ఈ రోజు అనగా 12.1.2021న
గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతులమీదుగా AP JAC అమరావతి 2021 కాలెండర్ ను తాడేపల్లి లోని వారి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరణ జరిగినది.
◆ ఈ సందర్భంగా బొప్పరాజు, వైవీ రావు లు గౌ౹౹ ముఖ్యమంత్రి గారిని 11 వ PRC ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఉద్యోగులు ఆందోళనలో చెందుతున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతీసుకొని PRC నివేదిక తెప్పించుకొని వెంటనే అమలుచేయాలని కోరినారు..
◆ అలాగే ఉద్యోగులకు అంతగా ఉపయోగకరంగా లేని EHS కార్డ్ ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగసంఘాలతో సమీక్ష జరపాలని బొప్పరాజు గారు కోరినారు. ప్రభుత్వం ఆమోదించిన మెడికల్ ప్రొసీజర్స్ అన్ని నెట్ వర్క్ హాస్పిటల్స్ నందు EHS పధకం క్రింద అమలు అయ్యేటట్లు చూడాలని మరీ ముఖ్యంగా " కరోనా బారిన పడిన ఉద్యోగస్తులు వారి కుటుంబసభ్యులకు కార్పొరేట్ హాస్పిటల్ నందు వైద్య సౌకర్యం అందించాలని, కరోనా కు బయట వైద్యం చేయించుకున్న వారికి రియంబర్స్ మెంట్ సౌకర్యం కలుగచేయాలని బొప్పరాజు గారు కోరినారు".
◆ అదేవిధంగా AP JAC అమరావతి అభ్యర్ధన మేరకు ఉద్యోగుల ప్రధానమైన సమస్యలు ఉదాహరణకు *1) టీచర్లతో సమానంగా మహిళా ఉద్యోగినులకు కూడా 5 రోజుల ప్రత్యేక సెలవులు 2) 45 సంవత్సరాలు దాటినా వితంతు/ diverse మహిళలకు కూడా ఫ్యామిలీ పెన్షన్ వర్తింప చేయుట 3) మహిళ ఉద్యోగినలకు ఇచ్చే180 రోజుల ప్రసూతి సెలవులను ప్రొబేషన్ డిక్లరేషన్ కు కలుపుట 4) హోంగార్డు లకు యూనిఫార్మేడ్ సర్వీస్ శాఖలలో క్లాస్-సి&డి ఉద్యోగాలలో కోటా ఇవ్వాలని 5) కాంట్రాక్టు ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 58 నుండి 60 సంవత్సరాల కు పెంచాలని 6) ఇంజినీరింగ్ శాఖలలో పనిచేసే techical ఆఫీసర్స్ కు gazetted హోదా కలిపించాలని 7) ఇంజినీరింగ్ శాఖలలో పనిచేసే వర్క్ ఛార్జిడ్ ఉద్యోగుల పేరును ఇంజినీరింగ్ సుబార్డినెట్* గా మార్చడం తదితర సమస్యలు గౌ౹౹ ముఖ్యమంత్రి గారి ఒప్పుకున్నటికి ఇంతవరకు ఆదేశాలు/ఉత్తర్వులు రాలేదని వారి దృష్టికి తీసుకుపోగా, వెంటనే స్పంచిన గౌ౹౹ముఖ్యమంత్రి గారు *ఈ రోజు సదరు సమస్యలపై AP JAC అమరావతి నాయకులతో చర్చించి సాధ్యమైనంత త్వరలో పరిష్కారించాలని వారి అదనపు కార్యదర్శి శ్రీ ధనుంజయ రెడ్డి గారిని ఆదేశించారు.*
◆ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన గౌ౹౹ముఖ్యమంత్రి గారికి AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు గారు, సెక్రటరీ జనరల్ వై వి రావు గారు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేశారు.
◆ AP JAC అమరావతి క్యాలెండర్ ఆవిష్కరణలో AP JAC అమరావతి సెక్రటరీ జనరల్ వై వి రావు గారు, కో ఛైర్మన్స్ జి వి నారాయణరెడ్డి గారు, ఐ. విజయకుమార్ గారు, జి. కేశవనాయుడు గారు, జనకుల శ్రీనివాసరావు గారు, కె సంగీతరావు గారు మరియు మహిళా విభాగం కార్యదర్శి శ్రీమతి మెహరాజ్ సుల్తానా గార్లు పాల్గొన్నారు...
బొప్పరాజు. వై వి రావు
ఛైర్మన్ సెక్రటరీ జనరల్

0 Comments
Thanks For Your Valuable Feed Back