*HRA , CCA, పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్ సౌకర్యాలను యధాతధంగా కొనసాగించాలి..* 

 బండి శ్రీనివాసరావు, బొప్పరాజు, కె వి శివారెడ్డి, వై వి రావు గార్లు.

ఈ రోజు అనగా ది 10/01/2022 వెలగపూడి లోని సచివాలయంలో  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి 11వ PRC లో భాగంగా HRA , CCA, పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్ సౌకర్యాలను యధాతధంగా కొనసాగించాలని AP జేఏసీ మరియు AP JAC అమరావతి ఐక్యవేదిక నాయకులు వినతిపత్రం సమర్పించారు. 

తేదీ 7.1.2022న 11 వ PRC ప్రకటన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన అంశాలలో HRA, CCA, రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటికే 70 సంవత్సరాలకు మరియు 75 సంవత్సరాలకు ప్రభుత్వం చెల్లించే  అదనపు పెన్షన్ 10% & 15% శాతం సౌకర్యాలను తగ్గించ కూడదని కోరగా అవి చిన్న విషయాలు కనుక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఇతర అధికారులతో చర్చించుకోమని తెలియచేశారు.

   ఈరోజు (10/01/22) న ఇరు జేఏసీ నాయకులు గౌరవ చీఫ్ సెక్రటరీ గార్ని కలసి HRA , CCA , రిటైర్డ్ ఎంప్లాయీస్ కు 70 సం: లకు, 75 సం: లకు ఇచ్చే అదనపు పెన్షన్ సౌకర్యాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని లేదా మిశ్రా కమిటి నివేదిక ప్రకారం అయినా చెల్లించాలని కొరుచూ గౌరవ చీఫ్ సెక్రటరీ గార్ని కలసి మాట్లాడటమైనది.

ఇప్పటికే ఉద్యోగులు ఫిట్ మెంట్ పై అసంతృప్తి గా ఉన్నందున, HRA, CCA, అదనపు పెన్షన్ తదితర అంశాలపై గౌ|| CS గారు జోక్యం చేసుకొని గౌ||ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సానుకూలంగా ఆమోదించే విధంగా చేయాలని  తద్వారా ఇప్పటికే ఉద్యోగులలో వున్న భయాందోళనలు తొలగించాలని కోరగా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు స్పందిస్తూ వెంటనే గౌ|| ముఖ్యమంత్రి గారి కార్యాలయ అధికారులతో చర్చించి  తగు చర్యలు తీసుకుంటామని  ఖచ్చితంగా ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పటికే AP JAC & AP JAC అమరావతి ఐక్య వేదిక పక్షాన గౌ|| ముఖ్యమంత్రి గారి కారదర్శులతో చర్చించిన విషయం తెలిసిందే. తప్పకుండా HRA, CCA, పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్ లు యధాతదంగా ప్రస్తుతం ఉన్న స్లాబులలోనే కొనసాగిస్తారని గౌ|| ముఖ్యమంత్రి గారి పై  నమ్మకం ఉంది అని బండి శ్రీనివాసరావు, బొప్పరాజు, kv శివారెడ్డి, వైవీ రావు లు తెలియచేసారు.