మహిళా ఉద్యోగులకు శుభవార్త
మహిళా ఉద్యోగులకు ఐదు రోజులు ప్రత్యేక సాధారణ సెలవులు (special casual leaves) మంజూరు చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంగీకారం తెలిపారు దీనికి సంబంధించిన ఉత్తర్వులు 8వ తేదీన వెలువడతాయి అని APJAC అమరావతి మహిళా విభాగం అభ్యక్షురాలు శ్రీమతి. సుశీల గారు తెలియచేసారు.
APJAC అమరావతి చైర్మన్ బొప్పరాజు గారి పిలుపు మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, రాష్ట్ర స్థాయి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఇండోర్ స్టేడియం నందు నిర్వహించిన క్రీడా మరియు సాంస్కృతిక పోటీలకు వందలాదిగా తరలివచ్చి ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్న మహిళా అధికారులు మరియు ఉద్యోగినులకు అభినందనలు అని ఆమె తెలియచేసారు.
అదే విధంగా మహిళా దినోత్సవం సందర్భముగా ఏలూరులో అమరావతి జేఏసీ ట్ఆ ర్క్కఉపున నిర్వహించిన ఆటల పోటీల్లో ఆర్టీసీ కి సంబంధించి 23 మంది మహిళా ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. వీరు ఆ యొక్క ఆటల పోటీలలో విశేష ప్రతిభ ప్రదర్శించి 11 ప్రైస్ అవార్డులు గెలుచుకోవడం జరిగింది. ఈ ఆటల పోటీలలో మహిళలు విశేష ప్రతిభ కనపరిచి గెలుచుకున్న ప్రైజ్ అవార్డులు రాబోయే మార్చి 8 మహిళా దినోత్సవం రోజున వారికి అందజేయడం జరుగుతుంది. మార్చి 8వ తారీఖున జరిగే కార్యక్రమమునకు ఆంధ్ర ప్రదేశ్ మహిళ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సహకరించిన AP JAC AMARAVATHI పశ్చిమగోదావరి జిల్లా కార్యవర్గమునకు కృతజ్ఞతలు.
ఇట్లు

0 Comments
Thanks For Your Valuable Feed Back