VROల సమస్యలపై ఐక్యతగా తోలిఅడుగు వేసిన రెవిన్యూ ఉద్యోగ సంఘాలు
పదోన్నతుల పై సానుకూలంగా స్పందించిన CCLA
హర్షం వ్యక్తం చేసిన VRO సంఘం నాయకులు చంటి/సురేష్
విమర్శలు చేసేవారికి అవకాసం కల్పించం. బొప్పరాజు
నిన్నటి రోజు సాయంత్రం CCLA కార్యాలయంలో గౌరవ CCLA శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ IAS గారిని మరియు CCLA అధికారులను APRSA రాష్ట్ర అధ్యక్ష కార్యదర్సులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, సి.హెచ్.కృష్ణమూర్తి గారు మరియు APVROA రాష్ట్ర అధ్యక్ష కార్యదర్సులు కె.అంజనేయకుమార్, సి.హెచ్.సురేష్ బాబు లు ఉమ్మడిగా కలసి VROల పదోన్నతులపై మరియు ఇతర అన్ని సమస్యలపై వినతులు మరియు ఉమ్మడి అంగీకార మెమోరాండంలను సమర్పించడం జరిగింది.
తదుపరి మేము సమర్పించిన పదోన్నతులు మరియు ఇతర సమస్యలపై సానుకూలంగా స్పందించి అతి త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు,
మా సమస్యలపై మరియు రెండు సంఘాల ఐక్యత కలయికపై సానుకూలంగా స్పందించి శుభాకాంక్షలు తెలిపినందులకు గౌరవ CCLA గారికి మరియు CCLA కార్యాలయ అధికారులకు అలాగే ఇచ్చిన మాట ప్రకారం తొలిరోజే సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేసినందుకు అభినందనలు తెలుపుతూ ఇదే ఐక్యతను కొనసాగించి అతి త్వరలో మన ఐక్యత తాలూకు ఫలాలను సాధిస్తామని కృతనిశ్చయంతో ఇందులకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. తెలుపుతూ.
వర్ధిల్లాలి రెవిన్యూ ఉద్యోగుల ఐక్యత
మీ
కె.అంజనేయకుమార్(చంటి)
అధ్యక్షులు
సి.హెచ్.సురేష్ బాబు
ప్రధాన కార్యదర్శి
APVRO అసోసియేషన్
రాష్ట్రకమిటీ.
0 Comments
Thanks For Your Valuable Feed Back