ఉద్యోగులంతా నిరుత్సాహంతో ఉన్నారు
కమిటీలతో కాలయాపన చేయవద్దు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11వ పే రెవిజన్ కమిటీ నివేదికను పరిశీలన చేసి త్వరలో రిపోర్ట్ ఇవ్వమని ఈ రోజు GO No.22, తేదీ.1.4.2021ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో సెక్రటరీల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం అధికూడా సెక్రెటరీల నివేదిక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కు సబ్మిట్ చేసేందుకు స్పష్టమైన టైం లిమిట్ (కాలపరిమితి) లేకుండా వీలైనంత త్వరగా అని ఉత్తర్వులు ఇవ్వటం సమంజసం కాదన్న బొప్పరాజు.
● ప్రక్కన సోదర తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 11వ PRC ని ఎలాంటి సెక్రెటరీల నివేదిక లేకుండానే ప్రకటించిన నేపథ్యంలో, తెలుగు నూతన సంవత్సరాది ఉగాది కానుకగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 11వ PRC ప్రకటిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రత్యేకంగా పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు ఈ ప్రకటన నిరుత్సాహాన్ని కలుగచేసిందన్న వైవీ రావు.
● 10వ PRC ని ఎలాంటి సెక్రెటరీ ల నివేదిక లేకుండానే ప్రభుత్వం గతంలో ఆమోదించింది ఉద్యోగ సంఘాల నాయకులు.
● ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గౌ||ముఖ్యమంత్రి గారి రాజకీయ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గార్ల ఆధ్వర్యంలో ప్రధానమైన ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో కూడా మేమందరం ఎలాంటి కమిటీలు వేయకుండా 11వPRC ప్రకటించాలని కోరాము.
● గౌ|| ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 27% IR చెల్లిస్తున్నందున, 11వ PRC ప్రకటన వల్ల ప్రభుత్వం పై పెద్దగా ఆర్ధిక భారం పడదు కనుక,
వెంటనే ప్రభుత్వం పునః పరిశీలన చేసి గౌ||ముఖ్యమంత్రి గారు ఒకసారి ఉద్యోగ సంఘాలతో చర్చించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత ఉద్యోగులు గత 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న 11వ పే రివిజన్ ను వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని కోరుకుంటున్నాము.
*బొప్పరాజు & వై వి రావు*

0 Comments
Thanks For Your Valuable Feed Back