ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, విజయవాడ 

రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూశాఖ ఇటీవల ఎదుర్కొంటున్న మరియొక తీవ్రమైన సమస్య ఏమిటంటే గత సంవత్సరం అక్టోబరు 2020 నుండి వెబ్ లాండ్ లో ఏర్పడినటువంటి సాంకేతిక లోపాల వలన Online  కార్యకలాపాలు నత్తనడకన కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసినదే. 

ఈ  వెబ్ ల్యాండ్... రోజులో ఎప్పుడు స్పందిస్తుందో ఎప్పుడు మొరాయిస్తుందో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనివలన  భూములు కొనుగోలు చేసినవారికి మ్యుటేషన్ లు నిర్ణీత సమయంలో తహశీల్దార్ కార్యాలయం నుండి చేయుటకు సాధ్యం కావడం లేదు. ఈవిధంగా నిర్ణీత సమయంలో మ్యుటేషన్ లు పూర్తి చేయలేక పోవడం వలన.. ఆటో మ్యుటేషన్లు గా  మారిపోతున్నాయి. కనీస విచారణ పూర్తి కాకుండానే ఆటో మ్యుటేషన్ లు అయిపోతున్నందున  దీనివలన తహశీల్దార్లు క్రమశిక్షణ చర్యలకు గురి అయ్యే గందరగోళ పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి.

అదేవిధంగా ప్రధానంగా మ్యుటేషన్ లు నిర్ణీత సమయంలో చేయకపోతుండడం వలన ప్రజలలో రెవెన్యూ శాఖ పై దురభిప్రాయం ఏర్పరచుకొన్నందున చేయనితప్పుకు రెవెన్యూ ఉద్యోగులపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. 

ఈ పరిస్థితుల్లో, APRSA రాష్ట్ర సంఘం పక్షాన ఈ రోజు గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ రెవెన్యూ శ్రీమతి ఉషారాణి ఐఏఎస్ గారిని కలిసి  సదరు  ఇబ్బందులను వారి దృష్టికి తీసుకు వచ్చి సదరు ఇబ్బందులను ఈ క్రింద విధంగా పరిష్కారించాలని కొరదమైనది.

◆  వెంటనే online వెబ్ లాండ్ లో న ఏర్పడినటువంటి సాంకేతిక లోపాలను సవరించుటకు NIC వారితో సమావేశం ఏర్పాటు చేసి, తక్షణమే సాంకేతిక సమస్యలు సరి చేసి తద్వారా మ్యుటేషన్ కార్యకలాపాలు వేగవంతంగా జరిగేలా అధికారులకు  ఆదేశములు జారీ చేయాలని ..

◆ అలాగే రాబోయే రోజుల్లో online వెబ్ ల్యాండ్ లో వచ్చే సాంకేతిక సమస్యలు ఆలస్యం కాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఒక టెక్నీకల్ టీం తో "హెల్ప్ డెస్క్"   24 ×7 పనిచేసేవిధంగా ఏర్పాటు చేయాలని..

◆  కనీస విచారణ కూడా జరగకుండానే ఆటో మ్యుటేషన్ అయిపోతే, భూ వివాదాలు పెరిగే ప్రమాదం ఉన్నందున, అంతవరకు ఆటో మ్యుటేషన్ విధానాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కొరదమైనది.

 బొప్పరాజు, చేబ్రోలు కృష్ణ మూర్తి , V.గిరి కుమార్ రెడ్డి.