నెలలు దాటినా ఆర్ధిక శాఖ నుండి చేతికందని రావాల్సిన, దాచుకున్న పెన్షనర్ల,ఉద్యోగుల పైకం...బొప్పరాజు

★ రిటైర్మెంట్ రోజునే ఉద్యోగికి రావాల్సిన బెనిఫిట్స్..ప్రభుత్వ ఉత్తర్వులకు తిలోదకాలు పల్కిన ఆర్ధిక శాఖ...

★ జబ్బున పడిన ఎంప్లాయిస్ హెల్త్ కార్డులు
         ....

ప్రభుత్వ ఉద్యోగులు పదవీ (రిటైర్మెంట్ బెనిఫిట్స్) విరమణ రోజునే వారికి రావాలిసిన డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ అవసరాల నిమిత్తం వారు దాచుకున్న (జిపిఎఫ్ నుండి) డబ్బులు (లోన్స్), ఉద్యోగుల, పోలీసుల సరెండర్ లీవ్స్ చెల్లింపులు తదితర బిల్లులన్నియు నెలల తరబడి ఆర్ధిక శాఖలో పేరుకుపోయి ఆర్ధిక శాఖ కార్యదర్శి గారి ఆమోదం కొరకు ఎదురు చూస్తున్నందున... ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆందోళనకు గురి చెందుతున్నారని...కొంతమంది ఉద్యోగులు వారి కూతురు/కుమారుని వివాహానికి అని.. వారు దాచుకున్న డబ్బులు సకాలంలో ప్రభుత్వం నుండి రాకపోతే... వడ్డీలకు డబ్బులు తీసుకుని ఆ వడ్డీలు చెల్లించలేక తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు. మరికొంతమంది సకాలంలో బిల్లులు చెల్లింపు కాక ఇటీవల వారి ఇంట్లో శుభకార్యాలు కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు అనేకం.
ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులదేనని, వారి చర్యలను AP JAC అమరావతి రాష్ట్ర కార్యవర్గం తీవ్ర అసంతృప్తి తెలియచేస్తూ తేదీ 27.1.2021న జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. 

● అలాగే తక్షణమే ఆర్ధిక శాఖలో పెండింగులో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లకు చెందిన అన్ని బిల్లులను తక్షణమే ఆమోదించాలని, ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం ఉద్యోగి పదవీ విరమణ చేసిన రోజే వారికి రావాలిసిన బెనిఫిట్స్ అన్నీ అదేరోజున ఇచ్చే విధంగా తక్షణమే ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించాలని, అలాగే     ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ అవసరాల నిమిత్తం వారు దాచుకున్న జిపిఎఫ్ లోన్స్, ఉద్యోగుల, పోలీసుల సరెండర్ లీవ్స్ చెల్లింపులు తదితర బిల్లులన్నియు ఎప్పటికప్పుడు బిల్లులు *ఆర్ధిక శాఖతో సంబంధం లేకుండా CFMS నుండే డైరెక్ట్ గా వారి వారి అకౌంట్ కు చేరే విధంగా* తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాలని కోరాము.


 *ఎంప్లాయిస్ హెల్త్ కార్డ్స్:* 

● అలాగే రాష్ట్రంలో గత 7 సంవత్సరాల క్రితం దివంగత ముఖ్యమంత్రి డా11వైయస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎంప్లాయి హెల్త్ కార్డ్ ఈ రోజుకు కూడా పూర్తిగా వినియోగంలోకి రాకపోగా, 7 మంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మారినా ఎంప్లాయిస్ హెల్త్ స్కీం పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడానికి కావాల్సిన చర్యలు కోసం ఏర్పాటు చేయబడ్డ స్టీరింగ్ కమిటీ సమావేశం ఈ రోజుకు కూడా జరుపక పోవడం దురదృష్టకరమని AP JAC అమరావతి అభిప్రాయపడింది.

● ఎంప్లాయి హెల్త్ కార్డ్ వలన ఉద్యోగులు ఇబ్బందిపడుతున్న ఇబ్బందుల్ని సమావేశం తీవ్రంగా చర్చించింది. ప్రతినెలా ఉద్యోగుల శాలరీ నుండి EHS  కు సబ్ స్క్రిప్షన్ రికవరీ అవుతున్నా ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందటం లేదు.ఆరోగ్య ఇబ్బందులతో వైద్యం కోసం వెళ్లే వారికి రెఫరల్ హాస్పిటల్స్ నందు సరైన రెస్పాన్స్ ఉండటం లేదు. ఆఖరికి ఉద్యోగసంఘాల నాయకులు తమ ఉద్యోగులకు ఈ Un healthy card వద్దు అని తెలియచేశారు. 

● కావున తక్షణమే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు వారి ఆధ్వర్యంలో EHS స్కీం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించాలని, లేదంటే వెంటనే EHS  రికవరి నెల వారి చందాను నిలుపుదల చేసి, ఉద్యోగులకు, పెన్షనర్లకు మెడికల్ రేయింబర్సుమెంట్ కింద ప్రస్తుతం ఉన్న 2 లక్షల రూపాయల లిమిట్ ను 5 లక్షల రూపాయలకు పెంచాలని కోరారు.

పైన తెలిపిన ప్రధానమైన రెండు తీర్మానాలను మెమొరాండం రూపంలో తయారు చేసి నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి చైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జనరల్ వైవీ రావులు సమర్పించగా, వారు పై విషయాలపై చాలా సానుకూలంగా స్పందిస్తూ, ఎన్నికల కోడ్ ఉన్నందున సదరు విషయమై ఒక్కసారి పరిశీలించి వీలైనంత త్వరగా ఆర్ధిక శాఖ అధికారులతో మరియు వైద్య శాఖాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పై రెండు ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

బొప్పరాజు & వైవీ రావు.