జిల్లా ఛైర్మన్ / ప్రధాన కార్యదర్శులకు అర్జంట్ విన్నపము 


మిత్రులారా !

ఉధ్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్టు, పొరుగు సేవల ఉధ్యోగులకు సంబందించిన డెబ్బై ఒక్క (71) డిమాండ్ల పరిష్కారం కోసం ఈ రోజు నుండి ఉధ్యమ బాట పట్టాం... మీరు అన్నీ స్థాయిల ఉధ్యోగులను సన్నద్ధం చేసియున్నారు..అన్నీ జిల్లాల నాయకత్వం నుండి పూర్తి స్థాయిలో మాకు సహకారం లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  ఇప్పటికే అన్నీ స్థాయి ఉధ్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్టు, పొరుగు సేవల ఉధ్యోగుల నుండి మంచి స్పందన కనపడుతుంది.

ఉద్యమ కార్యాచరణ అమలులో భాగంగా మీరు కార్యాలయాలకు, విధ్యాలయాలకు , కళాశాలలకు, బస్ డిపోలకు వెళ్లినప్పుడు... AP JAC & AP JAC AMARAAVATHI ఐక్యవేదిక మరియు జిల్లా పేరు ఉన్న బ్యానర్ కనిపించే విధముగా వారిచే నల్ల బ్యాడ్జి లు ధరింప చేస్తూ, స్లోగన్స్ చెప్తూ, డిమాండ్లనుద్దేశించి ప్రసంగిస్తూన్న సందర్భం, విధిగా జిల్లా పేరు & ప్రాంతం పేరు చెప్తూ  విజువల్స్ మరియు ఫోటోలను ఈ గ్రూపు నందు జిల్లా పేరు mention చేస్తూ పోస్ట్ చెయ్యవలసిందిగా మీ అందరినీ కోరుచున్నాము.

బొప్పరాజు & వైవీ రావు