తేది.28.11.2021

పత్రికా ప్రకటన

ది .28.11.2021 తేదీన AP JAC అమరావతి రాష్ట్ర కార్యవర్గము మరియు సభ్య సంఘాల సమావేశం రెవిన్యూ భవన్ లో JAC చైర్మన్ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగినది.

 AP JAC మరియు AP JAC అమరావతి ఐక్య వేదిక ఏర్పాటు చేసిన తరువాత జరుగుచున్న మొదటి సమావేశములో ఊహించని విధముగా అన్ని ఉద్యోగ వర్గాల నుండి స్పష్టమైన సానుకూలమైన స్పందన వచ్చిందని, సభ్య సంఘాల ప్రతినిధులు తెలియజేసారు. AP JAC & AP JAC అమరావతి ఐక్యవేదిక గా ఏర్పడిన తదుపరి 11PRC అమలు మరియు ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యల పరిష్కారానికి  షుమారు 50 అంశాలతో ప్రభుత్వ పెద్దలకు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి మెమొరాండం అందజేయడమైనదని తెలియజేసారు.

సుమారు 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు విశ్రాంత ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న JAC ల ఐక్య వేదిక నాయకత్వం యొక్క విన్నపాలను ఆవేదనను అసహనాన్ని మరియు నిరసనను దఫ దఫాలు గా మీడియా ద్వారాను, నేరుగాను ప్రభుత్వ పెద్దలకు మరియు ఉన్నతాదికారులకు తెలియచేసినప్పటికీ ఉద్యోగుల సహేతుకమైన డిమాండ్ల పై  ప్రభుత్వము స్పందించకపోవడము పై ఈ నాటి సమావేశములో తీవ్రమైన నిరసన వ్యక్తమైనది.

ఉద్యోగుల ఆర్ధిక పరమైన  చెల్లింపుల విషయంలో కూడా స్పష్టమైన ప్రకటన చేయనందున తేది 12.11.2021 న ఆర్ధిక శాఖ అధికారులతో జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశాన్ని ఇరు JAC ల ఐక్య వేదిక పక్షాన బహిష్కరించి, ఈ నెల 28 వరకు ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ నెల 28 వ తేదీన రెండు JAC ల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి పోరాట కార్యక్రమం ప్రకటించాలని తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రోజు అనగా తేది 28.11.2021 న నిర్వహించిన  AP JAC అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశములో ఈ క్రింది తెలిపిన తీర్మానములు చేయడమైనది. 

AP JAC అమరావతి రాష్ట్ర కార్యవర్గ తీర్మానాలు :

1)       AP JAC మరియు AP JAC అమరావతి ఐక్యవేదికగా ఏర్పడిన తరువాత 11PRC మరియు ఆర్ధిక అర్దికేతర సమస్యల పరిష్కారానికి చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఈ సమావేసము ఏకగ్రీవముగా ఆమోదిస్తూ తీర్మనించుటమైనది.

2)      AP JAC మరియు AP JAC అమరావతి ఐక్యవేదికగా తరపున ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారము కొరకు ప్రభుత్వ పెద్దలను , ప్రభుత్వ ఉన్నతాదికారుల దృష్టికి దఫ దఫాలుగా తెలియజేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా తీవ్ర నిరాశకు గురి చేసి , ప్రత్యక్షముగా ప్రభుత్వమే ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆందోళనబాటను గురిచేసినట్లు AP JAC అమరావతిలోని భాగస్వామ్య సంఘాలన్నీ భావిస్తూ , ఉద్యమ కార్యాచరణకు ప్రభుత్వమే పూర్తిగా భాద్యత వహించాలని ఏకగ్రీవముగా తీర్మానము చేయడమైనది.

3)      28.11.2021NGO హోం నందు జరుగు సంయుక్త సమావేశములో ఇరు JAC ల ఐక్య వేదిక తీసుకునే ఉద్యమ కార్యాచరణను AP JAC అమరావతిలోని భాగస్వామ్య డిపార్టుమెంటు సంఘాల ఉద్యోగులు అందరు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదము చేయవలెనని ఏకగ్రీవముగా తీర్మనించుటమైనది.

4)      గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులలో వున్న తీవ్రమైన వ్యతిరేకతను అర్థం చేసుకొని వెంటనే జోక్యం చేసుకోవడం ద్వారా 11PRC నివేదికను బహిర్గతము చేసి తక్షణమే ఆమోదం తెలపాలని, సుధీర్గ కాలముగా పెండింగులో ఉన్న ఉద్యోగుల  ఆర్థిక, ఆర్థికేతర అంశాలు తక్షణమే పరిష్కరించాలని వాటితో పాటు CPS రద్దు , కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పోరుగుసేవల ఉద్యోగుల జీతభత్యాల పెంపు పై వెంటనే చర్యలు తీసుకోవాలని, EHS కార్డ్ లతో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులపై ఉన్నతాధికారులతో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని AP JAC అమరావతి రాష్ట్ర కార్యవర్గము ఏకగ్రీవముగా తీర్మానించడమైనది.

ఈ సమావేశములో AP JAC అమరావతి సెక్రటరీ జనరల్ వై.వి.రావు, అసోసియేట్ చైర్మన్ ఫణి పేర్రాజు, కోశాధికారి వి.వి.మురళికృష్ణ నాయుడు మరియు ఇతర రాష్ట్ర కార్యవర్గము, జిల్లా చైర్మన్, కార్యదర్శులు, సభ్య సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

 

         (వై. వి. రావు)                                                              (బొప్పరాజు వెంకటేశ్వర్లు)

         సెక్రటరీ జనరల్.                                                                      చైర్మన్.

 

 

(వి.వి.మురళికృష్ణ నాయుడు)                                                             (ఫణి పేర్రాజు)

         కోశాధికారి.                                                                     అసోసియేట్ చైర్మన్.


 


\