శాఖాధిపతి కార్యాలయాల్లో పనిచేసే వాతావరణం లేదు ..... ఉద్యోగుల సమస్యలూ పరిష్కారానికి నోచుకోలేదు.

ఈరోజు 08/13/2021 న ఇరు సిటీ JAC లు AP JAC& AP JAC అమరావతి ఐక్య వేదిక పక్షాన ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ లో భాగంగా ఈ రోజు 12 గంటలకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (G G H) వద్ద ఏర్పాటు చేసిన ఉద్యోగులకు నల్ల బ్యాడ్జేస్ ధరింప చేయుట, ఉద్యమానికి దారి తీసిన పరిస్థితులు వివరించుట కార్యక్రమంలో ఇరు JACల రాష్ట్ర స్థాయి ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాపితంగా వున్న ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారులకు 71 అంశాలతో కూడిన మెమొరాండం ఇరు జేఏసీల ఐక్య వేదిక పక్షాన  ఇచ్చినప్పటికీ ఈనాటికీ ఒక్క సమస్య పరిష్కరించ బడలేదని, రెండు నెలలు గడువు ఇచ్చినప్పటికీ  ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదని ఇక తప్పని పరిస్తితుల్లో డిసెంబర్ 7 వ తేదీ నుండి ఉద్యమానికి రావలసి వచ్చింది అని, దీనికి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, హైదరాబాద్ నుండి విజయవాడకు రాగానే ఆనాటికి అందుబాటులో ఉన్న విజయవాడ, గుంటూరులోని పాత బిల్డింగ్ లలో కొన్ని రాష్ట్ర స్థాయి కార్యాలయాలు ఏర్పాటు చేశారని, ప్రస్తుతం ఆ పాత బిల్డింగ్ లలో కనీసం పనిచేసే వాతావరణం కూడా లేదని తెలిపారు. ఉద్యోగుల కొరకు కనీసం టాయిలెట్స్ కూడా లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు.

ఈ నెలలోనే 13, 16, 21 తేదీలలో
నిరసన ర్యాలీలు, ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని, మా ఉద్యోగులకు సంబంధించిన నిధులను కూడా మళ్లించేశారని, అనారోగ్యం వస్తే... సొంత డబ్బుతో వైద్యం చేయించుకుంటున్నారు.
కనీసం ఆ బిల్లులు కూడా ఇవ్వకుండా  23కోట్లు పెండింగ్‌లో పెట్టారని తెలిపారు.

అలాగే పిఆర్సీ ఒక్కటే మా డిమాండ కాదని... ఇతర 70డిమాండ్ల పై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.

మావి గొంతెమ్మ కోర్కెలు కాదు... న్యాయంగా రావాల్సిన హక్కుని,
ప్రభుత్వం చర్చలకు పిలిచి హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.

ఈ సమయంలో ప్రజలకు కలిగే కష్ట, నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు.

ఆర్థిక ఆర్ధికేతర సమస్యలపై గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఉద్యోగ సంఘాల తో ఇప్పటికైనా ఒక సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా చర్చించి మా సమస్యలు పరిష్కరిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 2. AP NGO's ప్రధాన కార్యదర్శి K v శివారెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని ఒక్క PRC నే కాదు అనేక ఉద్యోగుల సమస్యలు  ఇతరత్రా అంశాలు చాలా పరిష్కారం కావలసి వున్నదని, ఉద్యోగులు పెట్టుకొన్న లోన్లకు సంబంధించి రావలసిన సొమ్ము సుమారు 1600 కోట్లు వుంది అని అవి ఎప్పుడు చెల్లిస్తారో సమాధానం కూడా చెప్పే పరిస్తితి లేదన్నారు. చాలా కాలం ప్రభుత్వానికి సమయమిచ్చీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యమ బాట పట్టామని చెప్పారు.

3. AP JAC అమరావతి సెక్రటరీ జనరల్ వై వి రావు మాట్లాడుతూ 7 వ తేదీ నుండి ఎర్ర బ్యాడ్జెస్ నిరసన కార్యక్రమం లో పాల్గొని జయప్రదం చేస్తున్న 13 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంత ఉద్యోగులకు ఉద్యమాభినందనలు తెలియచేశారు. ప్రభుత్వం స్పందించి చర్చలు జరపటం ద్వారా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరు JAC నాయకులు వి వి మురళీకృష్ణ నాయుడు, AP JAC అమరావతి సిటీ చైర్మన్ కె.కళాధర్,  శ్రీ సూర్యనారాయణ రెడ్డి, శ్రీ ఇక్బాల్, A విద్యాసాగర్, శ్రీమతి సత్యమంగలాంబ, సూర్యనారాయణ రెడ్డి,K. జగదీశ్వర్ రావు, State పబ్లిసిటీ సెక్రెటరీ, శ్రీ రంగారావు, స్టేట్ treasurer, women wing chairperson శ్రీమతి V. నిర్మల కుమారి,  శ్రీమతి శాంతి, K. జగదీశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.