ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్లకు సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా జి.శ్రీరాములు ఎన్నిక.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్లకు సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ది.06.09.2020 తారీకున  సంఘ నియమావళిని అనుసరించి 09.09.2020 తో ముగియనున్న రాష్ట్ర అధ్యక్ష పదవికి అక్టోబర్ నెలలో జరపాలని చేసిన తీర్మానం మేరకు ది. 01.10.2020న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఎన్నికల అధికారిగా APRSA జెనెరల్ సెక్రెటరీ చేబ్రోలు కృష్ణమూర్తి గారు మరియు పరిశీలకునిగా ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ సంఘం అధ్యక్షులు T. V. ఫణి పెర్రాజు గారు వ్యవహరించారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సెంట్రల్ అసోసియేషన్ కు సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఈ రోజు ది. 10.10.2020 తారీఖున నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. నామినేషన్ కార్యక్రమానికి ఇద్దరు సభ్యులు పోటీపడగా తదుపరి D. S. కొండయ్య గారు (ప్రస్తుత అధ్యక్షులు) నామినేషన్ ను ఉపసంహరణ చేయగా రెండవ నామినేషన్ దారుడు శ్రీ. G. శ్రీరాములు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 

ఈ కార్యక్రమానికి డ్రైవర్ల సంఘం అన్ని జిల్లాల కార్యవర్గం మరియు రాష్ట్ర కార్యవర్గం హాజరై ఎన్నికల ప్రక్రియను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసి అమరావతి చైర్మన్ బొప్పారాజు వెంకటేశ్వర్లు, కో-చైర్మన్ కేశవనాయుడు గారు, కిశోర్ గారు, కృష్ణాజిల్లా చైర్మన్ D. ఈశ్వర్ గారు. APRSA ట్రెజరర్ గిరికుమార్ గారు హాజరైనారు.