👉 మా 85 రోజుల ఏపి జెఏసి అమరావతి ఉద్యమాన్ని ప్రభుత్వం గుర్తించి 50 పేజీల డిమాండ్లు నోటీసుపై నేడు ప్రత్యేక చర్చలు జరిపిన సియస్ గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు.
👉డిపార్టుమెంటు ఉద్యోగుల అనేక ఆర్ధికేతర సమస్యలు పరిష్కారించేందుకు సానుకూలత వ్యక్తం చేసిన ప్రభుత్వం..
👉 ప్రధానమైన ఆర్దిక పరమైన అంశాలు డిఎ, పీ ఆర్సి అరియర్స్, పే స్కేల్స్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, 62 సంవత్సరాలు వయోపరిమితిని పబ్లిక్ సెక్టార్, గురుకులాలు, యూనివర్సిటీ ఉద్యోగులకు వర్తింపు, 12వ పీ అర్సి కమీషనర్ నియామకం తదితర సమస్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యేంతవరకు ఉద్యమం యధాతదంగా కొనసాగుతుంది.
👉 ఈనెల 10 లోగా ప్రధానమైన ఆర్ధిక అంశాలపై స్పష్టత ఇస్తామని తెలిపారు
👉 ఈనెల 10వ తేదీ తర్వాత నాలుగవ దశ ఉద్యమాన్ని ప్రకటిస్తాం..
👉 ఈ నెల 8 న గుంటూరులో నాలగవ ప్రాంతీయసధస్సును నిర్వహిస్తూన్నాం.
బొప్పరాజు & పలిశెట్టి దామోదర్ రావు
ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ఉద్యోగ,ఉపాధ్యయ, కార్మిక,రిటైర్డు, కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్ధిక & అర్ధికెత్తర సమస్యలు పరిష్కరించాలని ఫిభ్రవరి 13 న ప్రభుత్వప్రధానకార్యదర్శి గారికి ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి ఇచ్చిన 50 పేజీల డిమాండ్లు సాదనకోసం నేటికి 85 రోజులుగా వివిద ధశలలో జరుగుతున్న ఉద్యమాలు గుర్తించి ప్రభుత్వం నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో చర్చలు జరిపినందుకు ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ధన్యవాదాలు తేలియజేస్తున్నాం.
అయితే ఇప్పటికే ఈ ఉద్యమం ప్రారంబించేక ఏపిజెఏసి అమరావతి తో వివిధ సందర్బాలలో ప్రభుత్వ పెద్దలతోను, ఉన్నతాధికార్లు తోను చర్చలు జరిగిన ప్పటికీ ప్రత్యేకించి శాఖాపరమైన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు నోటీసు ఇచ్ఛి ఉద్యమం లో ఉన్న ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి, అనుబంద సంఘాల నాయకత్వాలతో ప్రత్యేకించి చర్చలు జరపి సమస్యలు పరిష్కారాని దృష్టి పెట్టాలని చేస్తున్న డిమాండ్ మేరకు గురువారం గౌ|| సియస్ గారి క్యాంపుకార్యాలయంలో షుమారు మూడు గంటలపాటు జరిగిన చర్చలు లలో వివిధ డిపార్టుమెంటు లకు చెందిన ఉద్యోగుల సమస్యలు పరీష్కారం కొరకు స్పష్టతను ఇచ్చారు. అలాగే కొన్ని సమస్యలు పరిష్కారానికి ఇప్పటికే కొన్ని జిఓ లు ఇచ్చామని, మిగిలిన సమస్యలు పై కుడా సంబందిత డిపార్టు మెంటు ఉన్నతాధికార్లుకు నోటీసులో ఉన్న డిమాండ్లు పరీష్కరించేందుకు ఆదేశాలు కూడా ఇచ్చామని తేలియజేసారు.
👉 సూమారు మూడు గంటలు పాటు జరిగిన చర్చలు చాలా సానుకూల వాతావరణంలో జరిగాయని, ఏది ఏమైనాసరే ఇంకా పెండింగు ఉన్న ఆర్దిక,ఆర్దికేతర ప్రధానమైన ఆర్దిక పరమైన అంశాలు అనగా నాలుగు పెండింగు డిఎ, పీ ఆర్సి అరియర్స్, పే స్కేల్స్, స్పెషల్ పే లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, 62 సంవత్సరాలు వయోపరిమితిని పబ్లిక్ సెక్టార్, గురుకులాలు, యూనివర్సిటీ ఉద్యోగులకు వర్తింపు, 12వ పీ అర్సి కమీషనర్ నియామకం తదితర సమస్యలపై
పూర్తిస్దాయిలో పరిష్కారానికి సంబందించి స్పష్టమైన లిఖిత పూర్వక హామి ఇచ్చేంతవరకు మా ఉద్యమం యాదా విధిగా కొనసాగుతుందని ఈనెల 8 న గుంటూరులో తలపెట్టిన నాలుగవ ప్రాంతీయ సధస్సుకూడా యదావిధిగా జరుగుతుందని ఏపిజేఏసి అమరావతి స్టెట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసో షియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి.మురళికృష్టనాయుడు గురువారం సియస్ తో జరిగిన చర్చలు అనంతరం తెలిపారు. ప్రధానమైన ఆర్ధిక పరమైన అంశాలపై వీలైనంత త్వరగా పరిష్కారం అయితే ఉద్యమాన్ని నిలుపుదల చేసే విషయం చర్చించుకుని తెలుపుతాము అన్నారు.
గురువారం జరిగిన చర్చలలో ప్రధానంగా
✔️ మహిళా ఉద్యోగులకు ఇచ్చే మెటర్నటీలీవులు పీరియడ్ కాలాన్ని కూడా "డ్యూటీ పీరియడ్" గా పరిగణించాలని,
✔️గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు సమస్యలులో గ్రామ/వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ పేరు మరియు పదోన్నతి ఛానల్ కల్పించడం, అందరూ ఉద్యోగులమాదిరి శానిటరీ సెక్రెటరీ లు కూడా పని వేళలు గురించి స్పష్టత ఇవ్వాలని, మహిళా సంరక్షణ కార్యదర్శి నీ మహిళా పోలీసు గా పరిగణించవద్దని, గ్రామ నుంచి వార్డ్ సచివాలయం కు వచ్చిన కార్యదర్శులకు సర్వీస్ మేటర్స్ లో న్యాయం చేయాలని, గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల బదిలీల్లో తక్షణమే దివ్యంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరగా చాలా సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.
✔️లాంగుపెండింగులో ఉన్న మున్సిఫల్ ఎంప్లాయిస్ సమస్యలు ప్రధానంగా యూనిఫైడ్ సర్వీస్ రూల్స్, GO 17 అమెండ్మెంట్, ZPPF వర్తింపు, కొత్తగా మునిసిపల్ లిమిట్స్ లో చేరిన పంచాయితీలకు అనుగుణంగా cadre strength పెంచడం అంశాలపై స్పష్టమయిన ఆదేశాలు ఇస్తామని తెలిపారు.
✔️రెవెన్యూ శాఖలో పనిచేసే విఆర్ఏ ల డిఏ కోతకు సంబందించి, VRA నుండి పదోన్నతులు పొందిన గ్రేడ్-II విఆర్ఓ లకు పే స్కేల్ ఇవ్వడం విషయంలో చీఫ్ కమిషనర్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ గారిచే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
✔️ఆర్ టి సి (ఏపిపిటిడి) ఉద్యోగులకు విలీనం కు నియామకం అయిన ఆర్టీసీ ఉద్యోగులకు విలీనంకు ముషదున్న పదోన్నతుల్లో పాత విద్యా అర్హతలను కొనసాగించాలని కోరగా చాలా సానుకూలంగా స్పందించారు.
✔️పోలీసు శాఖలోని హోమ్ గార్డు సమస్యలుపైన,1380 మంది బాషా పండితుల కు స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు మంజురు చేయడం, వర్కుచార్టుడ్ ఎంప్లాయిస్ సమస్యలు పైన,
✔️ప్రభుత్వకార్యాలలో ప్రత్యేకంగా రెవెన్యూ శాఖలాంటి శాఖలలో కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని,
✔️ఆర్డబ్లుయస్ ఇంజనీరింగ్ శాఖలో డిప్యూటీ ఇ.ఇ పోస్టులు జోన్ - 2,జోన్- 3 లలో మంజూరు,
✔️డిఆర్డిఏ ఉద్యోగులకు gratuity 3.50 లక్షల నుండి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెంపుదల, వారిని పిఆర్ & ఆర్.డి డిపార్టుమెంటు లో విలీనం చేయడం,
✔️అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్డీకరణ,
✔️ఔట్ సోర్శింగు ఉద్యోగుల జీతాలు పెంపుదల,
✔️కెజిబియస్ టీచర్లకు మినిమం టైం స్కేల్ ఇవ్వడం,
✔️వి అర్ ఏ లకు కరోనా కాలంలో నిలుపుదల చేసిన 10% జీతాలు తక్షణమే చెల్లించాలని కోరగా అన్నీ అంశాలపై సి యస్ గారు చాలా సానుకూలంగా స్పందించి, కొన్ని అంశాలపై అప్పటికప్పుడే సంబంధిత అధికారులు తగు ఆదేశాలు జారీ చేశారు.
👉 అలాగే ఇంకా మిగిలిఉన్న ప్రధానమైన ఆర్దికపరమైన సమస్యలలో పిఆర్శీ,డిఏ బకాయిలు,ఎర్నిలీవులు, పెండింగు ఉన్న కొత్తడిఏలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దికరణ తధితర ప్రధాన అంశాలపై త్వరలో మూడు, నాలుగు రోజుల్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని అన్నీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రకటిస్తామని గౌ|| సీ యస్ గారు తెలిపారని బొప్పరాజు,పలిశెట్టి దామోదరరావు, ఫణిపేర్రాజు తెలిపారు.
👉 అయితే ఇప్పటికే గత మూడు దశల ఉద్యమ కాలంలో (ప్రతి దశ ఉద్యమంలో) వివిధ డిపార్టు మెంటు సంఘాలకు సంబందిన అనేక (మేము ఇచ్చిన 50 పేజీల మెమోరాండంలో) అంశాలు పరిష్కరింప బడిన విషయం మనందరికీ తెలిసిందే... అందులో ప్రధానంగా షుమారు అరు వేల కోట్ల రూపాయల gpf, APGLI, TA, ELs, రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం తో పాటు, అతి తక్కువ పెన్సన్ వస్తున్న ఆర్టీసిలో రిటైర్ అయిన ఉద్యోగులకు, పాత గ్రామ అధికారులకు అతితక్కువ పెన్సన్ వస్తున్న వారికీ ఫ్రభుత్వ పధకాలు అన్నివర్తింప జేయాలని డిమాండ్ చేయగా ప్రభుత్వం 10 వేలు రూపాయలు లోపు నెలకు పెన్సన్ తీసుకుంటున్న వారందరికీ ప్రభుత్వపదకాలు వర్తించే జిఓ వచ్చింది. గ్రామవార్డు సచివాలయఉద్యోగులకు బదిలీలు కు అంగీకారంతో పాటు డ్యూటీలలో ఇచ్చిన టార్గెట్ సిష్టంనుండి మినహాయించరు. ఆర్టీసి లో ప్రధాన సంఘాలకు గుర్తింపు ఇమ్మని చేసిన డిమాండ్ మేరకు ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ లకు గుర్తింపునిస్తూ ఆదేశాలు త్వరలో ఇవ్వనున్నారని తెలిపారు. దివ్యంగులకు కేంధ్రప్రభుత్వం అంగీకరించిన చట్టాలను అనుసరీంచి ఏపి లో కూడా అమలు చేసేందుకు తగిన ఆదేశాల ఇచ్చారు.
సీ పీ యస్ ఉద్యోగుల పెన్షన్ ఫండ్ కు 2443 కోట్ల రూపాయల డబ్బులను ప్రభుత్వం చెల్లించింది.
అనేకమంది కరోనా ముందు, కరోనా కాలం, కరోనా తర్వాత చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం క్రింద ఉద్యోగాలు కల్పించారు.
అలాగే సమగ్రశిక్ష లో పార్ట్ టైం పనిచేసే -వర్కుఆర్ట్సు పిఇటి ఇనస్ట్రర్సు ఉద్యోగులకు సంబందిన గతంలో డ్యూటీసర్టిఫికేట్ కు ఉన్న నిభందనలమేరకు యం.ఇ.ఓ సంతకం మినహాయించారు. వేతానాలు పెంపుదలకు అంగీకరించారు. ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్ణ మహిళాఉద్యోగులవలే అదనంగా ఐదు రోజు క్యాజువల్ లీవులు మంజూరుకు అంగీకరీంచారు. ఇయస్ఐ/ఇపియఫ్ అమలుకు,బదీలకు అంగీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పటికే ఇచ్చారు.
అలాగే కొత్తగా ఏర్పడిన 8 జిల్లాలకు హెచ్.ఆర్.ఏ కూడా పెంపుదల చేస్తూ జిఓలు విడుదల అయ్యాయని తెలిపారు. పోలీసు సోదరులకు TA మరియు సరెండర్ లీవులు దాదాపుగా 700 కోట్లు చెల్లించిన విషయం తెలిసిందే.
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ క్రింద సరైన వైద్యం ఉద్యోగులకు అందెందుకు మేము చెల్లించే నెల వారీ చందాలు నేరుగా ట్రస్ట్ ద్వారా ఆసుపత్రులకు డబ్బులు చెల్లించడం లాంటి ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే.
*ఇవన్నీ ఉద్యమ ఫలితాలే అని బొప్పరాజు & పలీ శెట్టి దామోదర్ తెలిపారు.*
ఈసమావేశంలో పాల్గోన్న ఏపిజెఏసి అమరావతి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు,పలిశెట్టి దామోదర రావు( ఆర్టిసి),టి.వి.ఫణి పేర్రాజు (కో ఆపరేటివ్),వి.వి. మురళీ కృష్ణ నాయుడు( పంచాయతీ రాజ్),. యస్. కృష్ణమోహన్ (మునిసిపల్)
ఆర్.వసంతరాయులు,చేబ్రోలు కృష్ణమూర్తి( రెవెన్యూ),S. శ్రీనివాస రావు prsdt (డ్రైవర్స్ Assn) యస్ .మల్లేశ్వర రావు, Prsdt (క్లాస్ IV Emps Ass,Dr.Jaidheer prsdt (Govt.Doctors Assn),జి.బ్రహ్మయ్య(VRAs)
కె. అంజనేయకమార్ (చంటి) (VROs)ఎస్. గోవిందు (హోం గార్డ్స్)జి. శివానంద రెడ్డి (SLTA) కె. కలంధర్ ,గిడ్డయ్య,జి.జ్యోతి (గ్రామ వార్డు)అరలయ్యా (గ్రామ వార్డు),కుమార్ రెడ్డి (RWS)
,SBTS (KGBV) రాష్ట్రఅధ్యక్షురాలు దేవి,
,యస్. శివకుమారీ రెడ్డి ( యూనిటీ టీం),ఎ.శ్రీనివాసరావు GS ( Differently abled Assn),డి.వి.సుబ్బారావు prsdt (రిటైర్డ్ VROs అసన్)
కె.ఆర్.ఆంజనేయులు ( APSRTC రిటైర్డ్ Emps) తధితరులు చర్చలలో పాల్గొన్నారు.
ధన్యవాదాలతో...
బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు
0 Comments
Thanks For Your Valuable Feed Back