అంతర్జాతీయ మహిళా దినోత్సవము ( 08.03.2021 )
రాష్ట్ర స్థాయి వేడుకలు ఏలూరులో APJAC అమరావతి అద్వర్యములో అంతర్జాతీయ మహిళా దినోత్సవము 08.03.2021 నాడు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నందు నిర్వహించుటకు నిర్ణయించి, ఏలూరు లోని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అస్సోసియేషన్ భవనము నందు పాత్రికేయుల సమావేశము నిర్వహించడము జరిగినది.
ఈ సమావేశములో APJAC అమరావతి రాష్ట్ర మహిళా విభాగము చైర్మన్ శ్రీమతి బి.సుశీల గారు మాట్లాడుతూ ది.08.03.2021న అంతర్జాతీయ మహిళా దినోత్సవమును పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నందు నిర్వహించుచున్నామని తెలియజేసియున్నారు. APJAC అమరావతి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ కె. రమేష్ కుమార్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధికారులు మరియు ఉద్యోగినిలను గౌరవించుకొనవలెనన్న సంకల్పముతో APJAC అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగము అధ్వర్యములో, 08.032021వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవము రాష్ట్ర స్థాయి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నందు నిర్వహించ తలపెట్టినాము. మహిళా 24 x 7 తల్లిగా, భార్యగా, సోదరిగా, ప్రజా సేవకురాలిగా అనేక బాద్యతలను, కర్తవ్యాలను నిర్వహిస్తున్న మహిళా అధికారులకు మరియు ఉద్యోగినిలకు ఉపశమనము కొరకు క్రీడలు మరియు సంస్కృతిక కార్యక్రమములను నిర్వహించి అంతర్జాతీయ మహిళా దినోత్సవము నాడు సత్కరించుకొనుటకు ఈ క్రింది క్రీడలు మరియు సంస్కృతిక కార్యక్రమములను ది. 28.02.2021 (ఆదివారము) పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నందు నిర్వహించుచున్నాము .
క్రీడలు మరియు సంస్కృతిక పోటీల వివరములు :
1 ) రంగవల్లులు
2 ) లెమన్ & స్పూన్
3 ) పాటలు
4 ) నృత్యము ( Dance )
5 ) స్కిప్పింగ్
6 ) చెస్
7) క్యారమ్స్ ( సింగిల్స్ ' మరియు డబల్స్
8 ) మ్యూజికల్ చైర్స్
9 ) స్లో సైకిలింగ్
10 ) పెటిల్ బ్యాట్మింటన్ ( సింగిల్స్ మరియు డబల్స్
11)టేన్నిర్వయిట్ ( సింగిల్స్ మరియు డబల్స్ 
12 ) 100 మీటర్ల పరుగు పందెం 
13 ) షాట్ పుట్
14) కబడి
15) లో బాల్
16 ) అగ్ ఆఫ్ వార్
17 ) వకృత్వ పోటీ ( టాపిక్ : నేటి మహిళ )
18 ) వ్యాస రచన పోటీ ( స్త్రీ సాధికారత )

పశ్చిమగోదావరి జిల్లా నందు అన్ని శాఖలలో పనిచేయుచున్న మహిళా అధికారులు మరియు ఉద్యోగినిలు ది.28.02 2021 వ తేదీ ఆదివారము నాడు పశ్చిమగోదావరి జిల్లా , ఏలూరు నందు గల ఇండోర్ స్టేడియమునకు ఉదయము 8:00 గలకు హాజరయ్యి క్రీడా మరియు సంస్కృతిక కార్యక్రమములలో పాల్గొని ఈ కార్యక్రమమును విజయవంతము చేయవలసిందిగా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవము క్రీడా పోటీలకు సంబంధించిన గోడా పత్రిక మరియు కరపత్రములను ఆవిస్కరించారు. APJAC అమరావతి పశ్చిమగోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ, శ్రీ ఆర్. వెంకట రాజేష్ గారు మాట్లాడుతూ ఈ క్రీడలు మరియు సంస్కృతిక పోటీలను పూర్తి స్థాయి COMD నిభంధనలను అనుసరిస్తూ స్థానిక కలెక్టర్ ఆఫీసు ముందు గల ఇండోర్ స్టేడియం, ఏలూరు నందు నిర్వహించుచున్నామని, కావున అన్ని శాఖల మహిళా అధికారులు ఉద్యోగిణీలు పాల్గొనవలసిందిగా కొరియున్నారు.

ఈ కార్యక్రమము నందు APJAC అమరావతి మహిళా విభాగము నాయకురాలు శ్రీమతి మెహరాజ్ సుల్తాన, కో - చైర్మన్ , D. సల్మా . శ్రీమతి బి. సీతారత్నం, పీమ, APJAC అమరావతి పశ్చిమగోదావరి జిల్లా నాయకులు శ్రీ వైజి.ఎల్. నారాయణ, డ్రైవర్స్ అస్సోసియేషన్ జిల్లా నాయకులు పశ్చిమగోదావరి జిల్లా, శ్రీ పి. రాంబాబు APPTPD ఎంప్లాయూస్ యూనియన్ శ్రీ ఎ. ప్రమోద్ కుమార్, సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అస్సోసియేషన్, శ్రీ డి. బుజ్జిబాబు, అధ్యక్షులు గంటెడ్ అధికారుల సంఘము ఆదితరులు పాల్గొనియున్నారు.