• శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆకస్మిక మృతి కి సంతాపాన్ని తెలియచేసిన AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు...
  • ఆఖరి క్షణాల వరకు ఏపీ అభివృద్ధి కోసమే పాటుబడిన గౌ: మేకపాటి గౌతమ్‌రెడ్డి ... బొప్పరాజు

 నేటి రాజకీయాల్లో మృదు స్వభావిగా వివాదరహితుడిగా పేరు తెచ్చుకోవడం చాలా అరుదు. అలాంటి గుర్తింపు సాధించిన అరుదైన రాజకీయవేత్తల్లో శ్రీ మేకపాటి గౌతమ్‌రెడ్డి గారు ఒకరు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా తన ఆఖరి క్షణాల వరకు ఏపీ అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కల్పన అంశాలపైనే ఆయన దృష్టి పెట్టారు.  ఏపీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో చివరగా దుబాయ్‌ ఎక్స్‌పోలో  నిర్వహించిన ఏపీ పెవిలియన్‌ను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో వారం రోజుల పాటు అలుపెరగకుండా చర్చలు జరిపి, ఏపీలో భారీ పెట్టుబడులకు అనేక కంపెనీలు ఆమోదం తెలిపేవిధంగా చర్యలు గైకొన్నారు. 

    నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి గెలుపొంది AP పరిశ్రమల, IT శాఖ మంత్రి గా రాష్ట్రానికి చేసిన సర్వీస్ ను మరచి పోలేమని అతి తక్కువ కాలంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల అభిమానాన్ని చూరగొన్న నాయకుడు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అని వారు ది 21/02/2022 న హైదరాబాద్ లో హఠాన్మరణం చెందటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబసభ్యులకు AP JAC అమరావతి రాష్ట్ర కమిటీ పక్షాన సానుభూతిని, సంతాపాన్ని తెలియచేస్తున్నాము.

                                                                            బొప్పరాజు,

                                                                            వైవీ రావు,

                                                                        టీవీ ఫణి పేర్రాజు,

                                                                    VV మురళీకృష్ణ నాయుడు.