*పత్రికా ప్రకటన*
గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘ రాష్ట్ర నాయకుడు తన స్వార్థం కోసం ఉద్యోగుల ప్రయోజనాలను, భవితవ్యాన్ని అప్పటి ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టి, పబ్బం గడుపుకుంటుంటే ఇది సహించలేని అనేక సంఘ నాయకులు APRSA రాష్ర్ట అధ్యక్షులు అయిన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారిని నాయకత్వ బాధ్యతలు తీసుకొని జేఏసీ ని నడప వలసిందిగా విపరీతమైన ఒత్తిడి తీసుకురావడంతో తప్పని పరిస్థితుల్లో ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా నాయకత్వ బాధ్యతను స్వీకరించిన విషయం అందరికి తెలిసిందే.
ఈ రోజుకు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాద్యాయ కార్మికుల మరియు పెన్షనర్ల యొక్క 96 సంఘాలతో ఐక్య కార్యాచరణ సమితి (APJAC అమరావతి) గా పనిచేస్తూ ఆయన నాయకత్వంలో ఉద్యోగుల ప్రయోజనార్థం 54 జీవోలను సాధించారు. ఇంకా సాదిస్తూనే ఉన్నారు.
ఈమధ్య ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సంఘం అని ఒకటి క్రొత్తగా స్థాపించారు మంచిదే. వారి నాయకత్వం మీద నమ్మకం ఉన్న ఉద్యోగులు ఆ సంఘంలో సభ్యులుగా చేరవచ్చు ఎవరికీ అభ్యంతరం కూడా లేదు. ప్రభుత్వంలో కొంతమంది దగ్గర ఉన్న పరపతితో 30 రోజుల్లో నే వారి సంఘానికి ప్రభుత్వగుర్తింపు తెచ్చుకున్నారు ఇంకా మంచిది. కానీ 30 సంవత్సరములు గా గుర్తింపు కొరకు దరఖాస్తు చేసుకొని పోరాటం చేస్తున్న అనేక సంఘాలకు ఎందుకు గుర్తింపు రాలేదనేదే మా ప్రశ్న. సంఘ నాయకుడు అంటే ప్రతి ఉద్యోగికి, ఉద్యోగ సంఘాలకు అండగా ఉండాలి వారికి సేవ చేయాలి. కానీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు సాటి ఉద్యోగులపై ,ఉద్యోగ సంఘాల పై నిరాదార ఫిర్యాదులు చేసుకుంటూ భలమైన సంఘాలను చీల్చడానికి ప్రయత్నం చేస్తూ, ఉద్యోగ సంఘాలను ప్రభుత్వ దృష్టిలో బలహీనపరిచి ఉద్యోగుల ప్రయోజనాలను నాశనం చేయాలని మాత్రమే ఎజెండాగా పని చేస్తున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబరుగా ఉన్న ప్రభుత్వ డ్రైవర్ల సంఘమును ముక్కలు చేయాలని చూశారు అది కుదరలేదు. ఇప్పుడు అతి బలీయమైన 50 సంవత్సరముల ఘన చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘాన్ని చీల్చడానికి చూస్తున్నారు. ఇక్కడ కూడా మీ ఆటలు సాగవు. ప్రతీ రెవిన్యూ ఉద్యోగి వారి విధినిర్వహణలో భాగంగా నాయకత్వ పటిమ తో ప్రజలకు మంచి పరిపాలన ఇస్తూ ఉంటారు. సంఘం ముక్కలుగా ఉంటే ఉద్యోగి ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయో ప్రతి రెవిన్యూ ఉద్యోగికి తెలుసు. అయినప్పటికీ సంఘంలో అసంతృప్తులు 1 లేదా 2 శాతం ఉండవచ్చు. ఏ సభ్యుడైనా సంఘ ఎన్నికలలో పోటీ చేయవచ్చు గెలిస్తే నాయకత్వం చేయవచ్చు. అంతేగాని ఆ 1 లేదా 2 శాతం ఉద్యోగులతో సంఘాన్ని చీల్చాలనుకోవడం సంఘ ద్రోహం అవుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులారా అప్రమత్తం కండి. సంఘం బలహీపడితే సామాన్య ఉద్యోగికి రక్షణ ఉండదు.
అతి తక్కువ మెంబర్లు గల AP ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నాయకులు భలంగా ఉన్న ఉద్యోగ సంఘాలను చీల్చాలనే ద్రుష్ట ప్రయత్నాలను, ప్రభుత్వ దృష్టిలో ఉద్యోగ సంఘాలను బలహీన పరచాలనే దురుద్దేశంతో ఉద్యోగుల పైన, ఉద్యోగ సంఘ నాయకుల పైన నిరాదార ఫిర్యాదులు చేసే నీచ సంస్కృతి ని ఏపీ జేఏసీ అమరావతి తీవ్రంగా ఖండిస్తోంది.
ఉద్యోగుల ప్రయోజనాల కొరకు APJAC అమరావతి చైర్మన్ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలోనే 96 సంఘాలు పనిచేస్తున్నాయి.
మన ఉద్యోగుల్లో కొంతమందికి న్యాయంగా చట్టపరంగా రావలసిన పదోన్నతులు రావడం లేదంటున్నారు అన్ని సంఘాలు కలిసికట్టుగా వారి కోసం పని చేద్దాం.
EHS కొరకు ప్రతి ఉద్యోగి ప్రతి నెల తన జీతం నుండి చందా కడుతుంటే కొన్ని ఆసుపత్రులు EHS కార్డులను అనుమతించడం లేదు వారికోసం పోరాడుదాం ప్రభుత్వం దృష్టికి ఐక్యత గా తీసుకొని వెళ్దాం
DA లు PRC లు తొందరగా వచ్చేటట్లు సంఘాలకు ఉన్న పరపతితో ఐక్యంగా కలిసి ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి సాదిద్దాం.
సి పి ఎస్ రద్దు కు ఐక్యంగా పోరాటం చేద్దాం
ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలను ఐక్యతతో సాధిద్దాం
ఉద్యోగులకు అన్ని ప్రయోజనాలను సాధించుట కొరకు సంఘాలన్నీ ఐక్యతతో ఉందాం రండి
సత్తి నాగేశ్వర రెడ్డి,
చైర్మన్, APJAC అమరావతి, విశాఖపట్నం జిల్లా.
ఎ.శ్రీనివాసరావు,

0 Comments
Thanks For Your Valuable Feed Back