DA విడుదల చేసినందుకు కృతఙ్ఞతలు.....
సజ్జల గారిని కలసిన బొప్పరాజు...
గౌ||. ముఖ్యమంత్రి గారికి AP JAC అమరావతి పక్షాన కృతజ్ఞతలు.....
రాష్ట్రంలో ఒకవైపు అతిప్రమాధకారమైన కరోనను ఎదుర్కొంటూ, ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికి,
ఉద్యోగ సంఘాలతో సమగ్రంగా చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు గత ప్రభుత్వ హయాంలో బకాయిపడ్డ మొదటివిడత DA (కరువు భత్యం)ను GO 94 ద్వారా నేడు విడుదల చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గౌ11ముఖ్యమంత్రి గారికి AP JAC అమరావతి పక్షాన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము.
● DA బకాయిలు, ఏప్రియల్, మే నెలలో ఆపిన 50 శాతం జీతాల చెల్లింపు తదితర అంశాలపై ఉద్యోగులలో వున్న అనుమానాలు, ఆందోళన నేపథ్యంలో AP JAC అమరావతి నాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు అధికారుల దృష్టికి తీసుకొనివెళ్ళగా వెంటనే స్పందించి ఉద్యోగ సంఘాల ను పిలిపించి చర్చించి చెల్లింపులకు సంభందించి తక్షణమే నిర్ణయం తీసుకోవడం ద్వారా గౌ11ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు, పెన్షనర్లు పక్షపాతి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని AP JAC అమరావతి చైర్మన్ బొప్పరాజు, సెక్రెటరీ జనరల్ వైవీ రావులు పేర్కొన్నారు.
● గత ప్రభుత్వం హాయంనుండి పెండింగులో ఉన్న DA లు నేటి ప్రభుత్వం మంజూరు చేస్తారో లేదో అని ఉద్యోగులు అనేక అనుమానాలుతో తీవ్ర ఆందోళనలో ఇప్పటివరకు ఉన్నారు.
● రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రమాదకరమైన కరోనను విజయవంతంగా ఎదుర్కొంటూ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, నేడు మొదటివిడత DA మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపట్ల ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
◆ మిగిలిన 2, 3 DA లును కూడా ముందుగానే ఎప్పటినుండి డబ్బులు చెల్లించేది, బకాయిలను ఎన్ని విడతలలో వారి వారి GPF/ZPF ఖాతాలలో జమ చేసేది తేదీలతో సహా సమగ్రంగా షెడ్యూల్ విడుదల చేసి ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక స్పష్టమైన నమ్మకం, భరోసా కలుగచేయడం ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సాహసోపేతమైన నిర్ణయం అని తెలిపారు.
*ఈ సందర్భంగా మా అందరూ ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘంగా చర్చించి, గౌ11ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 3 విడతల DA ల విడుదలకు కృషిచేసిన గౌ11ముఖ్యమంత్రి గారి రాజకీయ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గారిని కలిసి AP JAC అమరావతి పక్షాన కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.*
*బొప్పరాజు, వైవీ రావు, VV మురళీ కృష్ణ నాయుడు.*

0 Comments
Thanks For Your Valuable Feed Back