మునిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజును లోకల్ హాలిడేగా ప్రకటించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 2 నుంచి 3 గంటల సమయం ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేసారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ తేదీ మార్చి 10న లోకల్ హాలిడే ప్రకటిస్తూ జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టరు గంధం చంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు.. మార్చి 10న పోలింగ్ జరిగే పట్టణ ప్రాంతాలలో స్థానిక సెలవు వర్తిస్తుందని ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ నెగోషియబుల్ ఇంస్ట్రుమెంట్స్ చట్టం, 1881 ప్రకారం ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలింగ్ రోజును స్థానిక సెలవు దినంగా ప్రకటిస్తున్నామన్నారు.
అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగివున్న ఉపాధ్యాయులు మరియు ఇతర ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రెండు నుంచి మూడు గంటల సమయం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశిందన్నారు. ఓటు వేసేందుకు సమయం కోరే ఉద్యోగులు పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న ఆధారాలను తమ కార్యాలయాల్లో అందించి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కలెక్టర్ సూచించారు. పట్టణ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పోలింగులో పాల్గొని మునిసిపల్ ఎన్నికలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు విజ్ఞప్తి చేశారు.
సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురము వారిచే జారీచేయబడినది.