★ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెల జీతంతోపాటు ఏప్రిల్/మే నెలల్లో నిలిపివేసిన 50% జీతం మొదటివిడత చెల్లింపు..బొప్పరాజు
★ ముఖ్యమంత్రి గారి ఆమోదం పొందగానే, పెన్షనర్ల DA GO విడుదల...బొప్పరాజు
***
గౌ౹౹ ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గార్ని ఈ రోజున AP JAC అమరావతి రాష్ట్ర ముఖ్యనాయకత్వం కలసిన సందర్భంగా ఛైర్మన్ బొప్పరాజు గారు ఉద్యోగుల సమస్యలతో పాటు ప్రస్తుతం ఉద్యోగ సంఘాలలో నెలకొన్న పరిస్థితులు గురించి గౌ౹౹ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గార్కి తెలియచేస్తూ మా సంఘాలకు మీరు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు(3) పెండింగ్ DA చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్ ఇస్తూ GO ను విడుదల చేసినారు. కాని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇంతవరకు పెండింగ్ 3 DA లకు సంబంధించి GO ఇవ్వక పోవటంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలియచేయటం జరిగింది.
అలాగే ఏప్రిల్, మే నెలలో ఆపిన 50%శాతం జీతాల చెల్లింపు విషయంపై కూడ మాట్లాడుతూ గతంలో మీరు సూచించిన ప్రకారం నవంబరు మాసం జీతం మాసంతో చెల్లింపులు చేయలేదని వారి దృష్టికి తీసుకుపోగా, ఇచ్చిన మాట గౌ౹౹ ముఖ్యమంత్రి గారు తప్పే ప్రసక్తే లేదని, వెంటనే శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫైనాన్స్ కార్యదర్శి గారితో మాట్లాడి ఈ నెల జీతం నుండే మొదటి విడత చెల్లింపు చేయాలని తెలియచేశారు.
వెంటనే తదుపరి సచివాలయంలోని ఆర్ధికశాఖ కార్యదర్శి శ్రీ కె వి వి సత్యనారాయణ IRAS గార్ని కలసి మాట్లాడగా పెన్షనర్లకు సంబంధించిన మూడు పెండింగు DA ల చెల్లింపు షెడ్యూల్ ఉత్తర్వులు రెండు, మూడు రోజులలో గౌ౹౹ ముఖ్యమంత్రి గారి ఆమోదం పొందగానే ఇస్తామని తెలిపారు.
అలాగే గౌరవ ముఖ్యమంత్రిగారు ఇచ్చిన హామిమేరకు ఏప్రిల్, మే మాసాల పెండింగ్ వున్న 50శాతం జీతాలు నవంబర్ నెల జీతంతో పాటు మొదటి విడత బకాయిలు చెల్లింపు చేస్తామని తెలియచేశారు.
ఈ సందర్భంగా వారితో AP JAC అమరావతి నాయకత్వం మాట్లాడుతూ మిగిలిన 50% జీతం డిసెంబర్ జీతంతో మొత్తం ఒకేసారి చెల్లించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.
◆ ఇంత గందరగోలమైన పరిస్థితుల్లో కూడా ఉద్యోగుల చిరకాల వాంఛ అయిన CPS రద్దు, అదేవిధంగా మరో ప్రధాన సమస్య రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల క్రమబద్ధీకరణ రెండు ప్రధాన సమస్యలపై నిన్న ఉన్నతాధికారులుతో గౌ11ముఖ్యమంత్రి గారు సమావేశమై వాటి పరిష్కారానికి ఇచ్చిన మాట తప్పకుండా చిత్తశుద్ధితో కృషి చేస్తున్న గౌ1ముఖ్యమంత్రి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము.
◆ ఇంతపెద్ద ప్రమాదకర కోవిడ్ పాండమిక్ లో మరియు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల, కార్మికుల సమస్యలను ఏకకాలంలో పరిష్కరిస్తున్న గౌ 11 ముఖ్యమంత్రిగారికి AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు గారు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేశారు.
కొంతమంది మనమిత్రులు అడిగిన దాని ప్రకారం ఈ క్రింది వివరణ ఇస్తున్నాము.
" ఫైనాన్స్ సెక్రెటరీ గారు చెప్పిన ప్రకారం ఎప్రిల్ మరియు మే నెలలో నిలిపివేసిన 50% deferred amount ను వీలైతే ఈ నెలలో లేదంటే తప్పకుండా ఈ నెల జీతం అనగా డిసెంబర్ 1వ తారీకు తీసుకునే జీతంతో పాటుగా తప్పకుండా మొదటి విడత (నగదు చెల్లించేది మొత్తం 3 విడతలు) ఇస్తామని చెప్పడమైనది. కొన్ని సాంకేతిక కారణాల చేత, దీనికి ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వరు."
*బొప్పరాజు & వైవీ రావు* .

0 Comments
Thanks For Your Valuable Feed Back