కరోనా వాక్సిన్ కూడా తీసుకోకుండా ధైర్యంగా ముందుకు నడిచి, విజయవంతంగా నాలుగు (4) విడతల పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించిన ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులకు AP JAC అమరావతి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు... బొప్పరాజు & వై వి రావు.
● అతి తక్కువ సమయంలో, అకస్మాత్తుగా SEC గారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటికీ గతంలో AP JAC అమరావతి చెప్పినట్లే ఎంతో అనుభవం ఉన్న రాష్ట్ర ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు రాత్రి, పగలు కష్టపడి ప్రత్యేకంగా పంచాయతీ రాజ్, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల సిబ్బంది అందరు కష్టపడి 4 విడతల పంచాయితీ ఎన్నికలు విజయవంతం గా నిర్వహించటం జరిగిందని బొప్పరాజు & వై వి రావులు పేర్కొన్నారు..
● ఎన్నికల విధులలో ఉన్న ఒక ఉద్యోగిని, VRA లు మరణించడం బాధాకరం. వారికి మరియు జిల్లా అధికారుల నివేదికలు ప్రకారం ఇంకా ఎవరైనా మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులకు AP JAC అమరావతి పక్షాన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియచేస్తున్నాము. వారికి రావలసిన అన్నీ రాయితీలు exgratia తో సహా వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారిని బొప్పరాజు & వై వి రావులు కోరారు.
● ఎన్నికల విధులలో పాల్గొన్న అనేక మంది ఉద్యోగులు ప్రత్యేకంగా మహిళా ఉద్యోగినులకు సరైన భోజనం, వసతి, రవాణా లాంటి కనీస సౌకర్యాలు కల్పించకపోయినా బాధ్యతతో కష్టపడి అన్నిటికి ఓర్చుకొని విధినిర్వహణలో పాల్గొన్నారు.
● ఎన్నికల నిర్వహణ చేస్తున్న శాఖలకు ఇప్పటికీ సరిపడా నిధులు ఇవ్వలేదు. కొంతమంది అధికారులు, ఉద్యోగులు అప్పులు తీసుకువచ్చి ఖర్చు పెడుతున్నారు. ఇది చాలా బాధాకరం. గతంలో అనగా 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు పెట్టిన కొన్ని డబ్బులు నేటికి రాకపోడం వలన క్రింది స్థాయి అధికారులు/ఉద్యోగులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ప్రభుత్వ పెద్దలు ఈ అంశాన్ని పరిశీలించి సమస్య పరిష్కరించ గలరు.
● వీటన్నిటికీ ప్రధాన కారణం సరిపడా సమయం, ప్రణాళికా, నిధులు లేకుండానే ఎన్నికల నిర్వహణకు వెళ్లడం వలనే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. అలాగే గతంలో AP JAC అమరావతి స్పష్టంగా ఎన్నికల నిర్వహణకు Men, Material & Money మూడూ అంశాలు చాలా అవసరమని చెప్పియున్నాము.
● దేశంలో కరోనా మరల విజృంభిస్తున్న ఈ తరుణంలో రాబోయే నగర పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులు, ఉద్యోగులకు కరోనా వ్యాధి ప్రబలకుండా (కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నైపద్యంలో) తక్షణమే తగిన చర్యలు, ఏరకమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా సరైన భోజనం, వసతి, రవాణా లాంటి కనీస సౌకర్యాలు మరీ ప్రత్యేకంగా మహిళ ఉద్యోగినులు, ఉపాధ్యాయినిలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న సంఘటనలు మరలా జరుగకుండా, పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఎదురైన ఇబ్బందులు, అనుభవాలను అవసరమైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు గ్రౌండ్ లెవెల్ లో ప్రత్యక్షంగా ఎన్నికల నిర్వహణ లో పాల్గొన్న అధికారులు, క్రింది స్థాయి ఉద్యోగుల ద్వారా తెలుసుకొని అవి తిరిగి జరుగబోయే నగర పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులను AP JAC అమరావతి పక్షాన కోరుతున్నాము.
బొప్పరాజు & వై వి రావు
0 Comments
Thanks For Your Valuable Feed Back