ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ(reg no-76/2022)
ఈ నెల 27న తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం, విజయవాడ లో జరుగు ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ (AP GW SEWO) రాష్ట్ర మహాజన సభ పోస్టర్ను ఆవిష్కరించిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు , సెక్రెటరీ జనరల్ వై వి రావు
రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగి AP GW SEWO నిర్వహించే రాష్ట్రమహాజన సభకు తరలివచ్చి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యతను చాటాలి: బొప్పరాజు& వై వి రావు.
*రాష్ట్రంలోని గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగి నవంబర్ 27న ఒక్కరోజు రాష్ట్ర మహాజన సభ కోసం తరలిరండి..మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా సంవత్సరంలో మిగిలిన 365 రోజులు మేము కృషి చేస్తాము: బొప్పరాజు& వై వి రావు.*
**
ఈ రోజు అనగా ది.6/11/2022 న విజయవాడ గవర్నర్ పేట లోని రెవెన్యూ భవన్ నందు జరిగినటువంటి AP GW SEWO రాష్ట్ర మహాజనసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మరియు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల మండల స్థాయి సమీక్షలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవ ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు గారు మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ (ఏపీ జేఏసీ అమరావతికి అనుబంధం) ఆధ్వర్యంలో జరుగు రాష్ట్ర మహాజనసభకు ప్రతి ఒక్క గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగి తరలివచ్చి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యతను చాటి మీ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలని కోరుతూ "గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర మహా జన సభ" పోస్టర్ ను బొప్పరాజు గారు విడుదల చేశారు.
👉 అతి తక్కువ కాలంలో రాష్ట్రంలోని 26 జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ తరపున కార్యవర్గాలు ఏర్పాటు చేసిన ఘనతAP GW SEWO కు ఉందని.. ఈనెల 27వ తేదీన రాష్ట్ర మహాజనసభలో రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఎన్నుకొని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఏకతాటిపైకి వచ్చే విధంగా అడుగులు వేయబోతున్న ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయం సంక్షేమ సంస్థకి అనుబంధంగా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి సహకారం అందించాలని ఈ సందర్భంగా బొప్పరాజు గారు తెలియజేశారు.
👉 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర మహజనసభ కోసం కేటాయించే ఒక్కరోజు... మీకోసం మేము సంవత్సరంలో మిగిలిన 365 రోజులు పని చేసే విధంగా ఉంటాయని తెలియజేస్తూ రాష్ట్ర మహాజనసభనీ విజయవంతం చేసి మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని సుగమం చేసుకోవాలని తెలియజేశారు..
👉 *ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్ గౌరవ వైవి రావు గారు మాట్లాడుతూ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల ఐక్యతను చాటే సమయం ఆసన్నమైందని మీయొక్క ఐక్యతను చాటి మీ సమస్యలన్నిటికీ చరమగీతం పాడే దిశగా అడుగులు వేయాలని తెలియజేశారు...*
👉 ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర adhoc committee సభ్యులు శ్రీ V అర్లయ్య గారు, షామీర్ హుస్సేన్ గారు, జ్యోతి గారు..ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర కోశాధికారి VV మురళీకృష్ణ నాయుడు గారు, NTR జిల్లా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ దొప్పలపుడి ఈశ్వర్ గారు, గుంటూరు జిల్లా చైర్మన్ కనపర్తి సంగీతరావు గారు , పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ K.రమేష్ కుమార్ గారు, ప్రకాశం జిల్లా చైర్మన్ RV కృష్ణ మోహన్ గారు.. AP GW SEWO NTR, Krishna, Guntur,Baptla , prakasam, Eluru మరియు west Godavari జిల్లాల నాయకులు మరియు ఉమ్మడి కృష్ణా జిల్లా మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.
*B. జగదీశ్,*
అధ్యక్షులు,
AP GW SEWO,
Krishna District Branch.
*G.దుర్గా రావు,*
అధ్యక్షులు,
AP GW SEWO,
NTR District Branch.
0 Comments
Thanks For Your Valuable Feed Back