*పత్రికా ప్రక

బదిలీలలో  సడలింపు ఉత్తర్వులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి, గౌ||ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు... బొప్పరాజు & వైవి రావు.

G.O Ms. No 122 dt.16.6.2022 ద్వారా ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కొన్ని సడలింపు వుత్తర్వులు వచ్చినందున  ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని Bopparaju గారు తెలిపారు.

అందులో ప్రధానంగా ఉద్యోగులందరూ కోరుకున్న....

1. జిల్లాల విభజన జరిగిన తరువాత ట్రాన్స్ఫర్ లలో ఉద్యోగులకు జరుగుతున్న ఇబ్బందిని గమనించి పాత పద్ధతిలోనే జిల్లా కలెక్టర్ ను నోడల్ అధికారిగా పెట్టి ఈ సారికి బదిలీలు జరపమని కోరగా అందుకు అనుగుణంగా GO లో సవరణ చేయడం... 

2. జిల్లాల విభజన లో కొత్త జిల్లాలకు ఆర్డర్ టు సర్వ్ లో వెళ్ళిన వారికి కూడా వెసులుబాటు ఇవ్వడం పట్ల ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని బొప్పరాజు పేర్కొన్నారు.

3. బదిలీల ప్రక్రియ మొత్తం కూడా 17/06/2022 వరకు పూర్తి చేయాలన్న కాలపరిమితిని కూడా 30/06/2022 వరకు పొడిగించడం ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని బొప్పరాజు అన్నారు.

4. అలాగే, ప్రభుత్వ గుర్తింపు పొందిన అసోసియేషన్ల రాష్ట్ర, జిల్లా, డివిజన్/ తాలూకా కమిటీలకు బదిలీల లో మూడు పర్యాయాలు లేక 9 సంవత్సరాల వరకు అవకాశం కలుగచేయడం జరిగిందని తెలిపారు.

పై విధంగా ఉద్యోగులు కోరుకున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులలో సవరణలకు అంగీకరించిన గౌ|| ముఖ్యమంత్రి గారికి, మాకు సంపూర్ణంగా 

సహకరించిన గౌ||ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారులు

శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Dr. శ్రీ సమీర్ శర్మ IAS గారికి, గౌ||ముఖ్యమంత్రి గారి  ప్రధాన కార్యదర్శి శ్రీ జవహర్ రెడ్డి IAS గార్లకు AP JAC అమరావతి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.