పెన్షనర్లకు నిలిపివేసిన 50% జీతాలు 2 వాయిదాల్లో, పెన్షన్ ఒకే వాయిదాలో చెల్లింపుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు  హర్షం వ్యక్తం చేసిన..బొప్పరాజు
_______________________________________ 
గౌ11 ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గార్ని  AP JAC అమరావతి రాష్ట్ర ముఖ్యనాయకత్వం కలసినప్పుడు కోవిడ్-19 సందర్భంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని, పెండింగ్లో ఉన్న రెండు నెలల 50% వేతనాలు *మూడు విడతలుగా* చెల్లిస్తామని మాకు తెలియచేసినప్పటికీ, నేడు ప్రభుత్వం  *రెండు వాయిదాల్లోనే* ఉద్యోగులకు (2020 మార్చి / ఏప్రిల్ మాసాలలో నిలిపివేసిన జీతాలను)చెల్లింపులు చేయమని, అదేవిధంగా పెన్షనర్లకు మార్చిలో నిలిపివేసిన 50% పెన్షన్ *2 వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పి* *నేడు ఒక్క వాయిదా లోనే* చెల్లింపు చేయాలని నేడు ప్రభుత్వం *GO No.97* ను విడుదల చేయడం ద్వారా *చెప్పిన* *సమయానికంటే ఒక నెల ముందుగానే చెల్లింపులు చేస్తున్నందుకు*  చాలా సంతోషంగా ఉన్నదని AP JAC చైర్మన్ బొప్పరాజు మరియు సెక్రెటరీ జనరల్ YV రావులు హర్షం వ్యక్తం చేశారు.

★ ఈ సందర్భంగా బొప్పరాజు, వైవీ రావు గార్లు మాట్లాడుతూ ప్రత్యేకంగా రాబోవు   క్రిస్టమస్ మరియు సంక్రాంతి పండుగలు మా ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద పండుగలని ఈ చెల్లింపులు ద్వారా వారందరు వారి వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగలు చేసుకునే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా *గౌ11ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు* తెలిపారు. 

★ అదేవిధంగా మాకు ఎంతో సహకరించి ఫైనాన్స్ శాఖ అధికారులతో చర్చించి, ఈ చెల్లింపు ఉత్తర్వులు జారీకి కృషి చేసిన *శ్రీ సజ్జల రామ కృష్ణా రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు* తెలిపారు.

 
■ *పెన్షనర్లకు డి ఆర్ (కరువు ఉపశమనం) GO విడుదల* :
        
 అదేవిధంగా ఉద్యోగులకు రావలసిన 3 పెండింగ్ DA లు విడుదలకు ప్రభుత్వం ఒక షెడ్యూల్ ను గతలోనే విడుదల చేసినప్పటికీ, ఇంతవరకు పెన్షనర్లకు సంబందించిన పెండింగులో ఉన్న 3- DR కరువు భత్య ఉపశమనం GO షెడ్యూలు మంజూరు కానందున రాష్ట్రంలోని పెన్షనర్లు ఆందోళన చెందుతున్న తరుణంలో సదరు విషయాన్ని గౌ11ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గారు మరియు గౌ11 ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారి దృష్టికి AP JAC అమరావతి పక్షాన తీసుకుని వెళ్లగా వెంటనే కేబినెట్ ఆమోదం అనంతరం నేడు GO 98 ద్వారా ఉద్యోగుల మాదిరిగానే 2021 జనవరి నుండి 2022 జనవరి వరకు పెన్షనర్లకు DR షెడ్యూల్ తెలుపుతూ ఉత్తర్వులు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ గౌ11 ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

★ అదేవిధంగా మాకు ఎంతో సహకరించి ఫైనాన్స్ శాఖ అధికారులతో చర్చించి, ఈ చెల్లింపు ఉత్తర్వులు జారీకి కృషి చేసిన *శ్రీ సజ్జల రామ కృష్ణా రెడ్డి గారికి, గౌ11ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారికి* ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 *బొప్పరాజు & వైవీ రావు* .