◆ ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా రెవిన్యూ 2021 డైరీ ఆవిష్కరణ.
◆ ప్రతి సంవత్సరం రెవిన్యూ డైరీని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచే ఆవిష్కరించి కోవడం ఆనవాయితీ.
◆ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ౹౹ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు డైరీ ని పూర్తిగా పరిశీలించిన పిదప డైరీలో చాలా ముఖ్యమైన విషయాలు పొందుపరిచారని, ప్రత్యేకంగా ల్యాండ్ అంశం పై ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుండి విడుదలవుతున్న కొత్త కొత్త జిఓలతో సహా కూలంకషంగా రెవెన్యూ డైరీని ప్రభుత్వ ఉద్యోగులకు, రెవెన్యూ ఉద్యోగులకు అందరికీ కూడా ఉపయోగపడుతుందని తెలిపారు.
◆ ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బొప్పరాజు గారు మాట్లాడుతూ ఇటీవల గౌ౹౹ ముఖ్యమంత్రి గారు 100 సంవత్సరాల క్రితం చేసిన భూ సర్వేను ఇప్పుడు రీ సర్వే చేయాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని దానికి గౌ౹౹ ముఖ్యమంత్రి గారికి APRSA పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని, దీనిద్వారా రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని తెలిపారు.
◆ రీ సర్వే ద్వారా రెవెన్యూ శాఖలో ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి ఎన్నో సమస్యలు పరిష్కారం కావడానికి ఒక మార్గం సుగమమైందని అలాగే రీ సర్వే జరిపేటప్పుడు రెవెన్యూ ఉద్యోగులు ఎక్కడ కూడా ఒత్తిడికి లోను చేయకుండా వారికి తగినటువంటి స్వేచ్ఛ ఇచ్చినట్లయితే రీ సర్వే ప్రోగ్రాం అత్యంత విజయవంతంగా పూర్తి చేయగలరని ఈసందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల అందర్నీ కూడా ఈ సర్వేలో చక్కగా సమన్వయపరుస్తూ ముఖ్యమంత్రి గారు ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు.
◆ ఈ సందర్భంగా గౌ౹౹ ముఖ్యమంత్రి గారికి APRSA పక్షాన ఒక representation సమర్పిస్తూ రీ-సర్వే సందర్భంగా మా సంఘం ద్వారా కొన్ని సలహాలు, సూచనలు ఉన్నాయని వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ప్రత్యేకంగా సెటిల్మెంట్ట అప్పుడు తగిన స్థాయి అధికారులు, శిక్షణ అవసరమని అదేవిధంగా 2 మండలాలకు ఒక యూనిట్, 10 మండలాలకు డివిజన్ స్థాయిలో ఒక యూనిట్, జిల్లా స్థాయిలో coordination కొరకు ఒక యూనిట్ పెట్టడం ద్వారా regular విధులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా ఉంటుందని, ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు ద్వారా రీ సర్వే మొత్తం విజయవంతంగా నిర్వహించవచున్నని తెలిపారు.
◆ వెంటనే స్పందించిన గౌ౹౹ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ అసోసియేషన్ సలహాలు, సూచనలు తప్పకుండా పరిశీలించాలని వారి అదనపు కార్యదర్శి శ్రీ ధనుంజయ రెడ్డి గారిని ఆదేశించారు.
◆ ఈ సందర్భంగా రెవెన్యూ డైరీని తయారుచేయడంలో కీలకపాత్ర పోషించిన ముక్యులులో కర్నూలు జిల్లా అధ్యక్షుడు V. గిరి కుమార్ రెడ్డి గారిని, రాష్ట్ర స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రెటరీ నరసింహారావు గార్లను గౌ౹౹ ముఖ్యమంత్రి గారిచే సన్మానించడం జరిగింది.
◆ ఈ కార్యక్రమంలో APRSA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణ మూర్తి, స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రెటరీ నరసింహారావు, కోశాధికారి V. గిరి కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు..N. శ్రీనివాస్, M. విజయసింహరెడ్డి, శ్రీమతి B. సుశీల తదితరులు పాల్గొన్నారు.

0 Comments
Thanks For Your Valuable Feed Back