పత్రికా ప్రకటన
*AP JAC అమరావతి*
తేదీ 17/11/2020.
***
*పెన్షనర్లకు ఈ నెల పెన్షన్ తో పాటు ఏప్రిల్ నెలలో నిలిపివేసిన 50% పెన్షన్ రెండు విడతల్లో చెల్లింపు.....బొప్పరాజు*, *ఆల్ఫ్రెడ్*
**
కోవిడ్-19 తీవ్ర రూపం దాల్చిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు 2020 ఏప్రిల్ నెలలో ఆపిన 50%శాతం పెన్షన్ చెల్లింపు విషయంపై సచివాలయంలోని ఆర్ధికశాఖ కార్యదర్శి శ్రీ కె వి వి సత్యనారాయణ IRAS గార్ని ఈ రోజు కలసి మాట్లాడగా పెన్షనర్లకు
సంబంధించి ఏప్రిల్ నెలకు పెండింగ్ వున్న 50శాతం పెన్షన్ ను రెండు విడతలుగా చెల్లించేందుకు ఆర్ధికశాఖఅదనపు కార్యదర్శి శ్రీ కె వి వి సత్యనారాయణ IRAS గారు అంగీకరించారు.
◆ ఈ నెల అనగా నవంబర్ నెల జీతంతో పాటు అనగా డిసెంబర్ 1 వ తారీకున తీసుకునే పెన్షన్ తో పాటుగా మొదటి విడత బకాయిలు చెల్లింపు చేస్తామని తెలియచేశారు. అలాగే రెండవ విడత బకాయిలు డిసెంబర్ నెల జీతంతో అనగా2021 జనవరి1వ తారీకున తీసుకునే పెన్షన్ తో చెల్లించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.
◆ ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి విషమంగా వున్నప్పటికీ ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న గౌ 11 ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జనరల్ వైవీ రావు మరియు *AP రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత (AP State Govt Rtd Emp.Assn.) ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు కె. ఆల్ఫ్రెడ్ గారు* ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేశారు.
*బొప్పరాజు, వైవీ రావు* *& కె.ఆల్ఫ్రెడ్*

0 Comments
Thanks For Your Valuable Feed Back