ముఖ్యమంత్రి వర్యులు మరియు రెవెన్యూ శాఖామాత్యులు శ్రీ ధర్మాన కృష్ణ దాస్ గారిని విజయవాడలో ని వారి క్యాంపు కార్యాలయంలో కలిసిన బొప్పరాజు.. మరియు రెవిన్యూ సంఘం.
 
నూతనంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గాన్ని వారికి పరిచయం చేసారు.

ఈ సందర్భంగా బొప్పరాజు గారు గౌ||. ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువచ్చారు ప్రధానంగా;

● ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన భూ రికార్డుల స్వచీకరణ మరియు భూముల రీ సర్వే కార్యక్రమములు ముగిసేవరకు అలాగే సదరు కార్యక్రమాలు పగడ్బందీగా చేపట్టుటకు పూర్తి స్థాయిలో రెవిన్యూ యంత్రాంగము శ్రద్ధ పెట్టవలసి ఉన్నందున ఇతర శాఖల విధులు రెవిన్యూ శాఖకు అప్పగించవద్దని...ఆవసరమైతే  గ్రామ సచివాలయంలోని ఇతర ఉద్యోగుల సేవలు కూడా వినియోగించుకొని గౌ11ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల స్వచీకరణ మరియు భూముల రీ సర్వే కార్యక్రమములు విజయవంతం చేయించాలని కోరాము.

● మరీ ముఖ్యముగా రెవిన్యూ శాఖలో క్రమశిక్షణా చర్యలకు గురైన రెవిన్యూ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణముగా తయారయ్యిందని క్రమశిక్షణ చర్యలకు గురైన ఉద్యోగులకు సకాలములో శాఖాపరమైన విచారణలు జరపకుండా, దానిపై సకాలంలో సమీక్షలు నిర్వహించకుండా అలాగే విచారణాధికారులు కాలయాపన చేస్తూ నిర్ణీత గడువులోగా విచారణ నివేదికలు సమర్పించకపోవడము వలన ఉద్యోగులు సర్వీసులో ఉన్నంతవరకు విచారణలు పూర్తికానందున, పదవీ విరమణ పొంది కనీసము పెన్షన్ అందక రోడ్డున పడే పరిస్థితులు నెలకొని ఉన్నాయని అలాగే సస్పెన్షన్లపై సమీక్షలు సకాలములో జరుపకపోవడము వలన సంవత్సరాలపాటు ఉద్యోగులు సస్పెన్షన్లలో కొనసాగుతూ వుండడము వలన అభద్రతా భావానికి లోను కావడమే కాకుండా కుటుంబాలను నెట్టుకురాలేక తీవ్ర మానసిక క్షోభకు గురి అవుతున్నారు కావున వెంటనే ఈ క్రమశిక్షణ చర్యలపై వెంటనే సమీక్షలు జరపడముతో పాటు నిర్ణీత గడువులోగానే విచారణను ముగించి ఉద్యోగులను కాపాడవలెనని ప్రత్యేకముగా విజ్ఞప్తి చేయగా అందుకు మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి వెంటనే అందరు జిల్లా కలెక్టర్లతో పాటు క్రమశిక్షణ చర్యల పై వెంటనే CCLA & Spl CS గారు సమీక్షలు జరిపేలా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వడము జరిగినది. 

అలాగే రాష్ట్రములో తహసీల్దార్లు సరిపడా అద్దేవాహనాల నిధులు అందక అనగా జి.ఓ ప్రకారము ముప్పై ఐదు వేల రూపాయలు రావలసి ఉండగా కేవలము కొన్నిచోట్ల ఇరవై వేల, మరికొన్నిచోట్ల ఇరవై ఐదు వేల రూపాయలు మంజూరు అవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో ఇన్సిడెంట్ కమాండర్లుగా పనిచేస్తున్న తహసీల్దార్లు ఈ అరకొర బడ్జెట్లతో తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు గురిఅవుతున్నారని, అలాగే మీసేవ నిధులలో తహశీల్దార్ వాటా పూర్తిగా అందక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున వెంటనే సరిపడా నిధులు విడుదల చేయవలెనని కోరగా నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
 *బొప్పరాజు, చేబ్రోలు కృష్ణ మూర్తి, V. గిరి కుమార్ రెడ్డి తదితరులు..