ANDHRA PRADESH VILLAGE REVENUE OFFICER'S ASSOCIATION ( VRO) 
ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ పత్రిక ప్రకటన 4.3.2021 

ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవిన్యూ ఆపీసర్స్ అసోసియేషన్ చీలిక గ్రూప్ ఏర్పాటుకు ప్రయత్నం చేసిన APGEA మరియు APGEF నాయకుల చర్యలను కండిస్తున్నాము. 

ఈరోజు విజయవాడ పిలిం చాంబర్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన మీటింగ్ నకు కనీసం రాష్ట్ర అద్యక్షులు , సహాధ్యక్షులు , ప్రధాన కార్యదర్శి , కోశాధికారి , ప్రచార కార్యదర్శి మరియు రాష్ట్ర కమిటీలోని సభ్యులు ఎవరూ హాజరు లేకుండా కేవలం కొన్ని జిల్లాల అద్యక్షులను మాత్రమే పిలుచుకొని జిల్లా కార్యదర్పులు కూడా లేకుండా డివిజన్ నాయకులు లేకుండా రాష్ట్ర అధ్యక్ష , కార్యదర్పులును తొలగిస్తున్నాము అని ప్రకటింపచేయటం హేయమైన చర్యఅని APVRO రాష్ట్ర అధ్యక్షులు తెలియచేసారు, ఇలా సంఘాలను చీల్చటము APGEA , APGEF ల నీతిగా ఉన్నదా , ఇది చాలా హాస్యాస్పదం , అభ్యంతరకరం , మాలో మాకు భేదాభిప్రాయాలు ఉండవచ్చు వాటిని మేమి కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకొంటాం , మా సంఖ్యాబలాన్ని ఆసరా చేసుకుని మమ్ములను వర్గాలుగా విభజించడం చాలా బాధాకరం , దీన్ని మేము ఖండిస్తున్నాము అని రాష్ట్ర కార్యదర్శి సురేష్ తెలియచేసారు , 

మా పదోన్నతుల , మరియు ఇతర సమస్యల విషయంలో అసలు ఏమి జరిగిందో త్వంలో మీ ముందు అన్ని ఆధారములతో నిజాలు బయటపెడతాము అని ఈ రోజు జరిగినది పూర్తిగా అనైతిక చర్య ఈ పత్రిక ప్రకటన ద్వారా తెలియచేస్తున్నాము, గత ముపై నలభై సంవత్సరాలుగా ఉన్న సంఘాలను నిర్వీర్యం చేయడం లేదా కొత్త సంఘాలను రిజిష్టర్ లు చేసయించి ప్రభుత్వం వద్ద బలం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి చర్యలు సంఘాల మనుగడకు ప్రమాధంగా మారబోతున్నాయి. ప్రభుత్వంతో పాటు ఉద్యోగులు కూడా ఇలాంటి చర్యలను గమనిస్తున్నారు. పోటీఅనేది ఉద్యోగులకు సంక్షేమఫలాలు అందించడంలో చూపించాలి. అంకెల గారడి చేస్తే ఉద్యోగులకు కూడా మాయాజాలం చూపిస్తారు తప్ప వారి అవసరాలను తీర్చలేని స్థితి వస్తుంది, వచ్చేసింది. 
ధన్యవాదాలు  
అంజనేయకుమార్ రాష్ట్ర అధ్యక్షులు
 సి.హెచ్.సురేష్ బాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , 
బి శ్రీనివాసరావు రాష్ట్ర కోశాధికారి

APVROA State Committee - Regd . No. 205/16 email : approa@gmail.com Urban M.R.O. Office Compound , Behind Lepakshi , Gandhi Nagar , Vijayawada - 3. ( A.P ) K.Anjaneya Kumar ( Chanti ) B.Ramudu B. Srinivasa Rao Ch . Suresh Babu President Associate President Treasurer General Secretary Cell : 9848481162 Cell : 996927688 Cell : 9866077054 Cell : 9848765288