ్రీనివాస రావు రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్లు సంఘం, యస్.మల్లేశ్వర రావు, రాష్ట్ర అధ్యక్షుడు , రాష్ట్ర నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం, జి.జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి, ఏపీ జేఏసీ అమరావతి, వి.గిరికుమారెడ్డి రెడ్డి, రాష్ట్ర కోశాధికారి, APRSA, యస్.శివకుమారి రెడ్డి, రాష్ట్ర అధ్యక్షురాలు , PTI , సమగ్ర శిక్ష, డి.శ్రీనివాస్, చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి, NTR జిల్లా, ఆర్.యన్.దివాకర్ రావు,చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి, అనంతపురము జిల్లా, కె.రమేష్ కుమార్,చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా, జి.సులోచనమ్మ, రాష్ట్ర అధ్యక్షురాలు, రాష్ట్ర ANMs assn., తధితర నాయకులు పాల్గోన్నారు.
ఈసమావేశం ప్రారంబంలో ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి తరుపున నాయకులు గౌ ||ముఖ్యమంత్రి గారికి సాలువాతో సత్కరించారు.
బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు
0 Comments
Thanks For Your Valuable Feed Back