అపోహలకు ఇక తావివ్వకుండా కలిసికట్టుగా ఉండి పోరాటం చేస్తాం.....
మేమంతా ఒకే కుటుంబం ఇతరుల ప్రమేయాన్ని సహించం....
రెవెన్యూ శాఖలో కీలకముగా పని చేస్తునటువంటి గ్రామ రెవెన్యూ అధికారుల యొక్క పదో న్నతులపై గత మూడు సంవత్సరములు గా తర్జన భర్జనలు జరుగుతు తీవ్రమైన ప్రతి స్టంభన నెల కొన్న సంగతి అందరికీ తెలిసినదే. వి.ఆర్.ఓ సోదరుల పదోన్నతులకు APRSA ఏనాడూ అడ్డు చెప్పలేదని పైగా గ్రామ రెవెన్యూ అధికారులను తమ సొంత కుటుంభ సభ్యులుగానే భావించి గతంలోనే వారి పధోన్నతులకు సంభందించి APRSA – AP VRO సంఘాల సంయుక్తముగా అంగీకారపత్రము తీసుకొని రెవెన్యూ శాఖలోనే పని చేస్తునటువంటి జూనియర్ సహాయకులు / టైపిస్టుల ప్రయోజనలు దెబ్బతినకుండా VROలకు పధోన్నతులు చేపట్టుటకు ఎటువంటి అభ్యంతరములు లేవని తెలియజేయడమైనది. ఆనాటి ఉద్యోగ సంఘాల నేతలు, సోదర VRO సంఘనాయకులకు లేని పోనీ అపోహలు కలుగజేసీ ఆనాటి ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రాకుండా ఆపివేసినారు. కానీ నేటి ప్రభుత్వం ఇరువర్గాలు నష్టం కాకుండా G.O.Ms.No. 132 తేదీ 08.05.2020 విడుదల చేయటం జరిగినది. అయితే సదరు ప్రభుత్వ ఉతర్వులపై అసంతృప్తి తో మా సోదర VRO సంఘ నాయకులు తిరిగి ప్రభుత్వాన్ని ఆశ్రయించడం, ధానిని ఆశరాగ తీసుకున్న ఇతర ఉధ్యోగ సంఘ నాయకులు, ఫెడరేషన్ నాయకులు VRO లకు నేరుగా సీనియర్ సహాయకులుగా ప్రమోషన్ లు ఇప్పిస్తామని నమ్మబలికి వారి స్వార్ధ ప్రయోజనలకోసం ఇప్పటి వరకు వాడుకున్నారు. ప్రభుత్వం ఇరువర్గాలకి నష్టం జరగ కుండ చేయాలనే సదుద్దేశం తో, ఇతర సంఘాలు తీవ్రమైన ఒత్తిడి తెచ్చినప్పటికి, ప్రభుత్వం G.O.Ms. No.132నకు నేటి వరకు ఎటువంటి సవరణ ఉతర్వులు ఇవ్వలేదు.
కొద్ధిగా ఆలస్యమైనా తేరుకొన్న గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ నాయకులు, ప్రభుత్వం ఎంతో పెద్ద మనసుతో కల్పించినటువంటి పధోన్నతుల అవకాశాన్ని కొందరు స్వార్ధపూరిత నాయకుల వలలో పడి సకాలములో సద్వినియోగం చేసుకోలేని ధౌర్భాగ్య పరిస్తితులలో కొట్టుమిట్టాడుతున్నామని తెలుసుకొని కన్న తల్లి లాంటి APRSA ను దూరము చేసుకోవడం వల్లనే నేడు ఈ పరిస్థితి దాపురించినదని తెలుసుకొని, ఇప్పటికే తీవ్రముగా నస్ట్టపోయామని గ్రహించి సదరు విషయాలను వారి వారి జిల్లా నాయకత్వములతో చర్చలు జరిపి,తద్వారా కన్న తల్లి లాంటి APRSA తో కలిసి పధోన్నతుల విషయములో ఏకతాటిపై నడిచి వాటిని వెంటనే సాదించుకోవాలని, తద్వారా ఐకమత్యమును చాటి, సంఘముల మద్య చిచ్చుపెట్టి పబ్బము గడుపుకోవాలని చూస్తున్న స్వార్ధపూరిత నాయకుల కుట్రలను సమిష్టిగా తిప్పికొట్టాలని నిర్ణయించడమైనది.
అందులో బాగంగానే, నేడు ఇరుసంఘాల ప్రధాన నాయకత్వాలు చర్చించుకొని ప్రస్తుతం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న జూనియర్ సహాయకులకు నష్టం కలగ కుండ, జూనియర్ సహాయకుల స్కేలు పొందుతున్న VRO లకు నేరుగా సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించాలని, ప్రస్తుతం VRO పదోన్నతులపై ఇచ్చిన G.O.Ms. No.132కు కొన్ని సవరణలు APRSA– AP VRO సంఘాలు సంయుక్తం గా ‘అంగీకార పత్రాన్ని’ నేడు 25..02.2021 న వ్రాసుకొని, దీనిని అమలుపరిచి ఈ పదోన్నతులపై ఉన్న ప్రతిష్టంబనని వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని కోరాలని ఇరుసంఘాలు నిర్ణయించడమైనది
0 Comments
Thanks For Your Valuable Feed Back