అఖిల భారత ట్రేడ్ యూనియన్లు ఈ నెల 26 న జరుప తలపెట్టిన సమ్మెకు AP JAC అమరావతి లోని ఉద్యోగ సంఘాలలోని ఉద్యోగులందరూ దూరం ... స్పష్టతనిచ్చిన ఎపి జెఎసి అమరావతి.
ఉద్యోగులు ఎవరూ పాల్గొనడం లేదని పత్రికముఖంగా స్పష్టతనిచ్చిన బొప్పరాజు, వైవి రావులు...
***
ఈ నెల 26 వ తేదీన అఖిల భారత స్థాయిలో ట్రేడ్ యూనియన్ లు సార్వత్రిక సమ్మె చేస్తున్నట్లు పత్రికలలో వచ్చిన వార్తలతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల సమ్మెలో పాల్గొనడం గురించి మమ్మల్ని సంప్రదిస్తున్నందున ఈ సమ్మెలో ఎపి జెఎసి అమరావతిలోని 94 సభ్యసంఘాలు మరియు ఆయా శాఖాపరమైన శాఖల ఉద్యోగుల కార్మికుల సమస్యలపట్ల మాకు అత్యంత సానుభూతి ఉన్నదని, వాటి పరిష్కారానికి APJAC అమరావతి ప్రణాలికా బద్దంగాపనిచేస్తుందని, గతములో వచ్చిన వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు అందుకు నిదర్శనం అని, కానీ జాతీయ స్థాయిలో చేపట్టేకార్యక్రమాలను ముందుగా రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ సంఘాలతో సంప్రదించకుండా వారు సమ్మె చేయడానికి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
◆ మన రాష్ట్రం లో అనేక నిరశన కార్యక్రమాల తర్వాతఉద్యోగులకు అత్యంత అవశ్యకమైన హక్కుల సాధన మరియు అత్యవసరమైన సమస్యల పరిష్కారానికి ఆఖరి అస్త్రం గా మాత్రమే సమ్మె చేసే విధానం ఇక్కడ కొనసాగుతున్నదని తెలిపారు.
◆ AP JAC అమరావతి లోని అన్నీ సభ్య సంఘాలతోచర్చించి నిర్ణయించిన ప్రకారము, " కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలకు ఏర్పడిన సమస్యలను మరియు Epidemic deseases act1897 act ప్రకారము ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన అనేక ఉత్తర్వులు అమలులో ఉన్నందున APJAC అమరావతిలోని 94 సభ్య సంఘాలు మరియు ఆయా శాఖాపరమైన శాఖల ఉద్యోగులు ఈ సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు" తెలియచేస్తున్నాము.
బొప్పరాజు, వైవి రావు,vvమురళి కృష్ణ నాయుడు .

0 Comments
Thanks For Your Valuable Feed Back