పత్రికా ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, అమరావతి
తేదీ. 26.10.2020
         ***
అయ్యన్నపాత్రుడు తన వ్యాఖ్యలు తక్షణమే ఉపసంహరించుకోవాలి....

ఉద్యోగులు బాధ్యతతో పనులు చేస్తారు...... 

బేషరతుగా రెవెన్యూ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలి..బొప్పరాజు
         ....
 తేదీ 24.10.2020న శనివారం నాడు వైజాగ్ గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో అక్రమ నిర్మాణాలను తొలగించిన రెవెన్యూ అధికారులు, ఉద్యోగులను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు దుర్భాశలాడిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రెవెన్యూ అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆంద్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ, చట్టానికి లోబడి  విధినిర్వహణలో ఉన్న రెవెన్యూ అధికారులను, ఉద్యోగులను దుర్భాశలాడి, ప్రజలలో అధికారులు, ఉద్యోగులపట్ల చులకన భావం కలిగించేలా ప్రవర్తించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వెంటనే తన మాటలను వెనక్కి (ఉపసంహరించుకోవాలని) తీసుకొని తక్షణమే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులకు బే  షరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. 

● “ దురాక్రమణకు గురియైన భూములను పరిరక్షించడము నేరము....దురాక్రమణలు చేసి నిర్మించిన కట్టడాలను కూల్చడము అన్యాయము” అందుకని రెవెన్యూ అధికారులను తీవ్రమైన, రాయలేని పదజాలంతో దుర్భాశలాడటము.... ఇదీ నాటి రాష్ట్ర మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడైన శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు అనుసరిస్తున్న మరియు అవలంబిస్తున్న విధానము. 

● మాజీ రాష్ట్ర మంత్రి అయి ఉండి కూడా కనీసము సంస్కారము, విచక్షణారహితముగా   సంబోదించడానికి కూడా వీలు లేని భాషలో  రెవిన్యూ అధికారులను  ధూషించడము ఈనాడు రాష్ట్రంలోని ప్రతి రెవిన్యూ ఉద్యోగికి చాలా బాధకలిగించింది. 

● దురాక్రమణదారులకు వంత పాడడమే ఒక సిగ్గుమాలిన చర్య మరియు నేరము. దానికి తోడు దురాక్రమణలను తెలుసుకొని ప్రభుత్వ భూములను కాపాడిన రెవిన్యూ ఉద్యోగులను పరుష పదజాలముతో ధూషించడము ఇంకా దారుణము. దీన్నీ బట్టే తెలుస్తుంది అయ్యన్న పాత్రుడి గారి సంస్కృతి, అతని అనాగరికత. గతం లో కూడా ఈయన గారు నర్సీపట్నం మునిసిపల్ కమీషనర్ గారిని దుర్బాష లాడితే ఆమె కేసు కూడా పెట్టింది అలాగే పోలీసులను కూడా తిట్టిన చరిత్ర గతంలో ఉంది.ఇతడీకి విధినిర్వహనలోనున్న ఉద్యోగులను తిట్టే సంస్కృతి అలవాటుగా మారింది

● ఏది ఏమైన మీరు ఇలా ప్రజా స్వామ్య వ్యవస్థను, ఈ వ్యవస్థ లో భాగమైన వివిధ శాఖలలోని అధికారులను, ఉద్యోగులను దూషించడం, బెదిరించడం మీరు ఆనవాయితీగా, అలవాటుగా మార్చుకుంటున్నందున, శనివారం గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు, ఉద్యోగులను అపహాస్యం చేస్తూ మాట్లాడిన మాటలను తక్షణమే ఉపసంహరించుకొని, క్షమాపణలు చెప్పాలని, అలా చెప్పని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తామని ఆందోళన మీ ఇంటి వద్దనుండే మొదలవుతుందని తెలియచేస్తున్నాము. 

 బొప్పరాజు & చేబ్రోలు కృష్ణమూర్తి