PRC సాధన సమితి  ఈరోజు జరిగిన సమావేశంలో ముఖ్య అంశాలు

  1.  చర్చల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను పక్కదోవ పట్టించింది
  2.  ప్రభుత్వాన్ని నమ్మి ఉపాధ్యాయులు ఉద్యోగులు మోసపోయారు
  3.  అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయడం లేదు.....
  4.  నివేదికలో రహస్యం ఏముంది ఎందుకు బయట పెట్టడం లేదు
  5.  పాత జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు
  6.  కొత్త పిఆర్సి వల్ల 10 వేల 600 కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు
  7.  ఉద్యోగులకు కొత్త జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం యత్నం
  8.  జీతాల బిల్లుల తయారీ కోసం ట్రెజరీ అధికారుల మెడపై కత్తి పెట్టారు
  9.  ట్రెజరీ అధికారులను బెదిరిస్తూ ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది
  10.  అధికారులను భయభ్రాంతులకు గురి చేసే మెమోలు జారీ
  11.  ఉద్యోగులపై ఇష్టానుసారం చర్యలు తీసుకునేందుకు ఇది ఆటవిక రాజ్యం కాదు
  12.  క్రమశిక్షణ ఉల్లంఘిస్తే నే చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది
  13.  కక్ష సాధింపు చర్యలు తో అధికారులపై చర్యలు తీసుకోవద్దు
  14.  చర్చలకు రావాలని ఒకసారి వాట్సాప్ మెసేజ్ మాత్రమే పంపారు
  15.  ఉద్యోగ సంఘాల ప్రతినిధులను అవమానించేలా మాట్లాడారు
  16.  ఇక నుంచి లిఖిత పూర్వక ఆహ్వానం ఇస్తేనే చర్చలకు వెళ్దాం
  17.  మా సాధన సమితి పక్షాన ఇద్దరు లాయర్లను నియమించుకుంటున్నాము

 న్యాయ సలహాలు ఇచ్చేందుకు రవి ప్రసాద్ ,సత్యప్రసాద్ను నియమించుకున్నాం ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆర్టీసీ సిబ్బంది ఫించనర్లు అందరూ ఫిబ్రవరి 3న జరిగే కార్యక్రమానికి తరలిరావాలి  వచ్చే నెల 3న ఛలో విజయవాడ చూసి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి.

           PRC సాధన సమితి