PRC సాధన సమితి ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ఉద్యమాభినందనలు
ఛలో విజయవాడ ఉద్యమం విజయవంతం చేసిన మిత్రులారా.....ఈ రోజు లక్షలాదిమందితో జరిగిన (3-2-2022) ఛలో విజయవాడ ప్రదర్శన అపూర్వం, అద్బుతం. అనేక అడ్డంకులు, అవరోధాలు అధిగమించి ఉద్యోగులు సాధించిన విజయం.
ఈరోజు ఛలో విజయవాడ కార్యక్రమాన్ని లక్షలాదిగా తరలి వచ్చిజయప్రదం చేసిన యావద్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కు అభినందనలు, ధన్యవాదములుతెలుపుతూ పి ఆర్ సీ సాధన సమితి ( స్టీరింగ్ కమిటీ) తీర్మానించినది. అంతేగాక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉన్నందున సంతోషాన్ని వ్యక్తపరిచింది.
అదేవిధంగా సదరు కార్యక్రమానికి వివిధకారణాలవల్ల అనగా దారిమధ్యలో రవాణా లో ఆగిపోయిన, పోలీసు స్టేషన్ లో అరెస్టు కాబడిన సభ్యుల కు కూడా వారి ఉద్యమ స్ఫూర్తి కి ధన్యవాదములు తెలుపుతూ తీర్మానించడమైనది. అదే విధంగా వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేయడమైనది. BRTS రోడ్డులో ఉద్యమ సమయంలో సహకరించిన విజయవాడ పౌర సమాజానికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానించడమైనది.
ఇదే మొక్కవోని ధైర్యం, పట్టుదల, అంకితభావం తో రానున్న నిరవధిక సమ్మె ను జయప్రదం చేయాలని ఆకాంక్షించింది. అదే విధముగా ప్రభుత్వం ఇప్పటికైనా అనవసరపు పట్టుదలకు ,ప్రతిష్టకు పోకుండా.. తమయొక్క డిమాండ్ లను తక్షణమే నెరవేర్చాలని సాధన సమితి డిమాండ్ చేసారు తీర్మానాన్ని ఆమోదించింది.
బండి శ్రీనివాసరావు
K R సూర్యనారాయణ
K వెంకట్రామిరెడ్డి
బొప్పరాజు వెంకటేశ్వర్లు.
0 Comments
Thanks For Your Valuable Feed Back