ఆంధ్రప్రదేశ్ విలేజ్
రెవిన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్, గ్రేడ్-2 వి.ఆర్.ఓస్. అసోసియేషన్
డైరెక్ట్ రిక్రూట్మెంట్ వి.ఆర్.ఓస్. అసోసియేషన్ వారు సంయుక్తంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు
నిర్వహించిన సమావేశము నందు చర్చించిన అంశములు.

6వ రెవిన్యూ ఉద్యోగుల క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమములు ది.11-11-2022వ తేది నుండి
ది.13-11-2022వ తేది వరకు గుంటూరు, నాగార్జున యూనివర్శిటీ నందు జరుపతలపెట్టిన
రెవిన్యూ ఉద్యోగుల క్రీడలకు విఆర్ఓలు హాజరగుటకు గాను ఆంధ్రప్రదేశ్ సర్వే సెటిల్మెంట్స్
& ల్యాండ్ రికార్డు కమీషనర్, విజయవాడ వారు ఇచ్చిన ఉత్తర్వు నెం.1102/2022 ద్వారా
గ్రేడ్-2 వి.ఆర్.ఓ.లకు సర్వే ట్రైనింగ్ ఫైనల్ పరీక్షను ది.13-11-2022వ తేదీన నిర్వహించుటకు
ఉత్తర్వులు ఇచ్చినందున సదరు రెవిన్యూ క్రీడలకు హాజరగు నిమిత్తము సర్వే ట్రైనింగ్ పరీక్ష
తేదిని మార్పు చేయవలసినదిగా కోరుచూ కమీషనర్ గారికి మెమోరాండం సమర్పించుట గురించి.
నిన్న జరిగిన ప్రెసీట్ వి.ఆర్.ఓ. అసోసియేషన్ ప్రెసిడెంట్గా చెప్పుకొని తిరుగుతున్న రవీంద్ర
రాజు గారు అనబడే వారు గ్రేడ్-2 వి.ఆర్.ఓ.ల పరీక్ష వాయిదా వేయాలని చెప్పే అర్హత బొప్పరాజు
వెంకటేశ్వర్లు గారికి లేదని చెప్పే వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాము. గ్రేడ్-2 వి.ఆర్.ఓ.లుగా
మేము బొప్పరాజు గారితోనే వున్నామని, మా గురించి మాట్లాడే అర్హత బొప్పరాజు గారికి మాత్రమే
వుందని సభాముఖంగా తెలియజేసుకొనుచున్నాము.
బొప్పరాజు గారి నాయకత్వములో గ్రేడ్-2 వి.ఆర్.ఓ. ప్రొబిషన్ డిక్లేర్క సంబంధించిన ఫైలును
సిసిఎల్ఎ కార్యాలయంలో ఫైలును సర్క్యులేట్ చేయించుకొనుచూ బొప్పరాజు గారి ఆధ్వర్యములో
మాత్రమే సదరు ప్రొబిషన్ డిక్లరేషన్ ఉత్తర్వులను పొందుతామని గ్రేడ్-2 విఆర్ లకు సభాముఖంగా
తెలియజేయడమైనది. ఈ విషయంపై రవీంద్రరాజు అనబడే వ్యక్తికి మాట్లాడే అర్హత లేదు. విఆర్డీ నుండి సీనియర్ సహాయకులుగా ప్రమోషన్ పొందుటకు ప్రభుత్వంతో పోరాడి జి.ఓ.నెం.154ను తీసుకురావడంలో బొప్పరాజు గారు కీలకపాత్ర వహించి, తక్కువ సమయంలో
జి.ఓ.ను తీసుకువచ్చి విఆర్అలకు ఎంతో మేలు చేసినందుకు బొప్పరాజు గారికి మేమందరమూ
ఎంతో ఋణపడి వుంటాము.
ఒక విఆర్డీఓ మరణిస్తే కారుణ్య నియామకమునకు సంబంధించి జి.ఓ.నెం.658ను ఎపిఆర్ఎస్ఎ
అధ్యక్షుల వారి సారధ్యంలో అతి తక్కువ సమయంలో ఫైలును సర్క్యులేట్ చేయించుకొని,
పోరాడి సాధించడంలో బొప్పరాజు గారు చేసిన కృషి వారు పనిచేసే విధానానికి తార్కాణం. ఈ
జి.ఓ. సాధించినందుకు వారికి ఎపివిఆర్జేలు అందరము ఋణపడి వుంటామని వారికి
కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాము.
గతంలో 3సం.ల పాటు కాలాన్ని వృధా చేసుకొని ఎపివిఆర్ఓస్ అసోసియేషన్ ఏ విధమైన మేలు
చేయకపోయినా, మాలో మాకు విభేధాలు సృష్టించి లబ్ది పొందటం కోసం రవీంద్ర రాజుగారిని
పావుగా వాడుకుంటున్న ఎపిజిఇఎ అసోసియేషన్ అధ్యక్షుడి ఉచ్చులోపడి ఎపిఆర్ఎస్ఎ ద్వారా
సాధించిన జి.ఓ.లను మేమే తెచ్చామని చెప్పుకుంటూ తిరిగే రవీంద్ర రాజుగారు ఏదో ఒక రోజు
బలికాక తప్పదు. అది వారు ఇప్పటికైనా గ్రహించుకుంటే మంచిదని వారికి సభాముఖంగా
తెలియజేసుకుంటున్నాము.
మా విఆరీల మాతృ సంఘం ఎపిఆర్ఎస్ఎ మా మూడు సంఘములు ప్రయాణం చేసి మా
సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తున్న ఎపిఆర్ఎస్ఎ అధ్యక్షులు బొప్పరాజు గారితోనే
మా ప్రయాణం అంతా కొనసాగిస్తాము. మా సమస్యల పరిష్కారానికి ఒకే ఒక మార్గం ఎపిఆర్ఎస్ఎ
అధ్యక్షులు బొప్పరాజు గారితోనే సాధిస్తామని, ఇతర ఏ సంఘాలకు కూడా మా సమస్యల మీద
అవగాహన లేదని ముక్తకంఠంతో తెలియజేసుకొనుచున్నాము.
మరలా బొప్పరాజు గారి మీద ఏ సంఘానికి చెందిన నాయకుల ప్రోద్బలంతో రవీంద్ర రాజు
గాని, లేక ఎవరైనా గాని అవాకులు, చెవాకులు పేలితే వారికి తగిన బుద్ధి చెబుతామని ఈ
మీడియా ద్వారా తెలియజేయుచున్నాము.
ఎపి విఆర్ఎస్ అసోసియేషన్
ಇಟ್ಟು
తమ విధేయులు
ఎపి డి విఆర్ఓస్ అసోసియేషన్ ఎపి గ్రేడ్-2 విఆర్ఓస్ అసోసియేషన్.