సిపియస్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను ఏపి లో గత నాలుగేళ్లుగా ఎందుకు అమలు చేయలేక పోతున్నారో సమాదానం చెప్పాలి...!? బొప్పరాజు & పలిశెట్టి డిమాండ్
ఈ రోజు శనివారం రాష్ట్రవ్యాప్తంగా 26- జిల్లాలలో చనిపోయిన సిపియస్ ఉద్యోగి కుటుంబాలను, పదవీవిరమణ చేసిన అనంతరం ఫెన్సన్లు లేక ఇబ్బందులు పడుతున్న సిపియస్ కుటుంబాలను ఏపిజెఏసి అమరావతి రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకుల ఆద్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పరామర్శయాత్రలు చేపట్టారు. ఈసందర్బంగా పచ్చిమ గోదావరి జిల్లా (భీమవారం) లో సిపియస్ కుటుంబాల పరామర్శ యాత్రలో పాల్గొన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.
సిపియస్ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే ఆ ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకొనే విదంగా కేంధ్ర ప్రభుత్వం 2021 లో గజిట్ నెంబర్:178, Dt;31/03/2021 ద్వారా చనిపోయిన CPS ఎంప్లాయ్ PRAN(ప్రాన్)అకౌంట్ లో ఉద్యోగి వాటా మొత్తం డబ్బులు ఉద్యోగి కి తిరిగి చెల్లించి, ఆ కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు స్పష్టంగా ఇచ్చినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చనిపోయిన ఉద్యోగి ప్రాన్ అకౌంట్లో ఉద్యోగి వాటా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. దీనివల్ల గత రెండు సంవత్సరాలుగా చనిపోయిన సిపియస్ ఉద్యోగుల కుటుంబాలకు తీవ్రమైన ఆర్దిక నష్టం జరుగుతుంది. అసలే అతి తక్కువ పెన్షన్ వచ్చే పరిస్థితుల్లో అనేక ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న ఆ కుటుంబాలను అడుకోవల్సింది పోయి, కేంధ్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టలనే అమలు చేయకపోవడం CPS ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేయడమేనని తెలిపారు.
కానీ, పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం మాత్రం ఈ చట్టాన్ని అమలు చేస్తూ సిపియస్ కుటుంబాలను ఆదుకుంటుంటే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిపియస్ ఉద్యోగుల పట్ల అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్దం కావడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం చనిపోయిన సిపియస్ ఉద్యోగి ప్రాన్ అకౌంట్లో ఉద్యోగి వాటా డబ్బులు తిరిగి ఇచ్చే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు,అసోషియేట్ చైర్మన్ ఫణిపేర్రాజు,కోశాధికారి వి.వి.మురళీ కృష్టంనాయుడు డిమాండ్ చేసారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం నాలుగు సంవచ్చరాల క్రితం, సెంట్రల్ గజిట్ నంబర్:41, DT:31/01/2019 ద్వారా ఏప్రిల్ -2019 నుండి CPS ఉద్యోగుల పెన్షన్ ఫండ్ కి ఇప్పటివరకు ప్రభుత్వo చెల్లిస్తున్న వాటా 10% నుంచి 14% శాతానికి పెంచారు. ఈ ఉత్తర్వులను ఒరిస్సా,కర్ణాటక,మధ్య ప్రదేశ్,జార్ఖండ్,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అమలు చేశారు. కానీ మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు వరకు దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రభుత్వం సమాదానం చెప్పాలని బొప్పరాజు ప్రశ్నించారు. దీనివల్ల గత నాలుగేళ్లుగా సిపియస్ ఉద్యోగులు కోట్లాది రూపాయల నష్ట పోయారు.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ MEMO NO:57, DT:17/02/20 ద్వారా సిపియస్ అమలుకు ముందు అంటే తేదిః01.01.2004 ముందు recruitment నోటిఫికేషన్స్ ఇచ్చి, CPS అమలు లోకి వచ్చిన తరువాత అంటే తేదిః01.01.2004 తర్వాత ఉద్యోగులుగా చేరిన వారికి పాత పెన్షన్ ను పునరుద్ధరించాలి అని స్పష్టంగా చెప్పినప్పటికీ, నేటికీ మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు,ఈవిదానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్టుమెంట్లు అయిన రైల్వే బోర్డు, ఢిల్లీ, పంజాబ్,కర్ణాటక, గోవా రాష్ట్రాలలో ఈ మెమో అమలు చేశారు. కానీ మన రాష్ట్రం లో నేటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. ఈ రాష్ట్రం అలా 2003 లో notification మరియు ప్రాసెస్ పూర్తి అయి, 2004 లో జనవరి తర్వాత చేరిన వాళ్ళు షుమారు పది నుండి 12 వేల మంది (2003- DSC, 2003- Group-II, 2003- police recruitment) నియామకాలు పొందిన వాళ్ళు ఉన్నారు. కనుక తక్షణమే ప్రభుత్వం 2003 నాటికి ప్రాసెస్ పూర్తి అయిన ఉద్యోగులందరికీ పాత పింఛను విధానం క్రిందకు తీసుకువస్తూ, వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
ఈ ఉత్తర్వులు అమలు చేయకపోవడం వలన తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు రిటైర్ అయిపోతే, పాత పెన్షన్ పొందాల్సిన వాళ్ళు, ప్రభుత్వ నిర్లక్ష్యం వలన వాళ్ళకి కేవలం రెండు, మూడు వేల రూపాయల తక్కువ సిపియస్ పెన్షన్ వస్తుంది. దీనినిబట్టి ఈ ప్రభుత్వానికి సిపియస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం పట్ల ఎంత నిబద్దత ఉందో తెలుస్తుందని, అందుకే ఇప్పటికైనా సిపియస్ ఉద్యోగులంతా కలసి రాష్ట్రంలో ఉన్న ఒక్కతాటిపైకి వచ్చి సిపియస్ ఉధ్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం చిత్తశుద్దితో పోరుబాటసాగిస్తున్న ఏపిజెఏసి అమరావతి కి రాష్ట్రకమిటి మద్దతుగా నిలవాలని చైర్మన్ & సెక్రటరీ జెనరల్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,పలిశెట్టి దామోదరరావు విజ్ఞప్తి చేసారు.
బొప్పరాజు & పలిశెట్టి
0 Comments
Thanks For Your Valuable Feed Back