పత్రికా ప్రకటన
AP JAC అమరావతి
తేదీ:24.10.2020
👉ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపికబురు అందించిన గౌ|| ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు..బొప్పరాజు
👉గౌ: ముఖ్యమంత్రి గారి కార్యాలయం నందు ది 22/10/2౦ న గౌ|| ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడిన సందర్భంలో AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు గారు మరియు ఇతర సంఘాల నాయకులు ఇచ్చిన సూచన మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ రోజు అధికారకంగా నిర్ణయం తీసుకోవటం ఉద్యోగులకు, పెన్షనర్లకు చాలా ఆనందాన్ని, సంతోషన్ని కలిగించింది.
👌మార్చి మరియు ఏప్రిల్ నెలలలో ఆపిన 50శాతం (రెండు నెలల) వేతనం :
1) కోవిడ్19 నేపధ్యంలో 2020 మార్చి మరియు ఏప్రిల్ నెలలలో ఆపిన 50శాతం (రెండు నెలల) వేతనాన్ని మూడు విడతలుగా ఉద్యోగులు, పెన్షనర్ల చేతికి ఈ క్రింద తెలిపిన విధంగా మూడు వాయిదాల్లో డబ్బులు (మొత్తం 5 వాయిదాలు గాను రెండు వాయిదాలు govt recoveries కింద మినహాయిస్తారు) చెల్లిస్తారు.
★ నవంబర్ నెల జీతంలో ....1/3
★ డిసెంబర్ నెల జీతంలో....2/3
★ జనవరి నెల జీతంలో...3/3 ఇస్తున్నట్లు తెలియచేశారు.
2) 2018 జులై నుండి పెండింగులో ఉన్న 3 DA లు: పెండింగ్ ఉన్న మూడు డి. ఎ. లు కూడా ఈ క్రింద తెలిపిన విధంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు.
★ 1st DA ఫిబ్రవరి 2021 వేతనంతో లో ఇస్తారు.
★ 2 వ" DA " జులై, 2021 నెల వేతనంలో ఇస్తారు.
★ 3 వ DA ఫిబ్రవరి 2022 నెల వేతనంతో ఇస్తారు.
◆ కరోనా లాంటి విపత్కర ఆర్ధిక పరిస్థితులలో కూడా అనేక ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎంతో ధైర్యంగా ముందుగానే ఒక షెడ్యూలు ప్రకారం విడుదల చేయుటకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలు మొత్తం చెల్లింపుకు నిర్ణయం తీసుకున్నందుకు AP JAC అమరావతి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు బొప్పరాజు గారు తెలియచేశారు.
◆ ప్రతి అంశాన్ని ఉద్యోగులతో చర్చించి ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ, వారి అభిప్రాయం ప్రకారం నిర్ణయాలు తీసుకోవడంలాంటి మంచి సంప్రదాయం దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి సంప్రదాయం కొనసాగిస్తున్నందుకు గౌ11ముఖ్యమంత్రి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము.
◆ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు Apsrtc లాంటి అతి పెద్ద సంస్థలో పనిచేస్తున్న షుమారు 70,000 అందని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయటం లాంటి చరిత్ర సృష్టించి.. నేడు కోవిడ్ లాంటి ఇబ్బందులలో కూడా rtc కార్మికులకు ప్రతినెల జీతాలు అందుతున్నాయంటే వారు తీసుకున్న నిర్ణయం చలువ వలనే. అందుకే APSRTC ఉద్యోగులు గౌరవ ముఖ్యమంత్రిగారికి జీవితకాలం ఋణపడి ఉంటారని Ap Jac అమరావతి సెక్రటరీ జనరల్ మరియు AP PTD (APSRTC) ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు శ్రీ వై వి రావు గారు పేర్కొన్నారు.
◆ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల, కార్మికుల సమస్యలను ఏకకాలంలో పరిష్కరిస్తున్న గౌ|| ముఖ్యమంత్రిగారికి AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు గారు కృతజ్ఞతలు తెలియచేశారు. ఇవ్వబోయే PRC కూడా ఇదేవిధంగా ఉద్యోగులు అందరూ మెచ్చేవిధంగా గౌ|| ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించాలని అందుకు AP JAC అమరావతి కృషి నిరంతరాయంగా వుంటుంది అని తెలియచేసారు.
బొప్పరాజు & వైవీ రావు.
0 Comments
Thanks For Your Valuable Feed Back