ఇచ్చిన మాట ప్రకారం మహిళా దినోత్సవ కానుకగా మహిళా ఉద్యోగినులకు 5 రోజుల ప్రత్యేక సెలవులు మంజూరు చేసిన గౌ11ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు.... *బొప్పరాజు & వైవీ రావు*
***
గత కొన్ని సంవత్సరాలుగా అన్నీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాలని గతంలో అనగా 1996లో మహిళా టీచర్లకు GO Rt No.374, Education (Ser. I) Dept తేదీ 16.3.1996 ద్వారా 5 రోజులు ప్రత్యేక సెలవులు ఇచ్చినట్టుగా ప్రభుత్వ మహిళా ఉద్యోగినులకు కూడా ఇవ్వాలని కోరుతున్నా గత 25 సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.
◆ AP JAC అమరావతి ఏర్పడిన నాటినుంచి, మహిళా ఉద్యోగినులకు అనేక ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి కాబట్టి మహిళా ఉపాధ్యాయినులకు ఇచ్చిన విధంగా 5 రోజుల ప్రత్యేక సెలవుల మంజూరు చాలా అవసరమని గత ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశామని అయినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రభుత్వంలో గత సంవత్సరం AP JAC అమరావతి ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 5.2.2020న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన మహాసభ తీర్మానాలు అనంతరం గౌ|| ముఖ్యమంత్రి శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తప్పకుండా మహిళా ఉద్యోగినులకు కూడా 5 రోజుల ప్రత్యేక సెలవులు ఇవ్వమని కోరగా ఆ రోజే వారు చాలా సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది.
◆ ఉన్నతాధికారులు ప్రత్యేక సెలవుల మంజూరుకు కొన్ని ఇబ్బందులు చెప్పినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం, మహిళా దినోత్సవ కానుకగా ఈ రోజు 5 రోజుల ప్రత్యేక సెలవులు మంజూరు చేసినందుకు రాష్ట్రంలోని అందరూ మహిళా ఉద్యోగినులు తరపున గౌ|| ముఖ్యమంత్రి గారికి AP JAC అమరావతి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
◆ ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మహిళా ఉద్యోగినులు కోసం ప్రత్యేకంగా రాష్ట్రంలో ని అన్నీ కార్యాలయాలలో కనీస సౌకర్యాలు, మహిళా ఉద్యోగినల కోసం ప్రతి కార్యాలయంలో "ప్రొటెక్షన్ సెల్", మహిళా ఉద్యోగినులును రాత్రీ వేళల్లో పనిచేయాలని ఒత్తిడి చేయకుండా,
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినులతో సమానంగా 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ తదితర అంశాలపై AP JAC అమరావతి పక్షాన మహిళా చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మా గారికి మహిళా దినోత్సవ వేదిక ద్వారా విన్నవించటం జరిగింది. వారి ద్వారా గౌ|| ముఖ్యమంత్రి గారికి విన్నవించి ఆయా సమస్యలను పరిష్కరించుకుంటామని రాష్ట్రంలో ని అందరూ మహిళా ఉద్యోగినులు, ఉపాధ్యాయినులుకు తెలియచేస్తున్నాము.

0 Comments
Thanks For Your Valuable Feed Back