★ రాష్ట్రంలో కరోనాకు ఉద్యోగులు బలి...తక్షణమే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలి...బొప్పరాజు, వైవీ రావులు.
★ ప్రభుత్వ కార్యాలయాల శుభ్రత మరియు కరోన ప్రోటోకాల్ పాటించుటకొఱకు తక్షణమే సరిపడా నిధులు మంజూరు చేయాలి...బొప్పరాజు, వైవీ రావు.
★ వైరస్ బారిన పడిన ఉద్యోగులకు 14 రోజుల క్వారంటైన్ సెలవులు ప్రకటించాలి..బొప్పరాజు, వైవిరావు
....
రాష్ట్రంలో కరోన సెకండ్ వేవ్ చాలా తీవ్ర రూపం దాల్చడంతో అనేక మంది ఉద్యోగులు కరోన బారిన పడి చనిపోతున్నారని అలాగే వేలాది మంది ఉద్యోగులు వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం చేయుంచుకుంటున్నారని వారిలో ఎందరు చెని పోతారో కూడా తెలియడం లేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో గౌ11 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి AP JAC అమరావతి పక్షాన నేడు వినతిపత్రం సమర్పిస్తూ ప్రధానంగా;
*1* .రాష్ట్రం విడిపోయిన తర్వాత విజయవాడ, గుంటూరు పట్టణాలలో ఇరుకుగా ఉండే ప్రైవేట్ భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయడం వలన ఉద్యోగికి - ఉద్యోగికి ఎక్కువగా భౌతిక దూరం లేకపోవడం...
*2* .బడ్జెట్ లేని కారణంగా రాష్ట్రం లోని ప్రభుత్వ కార్యాలయాలలో సరైన sanitization చేయలేకపోవడం.
*3* .ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కనీసం స్వీపర్ కూడా లేకపోవడంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
*4* .కార్యాలయంలో సరైన sanitization లేనందునే, ప్రత్యేక గది, సెపరేట్ కారు అన్నీ ఉన్నాసరే అధికారులకు కోవిడ్ positive వచ్చి ఇబ్బందులు పడుతున్నారు.
*5* .ప్రస్తుతం వచ్చిన వైరస్ బలమైనది మరియు చాలా స్పీడ్ గా రావడమే కాకుండా గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందనటంతో ఉద్యోగులు ఇంకా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
*6* .కార్యాలయాలు పూర్తిగా తెరిచి పెట్టినందున సందర్శుకులు ఆఫీసుకు రావడం ద్వారా కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది.
*7* .వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇటీవల continue గా దాదాపు 2, 3 మాసాల నుండి ఎన్నికల నిర్వహణతోనే సరిపోయింది అలాగే కొంత భయంతో ఉద్యోగులెవరూ కనీస స్థాయిలో కూడా వ్యాక్సిన్ వేయించుకోలేదు.
*8* . కేవలం కొంతమంది మాత్రమే మొదటి డోసు వేయించుకుని, రెండవ డోసు ఇంకా మొదలు కాలేదు.
● ఇటువంటి పరిస్తితుల్లో, ఈ 3, 4 రోజుల్లోనే సచివాలయంలో దాదాపు ముగ్గురు, నలుగురు ఉద్యోగులు/అధికారులు, రెవెన్యూ CCLA కార్యాలయంలో Gazetted Supdt గార్లు (ఇంకా అనేకమంది మా దృష్టికి రాని వారు) చనిపోవడం జరిగింది. వేలాదిమంది మంది ఉద్యోగులు, అధికారులు వివిధ ఆసుపత్రుల్లో కరోన వైద్యం పొందుతున్నారు. ఎంతోమంది ఫీల్డ్ స్టాఫ్ వారి ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్లలో కూడా పనిచేస్తున్నారు.
● రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలలోని EHS నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం వారు మాత్రం కేవలం ప్రైవేట్ వ్యక్తులకు (డబ్బులు ఎక్కువ వస్తున్నందున) బెడ్లు కేటాయిస్తూ , ఉద్యోగులకు బెడ్లు ప్రత్యేకంగా ప్రాణాలకు తెగించి పని చేసే ఫీల్డ్ స్టాఫ్ కు బెడ్లు లేవని చెప్తుండడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా ఇటు ఆర్ధిక పరంగా, మానసికంగా నష్ట పోతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.
★★ కాబట్టి గౌ11ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు తక్షణమే స్పందించి, కరోనాకేసులు వేలాదిగా పెరుగుతున్న నేపథ్యంలో.....
◆ ప్రభుత్వ ఉద్యోగులు 30% మందిని ఎవరైతే వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నారో ఆ ఉద్యోగులను మాత్రమే కార్యాలయంనుండి పనిచేయించుకుంటూ, మిగిలిన వారందరిని "వర్క్ ఫ్రమ్ హోమ్" సౌకర్యం కలుగచేయాలని తదనుగుణంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ లకు, శాఖాధిపతులకు, సచివాలయం అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని...
◆ అన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో (మండలం నుండి శాఖాధిపతి కార్యాలయం వరకు) sanitization, sweeping తదితర కోవిడ్ ప్రోటోకాల్ పాటించుటకు తక్షణమే సరిపడా నిధులు మంజూరు చేయాలని..
◆ రాష్ట్రంలోని అన్నీ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్కు ఒక్కొక్క ఆసుపత్రికి ఒక నోడల్ అధికారిని నియమించి తద్వారా ఉద్యోగుల (ప్రత్యేకంగా ఫీల్డ్ స్టాఫ్) కొరకు కొన్ని బెడ్లు కేటాయించే విధంగా చర్యలు గైకొనలనే విధంగా అందరూ జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని కొరదమైనది.
◆ అలాగే కరోనా బారిన పడిన ఉద్యోగులు వైద్యం చేయించుకొనుటకు ఆంద్రప్రదేశ్ ఫండమెంటల్ రూల్స్ UO Note No.82809/37/11-FR1/64-2 Fin.(FR-1) Dept dt.3.4.1965 మరియు రాజస్థాన్ రాష్ట్రం ప్రకటించిన ప్రకారం ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా క్వారంటైన్ పిరియడ్ అనగా 14 నుండి 21 రోజుల వరకు స్పెషల్ క్యాజువల్ లీవ్ గా పరిగణించాలని ఈ రోజు 19/04/2021 న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో వినతి పత్రం AP JAC అమరావతి పక్షాన అందజేయడం జరిగింది.
పై విషయాలపై గౌరవ ముఖ్యమంత్రిగారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు తక్షణమే సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాము..

0 Comments
Thanks For Your Valuable Feed Back