పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉద్యోగుల అభ్యంతరాలను గౌరవ రాష్ట్ర గవర్నర్ గార్ని కలసి తెలియచేసి వినతిపత్రం అందచేసిన ఏపీ జెఏసి అమరావతి ఉద్యోగుల సంఘం ....జెఏసీ చైర్మన్, బొప్పరాజు వెంకటేశ్వర్లు.

ఏపీ జెఏసీ అమరావతి పక్షాన గౌ౹౹ గవర్నర్ గారిని జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు నాయకత్వంలో రాష్ట్ర సంఘం సెక్రెటరీ జనరల్ మరియు APSRTC PTD ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు 2) వైవీ రావు, 3) హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, FAFTO చైర్మన్ మరియు AP JAC అమరావతి కో-చైర్మన్ G. V. నారాయణ రెడ్డి అలాగే 4) జనకుల శ్రీనివాసరావు, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు కో-చైర్మన్ AP JAC అమరావతి నలుగురు బృందం వారిని కలిసి పంచాయితీ ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలను 7 పేజీల లేఖలో సమర్పించటం జరిగింది.

◆ ప్రపంచాన్ని గడగడలాడించిన పెద్ద విపత్తుకు ప్రైవేటు రంగం మొత్తం భయపడి పక్కన వున్న పరిస్తుతలలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు అండగా ఉన్నామని గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము.

◆ కరోనాని ఎదుర్కొన్న ఘనత ప్రభుత్వ ఉద్యోగులదేనని అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా త్యాగాలను గుర్తించి వ్యాక్సిన్ ను ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు (ఫ్రంట్ లైన్ వారియర్స్ కు) అందిస్తున్నారని దానికి చాలా గర్వపడుతున్నామని తెలిపారు.

◆ రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రభుత్వ అభ్యర్ధనను పూర్తిగా వ్యతిరేకించి ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ అకస్మాత్తుగా విడుదల చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాం అన్నారు.

◆  ఎన్నికల ప్రక్రియ ఒకరోజులో అయ్యేది కాదు. వారు ప్రకటించిన 15 రోజుల్లోనే దాదాపు లక్ష నలభైవేల పోలింగ్ కేంద్రాలు పరిశీలన, బ్యాలెట్ బాక్సులు పరిశీలన, బ్యాలెట్ పేపర్ల పరిశీలన, ఎన్నికల నిర్వహణకు కావలసిన సరంజామా పరిశీలన తదితర మొత్తం కార్యక్రమం చూసుకోవాలి అంటే ఎన్నికల ముందు, ఎన్నికల రోజు మరియు ఎన్నికల తదనంతరం ప్రక్రియ చాలా సుదీర్ఘ మైన ప్రకీయ జరిపేటప్పుడు ఎదో ఒక సందర్భంలో వేలాదిమంది కరోనా బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. 

◆ ఇటీవల తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికలు జరిపితే కనీసం ముప్ఫై శాతం ఓటింగ్ దాటలేదని దానికి కారణం కరోనా వల్ల ప్రజలు భయపడి సరిగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రాలేదని తెలుపుతూ, పంచాయితీ ఎన్నకలంటే వందశాతం పోలింగ్ను రాజకీయ పార్టీలు ఆశిస్తారని ఆ వత్తిడిలో ప్రజలు కూడా కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

◆ కరోనా మహమ్మారి ముమ్మరంగా ఉన్నపుడే పీపీఈ కిట్లు లేక అనేకమంది ప్రభుత్వ డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని, పోలీసులను కోల్పోయామని అటువంటిది సుమారు 1,40,000 పోలింగ్ కేంద్రాలకు గాను, ఒక్కొక్క కేంద్రానికి 1+ 4 చొప్పున దాదాపు 4,5 లక్షల మంది సిబ్బందికి PPE కిట్లు ఎక్కడనుండి ఈ 15 రోజుల్లో తెప్పిస్తారని అలాగే అసలు PPE కిట్లు ధరించి గ్రామ స్థాయి ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ గారు పంతానికీ పోయి.. మా ప్రాణాలను పణంగా పెడతారా అని ప్రశ్నించారు. 

◆ చివరకు రాష్ట్ర ప్రభుత్వం తోపాటు,  హైకోర్టు కూడా నోటిఫికేషన్ ను  సస్పెండ్ చేసినా, పంతానికి పోయి తిరిగి వదలకుండా ఎస్ఈసీ గారు డివిజన్ బెంచ్ కు వెళ్ళారని దీనివల్ల కేంద్ర ప్రభుత్వం పంపిణీకి సిద్ధమైన వ్యాక్సిన్ తీసుకోకుండా మా ప్రాణాలను పణంగా పెట్టడం మంచిది కాదని ఆంద్రప్రదేశ్ గౌ౹౹ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లారు.  

◆ రాష్ట్ర ప్రభుత్వమే కుదరదని అన్నప్పుడు ఎస్ఈసీ ఎందుకు పంతం పడుతున్నారో చెప్పాలి అని..

◆ వ్యాక్సిన్ రెండు డోసులు ఇస్తే కానీ పని చేయదు అని శాస్త్రవేత్తలే చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్ ప్రతీ ఉద్యోగికి అందే వరకూ ఎన్నికలు జరగకుండా చూడాలని గౌ౹౹ గవర్నర్ గారిని  కోరాం. 

◆ హైకోర్టు బెంచ్ లో ఎలాంటి తీర్పు వచ్చినా మరలా సుప్రీం కోర్టులో కూడా అప్పీల్ వేసే పరిస్థితులు SEC గారికి ఉన్నందున...

◆ అలాగే ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని కేవలం నెల రోజులు సెలవు పెట్టాడనే కారణంతో వారిని ఉద్యోగం నుండి కనీసం బెనిఫిట్స్ కూడా రాకుండానే ఉద్యోగo నుండి డిస్మిస్ చేశారని, అలాగే ఇద్దరు అసిస్టెంట్ సెక్రెటరీ స్థాయి అధికారులకు showcause నోటీసులు జారీ చేసారని, సీనియర్ మోస్ట్ IAS అధికారిని, నిజాయితీ గల అధికారిని అయిన Dr. G. వాణి మోహన్, IAS గారిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రెటరీ గారిని ప్రభుత్వానికి సరెండర్ చేసారని దీన్నిబట్టి వారు అనగా రాష్ట్ర SEC గారు తీవ్రమైన నిర్ణయాలకు కూడా వెనుకాదండం లేదని..లక్షలాది మంది ఉద్యోగులo ప్రస్తుత కరోన వ్యాక్సిన్ తీసుకునే నైపద్యంలో ఎన్నికలు జరుపలేమన్నందుకు మమ్మలందరిని సస్పెండ్ చేస్తారా..చెంపేస్తారా..అని ప్రశ్నించారు.

◆ కాబట్టి గౌ౹౹ గవర్నర్ గారు వారికి రాజ్యాంగం ద్వారా కల్పించబడిన విచక్షణాధికారాలతో ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా నైపద్యంలో, ఉద్యోగులు తీవ్ర భయాందోళన నైపద్యంలో ప్రతి ఒక్క ఉద్యోగికి, ప్రతి ఒక్క ఓటరుకి వ్యాక్సిన్ ఇచ్చేంతవరకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిలుపుదల చేసే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని అదేశించవలసినదిగా గౌ౹౹ గవర్నర్ గారిని AP JAC అమరావతి పక్షాన కొరదమైనది.

◆ ఎంతో ఓపికతో విన్న గౌ౹౹ గవర్నర్ గారు మా ఉద్యోగుల బాధలు, ఇబ్బందుల పట్ల చాలా సానుకూలంగా స్పందించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 

◆ సానుకూలంగా స్పందించిన గౌరవ గవర్నర్ గారికి AP JAC అమరావతి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.

బొప్పరాజు  &  వై వి రావు.