ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల‌కు డాక్ట‌ర్ వైయ‌స్సార్ ఆరోగ్యశ్రీ  వ‌ర్తింపు..

హర్షం వ్యక్తం చేసిన దామోదర్... వైవి రావు..

అమ‌రావ‌తి.... రాష్ట్రంలోని  ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల‌కు డాక్ట‌ర్ వైయ‌స్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

2. ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసిన కార‌ణంగా ఆరోగ్య‌శ్రీ  ప‌థ‌‌కాన్ని వారికి కూడా వ‌ర్తింప చేయాల‌ని ప్ర‌భుత్వం తాజాగా నిర్ధారించింది.

4. ఆర్టీసీ కార్మికుల‌కు  ప్ర‌స్తుతం ఆర్టీసీ ఆసుప‌త్రుల‌లో ఉచితంగా వైద్య స‌దుపాయం అమ‌లు అవుతో్న్న సంగ‌తి తెలిసిందే. ఇదే. ఈ ఆసుప‌త్రుల‌లో వైద్యం ల‌భించ‌ని స్థితిలో మాత్రం ఆ కేసుల‌ను ఆరోగ్య‌శ్రీకి రెఫ‌ర్  చేస్తారు. 

5. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగుల‌కు సంబంధించిన ప్ర‌జా ర‌వాణా డిపార్టుమెంట్ నుంచి ప్ర‌తి నెలా ప్ర‌తి ఉద్యోగి నుంచి ఈపీఎఫ్ లాగా త‌మ వంతు కంట్రిబ్యూష‌న్‌ను వ‌సూలు చేస్తారు.

6 ప్ర‌జా ర‌వాణా డిపార్టుమెంటు ఉద్యోగులు నియ‌మ నిబంధ‌న‌ల‌ను విధిగా.  పాటిస్తే ఆరోగ్య‌శ్రీ సంస్థ వారికి గుర్తింపు కార్డుల‌ను జారీ చేస్తుంది. ఇక నుంచి తోటి ప్ర‌భుత్వ ఉద్యోగుల్లాగే ఆర్టీసీ కార్మికులు ఉద్యోగుల‌కు ఆరోగ్య‌శ్రీ అమ‌లవుతుంది..