AP JAC అమరావతి అన్నీ జిల్లాల చైర్మన్/కార్యదర్శులకు, రాష్ట్ర నాయకులకు, సభ్య సంఘాల రాష్ట్ర అధ్యక్ష/ ప్రధాన కార్యదర్శులకు అందరికి అర్జంట్ విన్నపము
మిత్రులారా...
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు సాధన కొరకు ప్రత్యేకంగా 11వ PRC అమలు, ఉద్యోగులు దాచుకున్న, రావాల్సిన డబ్బులు తక్షణ చెల్లింపు, CPS రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఎంప్లాయిస్ హెల్త్ కార్డుల పూర్తి స్థాయి వినియోగం, చనిపోయిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు ఉద్యోగ తక్షణ కల్పన తదితర అనేక ప్రధాన అంశాల పరిష్కారం కొరకు ఇరు JAC లు అనగా AP JAC & AP JAC అమరావతి కలిసి గత 2 మాసాలుగా ఇటు ప్రభుత్వ పెద్దలతో అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులతో అనేక ప్రయత్నాలు చేయగా కేవలం మన ఇరు JAC ల ప్రయత్నం కారణంగా గత 12 సంవత్సరాలుగా జరగాల్సిన రాష్ట్ర స్థాయి Joint Staff counsil సమావేశం పోయిన నెల 29న నిర్వహించడం, తదనంతరం కనీసం prc నివేదిక కూడా బయట పెట్టకుండా నాయకులపట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు తదితర పరిణామాలు అన్నీ ఎప్పటికప్పుడు మీరు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో చూస్తూనే ఉన్నారు.
నిన్న అనగా తేదీ 12.11.2021న జరిగిన రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం లో కూడా మన PRC నివేదిక & ప్రకటన, మనకు చెల్లించాల్సిన బకాయిలు గురించి ఏ మాత్రం చర్చించనందున ఇరు JAC లు సదరు సమావేశాన్ని బహిష్కరించిన విషయం కూడా మీకు విదితమే.
ఈ నైపద్యంలో నిన్న రాత్రి NGO హోమ్, విజయవాడలో ఇరు jac ల అందుబాటులో ఉన్న రాష్ట్ర నాయకత్వం కూర్చుని సుదీర్ఘంగా చర్చించి, అందరి అభిప్రాయం ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం లో పూర్తి అలసత్వాన్ని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వానికి ఉద్యోగుల ఆందోళన తెలియచేయడానికి తగిన సమయం ఇచ్చి, ఈ నెల 28న ఇరు JAC ల రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఉమ్మడిగా నిర్వహించి, ఆ సమావేశంలో అందరి అభిప్రాయం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించడమైనది.
పైన తెలియపరచిన పరిస్థితుల్లో, మీరు తప్పకుండా మీ మీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలని ఈ నెల అనగా 27.11.2021 లోపు లేదా అదే రోజు జరుపుకోవాలని, తేదీ 28.11.2021 ఉదయం ఖచ్చితంగా 9గంటలకు రెవెన్యూ భవన్ విజయవాడలో జరిగే *"AP JAC అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి"* హాజరు కావాలని, అలాగే అదే రోజు (28.11.2021) మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడలోని NGO హోమ్ నందు జరుప తలపెట్టిన "ఇరు JAC ల ఉమ్మడి రాష్ట్ర కార్యవర్గ సమావేశం" నకు కూడా *13 జిల్లాల చైర్మన్/కార్యదర్శులు* , *రాష్ట్ర కార్యవర్గ సభ్యులు* , *వివిధ సభ్య సంఘాల రాష్ట్ర అధ్యక్ష/ ప్రధాన కార్యదర్శులు* అందరూ తప్పకుండా
హాజరుకావాలని కోరుతున్నాము.
బొప్పరాజు,
వైవీ రావు,
టీవీ ఫణి పేర్రాజు,
వివి మురళీకృష్ణ నాయుడు.

0 Comments
Thanks For Your Valuable Feed Back