*పత్రికా ప్రకటన*
తేదీ 28/8/2022
ఆంధ్ర ప్రదేశ్ గ్రామవార్డ్ సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ - APGWSEWO- ( APJAC అమరావతి అనుబంధం) 
***************

ఈ రోజు 28/8/2022 న APGWSEWO- Regd:76/2022 ( *APJAC అమరావతి అనుబంధం*) 
 ప్రకాశం, బాపట్ల, నెల్లూరు మరియు పలనాడు జిల్లాల సర్వసభ్య సమావేశం ను ఒంగోలు లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్లు సంఘ భవనం లో APGWSEWO రాష్ట్ర Adhoc జనరల్ సెక్రటరీ వి. ఆర్లయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

👉 ఈ సమావేశంలో APJAC అమరావతి నాయకులు, APGWSEWO రాష్ట్ర Adhoc కమిటీ సభ్యులు, నాలుగు జిల్లాల నాయకులు హాజరై, నాలుగు జిల్లాలకు ఏకగ్రీవంగా జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరిగింది.

👉ఈ సమావేశానికి APJAC అమరావతి చైర్మెన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లు, AP PR Engineers Association రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు గుంటూరు జిల్లా AP JAC అమరావతి చైర్మన్ శ్రీ K.సంగీతరావు, AP JAC అమరావతి కొ-ఛైర్మన్  ఆల్ఫ్రెడ్  ప్రకాశం జిల్లా AP JAC అమరావతి చైర్మన్ కృష్ణమోహన్, జనరల్ సెక్రెటరీ వేంకటేశ్వరరెడ్డి తదితరులు APJAC అమరావతి తరపున పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డ్ సచివాలయ
ఉద్యోగుల సంక్షేమ సంస్థ (APJAC అమరావతి అనుబంధం) ఆధ్వర్యంలో గ్రామవార్డు సచివాలయ
ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక  సమస్యలపై చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన APJAC అమరావతి చైర్మెన్ బొప్పరాజు గారు మాట్లాడుతూ....

1) ముందుగా నూతనంగా ఎన్నికైన 4 జిల్లాల కమిటీల సభ్యులకి శుభాకాంక్షలు తెలిపారు. 

2) గ్రామవార్డ్ సచివాలయ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని తేదీ 26.8.2022 న జరిగిన EHS management committee సమావేశంలో AP JAC అమరావతి పక్షాన కొరియున్నామని, కనుక తక్షణమే గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులందరికీ ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు (EHS) మంజూరు చేయాలి.

3) గ్రామ వార్డ్ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులను వారి వారి జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వహించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, తద్వారా వారికి పని ఒత్తిడి తగ్గించాలని కోరారు.

4) Probation declare కాకముందు మరణించిన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్ప్రెషయా చెల్లింపు, ఆ కుటుంబంలో అర్హులకి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం కల్పించడం..

5) గ్రామవార్డ్ సచివాలయం లో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్సులు కి వారికి నచ్చిన డిపార్ట్మెంట్ లో (అనగా ఊమెన్ & చైల్డ్ వెల్ఫేర్ లేదా పోలీసు శాఖ) పని చేసేందుకు ఆప్షన్స్ వెసులుబాటు కల్పించడం 

6) గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు తక్షణమే చేపట్టాలనీ  కోరడమైనది.
APGWSEWO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి V. Aralaiah గారు మాట్లాడుతూ....గ్రామవార్డ్ సచివాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలన్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. అలాగే ఇప్పటికే 10 జిల్లాల కమిటీలు పూర్తి అయ్యాయని, రాష్ట్ర adhoc committee సమావేశంలో తీర్మానం మేరకు మిగిలిన జిల్లాల ఎన్నికలు కూడా 30.9.2022 నాటికి పూర్తి చేసి, అక్టోబర్ లో APGWSEWO రాష్ట్ర  సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని V. అర్లయ్య గారు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో APGWSEWO, కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ B.జగదీశ్, నాయకులు ఇజ్జగిరి వీరబ్రాహ్మం, సరోజ్, స్టాలిన్ బాబు,సభ్యులు పాల్గొన్నారు.

*ప్రకాశం జిల్లా కు ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు* :- 
1.ప్రెసిడెంట్ -  అద్దంకి శ్రీనివాసు పెద్ద ఉల్లాగళ్లు , ముండ్లమూరు .
2.వైస్ ప్రెసిడెంట్- వెంకటేష్ కొణికి , దొడ్డవరం , మద్దిపాడు
3.సెక్రెటరీ - గుండ్లకుంట బ్రాహ్మయ్య , దేవనంపాడు H. W , ఒంగోలు రూరల్
4.జాయింట్ సెక్రటరీ- మీడశాల చంద్రమౌళి , టంగుటూరు -2, టంగుటూరు
5.కోశాధికారి - బండ్ల సాయి శరణ్య , ఉలిచి , ఒంగోలు రూరల్ మరియు 4గురు EC members, 

*బాపట్ల జిల్లాకు ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు* :- 
1.ప్రెసిడెంట్- నందల హేమసాగర్, ఇడపులపాడు, ఇంకొల్లు
2.వైస్ ప్రెసిడెంట్- ఇవూరు వాసు బాబు, నగరం
3.సెక్రెటరీ-చాటరాజపల్లి హరి , వలపర్ల, మార్టూరు
4.జాయింట్ సెక్రటరీ- సుదీర్ కుమార్ చోడ, తిమడితాపాడు, కారంచేడు
5.కోశాధికారి- కంచర్ల ఆనందరాజు , శంఖవరప్పాడు, అద్దంకి మరియు 4గురు EC members.

*నెల్లూరు జిల్లాకు ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు* :- 
1.ప్రెసిడెంట్- అనిమిటి రాజేష్ -కల్తి కాలనీ, Nellore 
2.వైస్ ప్రెసిడెంట్ - షేక్ సిద్దిక్ ,  ద్వారకా నగర్ 
3.సెక్రెటరీ- G. రమేష్ , గిద్దంగి స్ట్రీట్ .
4.జాయింట్ సెక్రటరీ-ఆలపాకు అశోక్ , మూలాపేట .
5.కోశాధికారి- Ch. శిరీష రాణి , ద్వారకా నగర్ మరియు 4గురు EC members
 
*పలనాడు జిల్లాకు ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు* :-
1.ప్రెసిడెంట్- యర్రం గోపినాధ్ రెడ్డి -చిలకలూరిపేట 
2.వైస్ ప్రెసిడెంట్ - ఫోన్. శిరీష్ కుమార్ ,  కారుమంచి , శ్రావల్యపురం
3.సెక్రెటరీ- p.శివరామ్ , చిలకలూరిపేట, చిలకలూరిపేట
4.జాయింట్ సెక్రటరీ-జి.అనిల్ కుమార్, శ్రావల్యపురం, శ్రావల్యపురం
5.కోశాధికారి- B. అనిల్ కుమార్ , శ్రావల్యపురం మరియు 4గురు EC members.

 V. Aralaiah , State Adhoc General Secretary, AP GWSEWO.