- 10 రోజులు దాటినా నేటికి పూర్తి స్థాయిలో అందని పెన్షన్లు...తల్లడిల్లిపోతున్న పెన్షనర్లు.. విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆల్ఫ్రెడ్, బొప్పరాజు & వైవీ రావు.
- పెన్షనర్లకు పెన్షన్ చెల్లించినాకే మాకు జీతాలు చెల్లించండి అని అనేక సార్లు ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారులకు విన్నవించినా ఉపయోగం లేదు..ప్రతి నెలా ఇదే తంతు... బొప్పరాజు, విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆల్ఫ్రెడ్ & వైవీ రావు
....
రాష్ట్రంలో ఉన్న నాలుగు లక్షల మంది పెన్షనర్లకు గతంలో ప్రతి నెల ఒకటవ తరీకునే పెన్షన్ వచ్చేది. ఏదైనా తీవ్ర ఇబ్బందులు ఉంటే 2 లేక 3 రోజులు అలస్యమయ్యేది. కానీ నేటి పరిస్థితి వేరు. ప్రతి నెల పెన్షన్ ఏరోజు వస్తుందో గ్యారంటీ లేదు. ప్రత్యేకంగా ఈ నెల విషయం తీలుకుంటే , 11 రోజులు దాటినా ఈ రోజుకు కూడా రాష్ట్రంలో చాలా మందికి పెన్షన్ అందలేదు. ఇంత పెద్ద కరోన ప్రమాద పరిస్థితుల్లో, అనేక ఖర్చుల నైపద్యంలో వచ్చే ఆ చిన్నపాటి పెన్షన్...ఈ రోజు వస్తుందిలే...ఈ రోజు వస్తుందిలే.. అని ఆ ముసలి ప్రాణాలు ఎదురు చూస్తూ ఉన్నాయి.
- గతంలో AP JAC అమరావతి పక్షాన ప్రభుత్వ పెద్దల నుండి ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారులకు చాలా స్పష్టంగా.... "ముందు పెన్షనర్లకు పెన్షన్ చెల్లించినాకే మాకు జీత భత్యాలు ఇవ్వండి కారణం మాకు ఉద్యోగం ఉందని బయట అప్పులు అయినా ఇస్తారు కానీ పెన్షనర్లకు ఇవ్వరని చెప్పించాము". అది కేవలం నెలా, రెండు నెలలు పాటించారు. కొత్తగా ఇటీవల కొన్ని జిల్లాల్లో... కొన్ని శాఖలలో... కొంతమంది పెన్షనర్లకు పెన్షన్ వస్తుంది. మెజారిటీ పెన్షనర్లకు 1వ తరీకున పెన్షన్ రావడం లేదు అనేది వాస్తవం. ఇది కేవలం ఆర్ధిక శాఖ ఉన్నతాధికారుల వైఫల్యం అని చెప్పక తప్పదు.
- ప్రభుత్వ ఉద్యోగులు పదవీ (రిటైర్మెంట్ బెనిఫిట్స్) విరమణ రోజునే వారికి రావాలసిన డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ అవసరాల నిమిత్తం వారు దాచుకున్న (జిపిఎఫ్ నుండి) డబ్బులు (లోన్స్), ఉద్యోగుల, పోలీసుల సరెండర్ లీవ్స్ చెల్లింపులు తదితర బిల్లులన్నియు నెలల తరబడి ఆర్ధిక శాఖలో పేరుకుపోయి ఆర్ధిక శాఖ కార్యదర్శి గారి ఆమోదం కొరకు ఎదురు చూస్తున్నందున... ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆందోళనకు గురి చెందుతున్నారని...కొంతమంది ఉద్యోగులు వారి కూతురు/కుమారుని వివాహానికి అని.. వారు దాచుకున్న డబ్బులు సకాలంలో ప్రభుత్వం నుండి రాకపోతే... వడ్డీలకు డబ్బులు తీసుకుని ఆ వడ్డీలు చెల్లించలేక తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు. మరికొంతమంది సకాలంలో బిల్లులు చెల్లింపు కాక ఇటీవల వారి ఇంట్లో శుభకార్యాలు కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు అనేకం.
- ఈ విషయాలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి దృష్టికి కూడా AP JAC అమరావతి పక్షాన (representation) తీసుకుని వెళ్లగా, తప్పకుండా త్వరలో ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
- దయచేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు తక్షణమే ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి 1 . ఈ నెల పెన్షన్ ఇంకా ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించెవిధంగా, 2 . అదేవిధంగా ప్రతి నెలా మా జీతలకన్నా ముందే పెన్షనర్లకు పెన్షన్ చెల్లించేవిధంగా ఆదేశాలు జరీచేయలని, 3 . ఆర్ధిక శాఖ కార్యదర్శి గారి దగ్గర మేము దాచుకున్నా, మాకు రావాల్సిన డబ్బులు తక్షణమే ఈ రోజు వరకు పెండింగులో ఉన్న బిల్లులన్నీ క్లియర్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాము.
బొప్పరాజు, కె.ఆల్ఫ్రెడ్, విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు & వైవీ రావు.
0 Comments
Thanks For Your Valuable Feed Back