ఎన్నికల విధుల నుండి దివ్యాoగులు (వికలాంగులకు), గర్భిణీ/బాలింతలకు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే ఉద్యోగులకు మినహాయింపు.... బొప్పరాజు & వైవీ రావు.

   SEC కి నివేదించిన APJAC అమరావతి 

గత నెల 30/01/21 న AP JAC అమరావతి రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గార్ని కలసిన సందర్భంగా... ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగుల ఆరోగ్య ఇబ్బందులు దృష్టి లో వుంచుకొని దివ్యాoగులు (వికలాంగులకు), గర్భిణీ/బాలింతలకు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే ఉద్యోగులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వమని AP JAC అమరావతి కోరగా నేడు రాష్ట్ర ఎన్నిక అధికారి గారు వారి ఉత్తర్వులు Lr. No.293/SEC-బి2/2021 తేదీ 6.2.2021 ద్వారా ఈ క్రింద తెలిపిన విధంగా ఆదేశాలను రాష్ట్రంలోని అన్నీ జిల్లా కలెక్టర్లకు పంపడమైనది.

 

 1 . కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఉండాలంటే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన

పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి 3.30 వరకు కాకుండా, గతంలో మాదిరిగా ఉదయం 6.30 గంటల నుండి 1.30 గంటలకే పూర్తి చేయాలని AP JAC అమరావతి కోరగా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మరియు కోరుకున్న వివిధ జిల్లా కలెక్టర్ల అభ్యర్ధన మేరకు,  నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో/ గ్రామాలలో  మాత్రం పోలింగ్ మధ్యాహ్నం 1.30 ని: లకు పూర్తి చేయాలని, మిగిలిన అన్ని చోట్ల 3.30 గ: ల వరకు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ ఆదేశాలు ఇవ్వడమైనది.

 2 . అలాగే గర్భిణీ, బాలింతలు గా ఉన్న ఉద్యోగినులకు ఎన్నికల విదులనుండి మినహాయింపు.

 3 . అలాగే దివ్యాoగ (వికలాంగులు) ఉద్యోగులకు ఎన్నికల డ్యూటీలనుండి మినహాయింపు..

 4 . ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని, 50 సంవత్సరాలు దాటి దీర్ఘకాలిక వ్యాధులు (అనగా గుండె, కిడ్నీ, కాన్సర్ లాంటి) తో బాధపడే ఉద్యోగులను ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇస్తూ నేడు ఆదేశాలు ఇవ్వడమైనది.

 

● అలాగే రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు గారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలోని ప్రెస్ తో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఆందోళన, తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అతి తక్కువ సమయంలోనే వచ్చినప్పటికీ, ఉద్యోగులు/ అధికారులు రాత్రి, పగలు తేడా లేకుండా ఎన్నికల విధులు కష్టపడి పనిచేస్తున్నారని, అలాంటివారి పట్ల ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా  సంయమనం పాటించాలని, ఇదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కష్టపడి, ఎక్కడ ఎలాంటి అవకతవకలకు/పొరపట్లకు ఆస్కారం కల్పించకుండా, ఎవరి మాటలు మనసుకు తీసుకోకుండా విజయవంతమైన ఎన్నికల నిర్వహనే మన ముందున్న లక్షంగా పని చేయాలని, ఎన్నో ఎన్నికలను విజయవంతం చేసిన అపార అనుభవం ఉన్న మన రాష్ట్ర అధికారులు, ఉద్యోగులు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన పనిలేదని, రాజ్యాంగానికి లోబడి పని చేస్తే ఎవరికి భయపడాల్సిన పని లేదని, అలాంటి అధికారులు/ఉద్యోగులు వెంట AP JAC అమరావతి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియచేయడమైనది.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రెటరీ జనరల్ వైవీ రావు, కృష్ణా జిల్లా AP JAC అమరావతి చైర్మన్ దొప్పలపూడి ఈశ్వర్, రాష్ట్ర వైస్ ఛైర్మన్ బి.కిషోర్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు. 


బొప్పరాజు & వైవీ రావు.

2021_LR.NO_293.SEC.BS_EXEMPTION OF DUTIES TO PH N PREGNANT WOMAN