నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాము...
జిల్లాల ఏర్పాటులో ఉద్యోగుల కేటాయింపు మరియు సదుపాయాల ఏర్పాట్లపై సమగ్ర ప్రణాళిక ప్రకటించాలి.... *బొప్పరాజు, వైవీ రావు*
***
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సత్వర సమస్యల పరిష్కారానికి కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని AP JAC అమరావతి గా స్వాగతిస్తున్నాము.
అదే సందర్భంగా జిల్లాల ఏర్పాటులో ఉద్యోగులకు అనేక ఇబ్బందులు సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఉద్యోగసంఘాలతో కూడా చర్చించి ఉద్యోగులకు ఉన్న సందేహాలు, అనుమానాలు, అవసరాలు నివృత్తి చేస్తే బాగుంటుందని బొప్పరాజు మరియు వైవీ రావులు తెలియచేశారు.
◆ జిల్లాల ఏర్పాటులో కేడర్ ను ఏ విధంగా విభజన చేస్తారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని వారికి ప్రభుత్వం భరోసా ఇవ్వవలసిన అవసరముందని బొప్పరాజు పేర్కొన్నారు.
◆ జిల్లాల ఏర్పాటులో లోకల్ /నాన్ లోకల్ ను ఎలా పరిగణిస్తారు. వారికి ఆప్షన్ ఫెసిలిటీ అవకాశం ఇవ్వాలని బొప్పరాజు కోరారు..
◆ జిల్లా కేంద్రంగా ఏర్పడే నూతనకార్యాలయాల ఏర్పాటు వాటికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవచేయటానికి దోహదపడుతుందని బొప్పరాజు పేర్కొన్నారు.
◆ నూతనంగా ఏర్పాటుచేసే జిల్లా కేంద్రాలలో పనిచేసే సిబ్బందికి రెసిడెన్షియల్ సౌకర్యం ఏర్పాటుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
◆ కొత్త జిల్లాల్లో కూడా ఇప్పటివరకు జిల్లాలలో కొనసాగుతున్న అన్నీ శాఖల శాఖాపరమైన జిల్లా, డివిజన్, మండల కార్యాలయాలు కొనసాగిస్తున్నారా లేదా...
◆ జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ లాంటి కార్యాలయాలలో అన్నీ సెక్షన్లు కొనసాగిస్తున్నారా లేదా లాంటి సందేహాలు.
ఇటువంటి అనేక సందేహాలు, అవసరాలు తదితర అంశాల పరిష్కారానికి మరియు ఉద్యోగులకు జిల్లాల ఏర్పాటు వలన కలిగే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించటానికి సంఘాలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయటం ద్వారా ఉద్యోగులలో వున్న అపోహలు తొలగించాలని *బొప్పరాజు మరియు వైవీ రావులు కోరారు* .

0 Comments
Thanks For Your Valuable Feed Back