పత్రిక ప్రకటన.

ఏ.పీ.రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్, అమరావతి 

తేదీ 14.10.2020 

*******

 *కొత్త జిల్లాలతో పాటుగా జనాభా మరియు పని భారం ఆధారంగా కొత్తగా మండలాలు, అదనపు సిబ్బందిని మంజూరు చేయాలి* ...... *బొప్పరాజు* 

           ...

ఈరోజు అనగా తేదీ.  14.10.2020 న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై యస్.జగన్మోహన్ రెడ్డి గారిని వారి క్యాంపు కార్యాలయంలో, ఇటీవల నూతనంగా ఎన్నిక కాబడిన AP RSA రాష్ట్ర కార్యవర్గం బొప్పరాజు గారి ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛంతోపాటు చిరు సత్కారం చేసి మెమోంటోను అందజేయడం జరిగినది. 


ఈ సందర్భంగా AP RSA రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చేబ్రోలు కృష్ణమూర్తి గార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికీ నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులను పరిచయం చేసి, తదనంతరం రాష్ట్రంలో ....


★ *రెవెన్యూ శాఖ బలోపేతం కోసం చేపట్ట వలసిన సంస్కరణల గురించి* 

★ *రెవెన్యూశాఖ ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి* , మరియు

★ *రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమము కొరకు అవలంబించ వలసిన విధి విధానముల గురించి* గౌ11ముఖ్యమంత్రి గారికి విడివిడిగా  మెమోరాండంలను సమర్పించడం జరిగింది.


● రెవెన్యూ శాఖ యొక్క *బలోపేతం కొరకు* మెమోరాండం సమర్పిస్తూ,  ఇటీవల ప్రారంభించబడి అత్యంత విజయ వంతంగా ముందుకు వెళ్తున్న  *"గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ'* (2000 మంది జనాభాకు ఒక సచివాలయం) తరహాలోనే... పెరుగుతున్న జనాభా/పని భారం ను బట్టి *మండల* , *డివిజన్* , *జిల్లా* మరియు *రాష్ట్ర స్థాయిల* కార్యాలయాలలో అవసరమైనచోట కార్యాలయాలు పెంచటం మరియు సరిపడా సిబ్బందిని పెంచాలని, ఈ కార్యక్రమాన్ని కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటుగా అవసరమైతే రాష్ట్ర స్థాయి కమిటీని నియమించి తద్వారా మండల జనాభా మరియు పని భారం ఆధారంగా కొత్తగా మండలాలు, అదనపు సిబ్బందిని మంజూరు చేయాలని కోరాము. 


అదేవిధంగా కార్యాలయాలలో అన్ని రకాల మౌలీక వసతులను కల్పించ వలెనని, శిథిలావస్థకు చేరుకున్న పాత మండల/డివిజన్ రెవెన్యూ కార్యాలయాల స్థానంలో కొత్త కార్యాలయాల నిర్మాణమునకు ఆదేశాలు ఇవ్వవలసినదిగా కొరడమైనది.                


● ప్రస్తుతం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల స్వచ్చీకరణ కార్యక్రమం జరుగుతున్నందున మరియు అతి త్వరలో ప్రభుత్వం భూముల రీ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, ఇతర శాఖల పనులు రెవెన్యూ శాఖకు అప్పగిించకుండా వెంటనే తగిన ఆదేశాలు గౌ11ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి జారీచేయలని కోరడమైనది. 

   

● రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ కార్యాలయాల పై ACB దాడులు సరిఅయిన, సహేతుకమైన కారణాలతో జరగడం లేదని, దాడులలో ACB వారు "జనరల్ ఆఫీసు ప్రొసీజర్" పై అనుసరిస్తున్న విధానాలు వారి పరిదిలోనివి కానందున, నిజాయితీ పరులైన ఉద్యోగులను కూడా ఇటువంటి దాడులు భయబ్రాంతులకు గురిచేసే విధంగా ఉన్నాయని, కావున ఏమైనా జనరల్ ఆఫీసు ప్రొసీజర్లపై ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, అలాగే దాడులలో ఉద్యోగి దగ్గర ఉండవలసిన కనీస నగదు రూ 500/- ల మించి నగదు ఉండకూడదు అన్న నిబంధన కొన్ని సంవత్సరాల (20 years back) క్రితం ఇచ్చిన ఉత్తర్వులు అని,  ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల కనుగుణంగా వాహనాలకు పెట్రోలు, వాహనం రిపేరు ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు, ప్రోటోకాల్ తదితర ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా తహశీల్దార్ కార్యాలయంలో ఎలాంటి డబ్బుల లావాదేవీలు ఉండవు కనుక, ఉద్యోగి దగ్గర ఉండవలసిన కనీస నగదు నిబంధన రూ..500/- ల నుండి రూ 5000/- లకు పెంచవలెనని కొరడమైనది.

        

● ఉద్యోగులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు రహిత ఆరోగ్య కార్డు (EHS) ఫలాలు సరిగా అందడం లేదని...నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం పూర్తి స్థాయిలో నగదు రహిత ఆరోగ్య కార్డులను పరిగణనలోకి తీసుకునే విధంగా తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో ఇటు ఉద్యోగ సంఘ నాయకులతో మరియు కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్య సంఘాలతో కలిపి "EHS స్టీరింగ్ కమిటీ" సమావేశం వెంటనే నిర్వహించాలని తద్వారా నెట్వర్క్ హాస్పిటల్స్ వారు ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎలాంటి సాకులు, ఇబ్బందులు పెట్టకుండా నగదు రహిత వైద్యం తక్షణమే అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని, అప్పటివరకు మరొక సంవత్సరం అనగా 1.8.2020 నుండి 31.8.2021 వరకు "మెడికల్ రీయింబర్స్మెంట్ పధకం"  కొనసాగింపు ఉత్తర్వులను వెంటనే ఇవ్వవలెనని, అలాగే ప్రతి ఉద్యోగి మరియు వారి కుటుంబ భాగస్వామికి ప్రతి సంవత్సరమునకు ఒకసారి "ఆన్యువల్ హెల్త్ చెకప్'  కొరకు తక్షణమే ఉత్తర్వులు ఇవ్వవలసిన దిగా కోరుతూ మెమోరాండం సమర్పించడమైనది. 


● ఎడతెరిపి లేని టేలీకాన్ఫ రెన్సు, వీడియో కాన్ఫరెన్స్ లతో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఇబ్బందులకు గురై తీవ్రమైన జబ్బులబారిన పడుతున్నారని, మరీ ముఖ్యంగా ప్రభుత్వ సెలవు దినాలలో, వేళ కాని వేళల్లో నిర్వహిస్తున్న ఈ టెలీ / వీడియో కాన్ఫెరెన్సులు /సమావేశాలు ల వల్ల మహిళా ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నందున వాటిని కేవలం కార్యాలయ పనివేళలు అయిన ఉదయం10.30 గం,, నుండి సాయంత్రం 5.00 గం,, లోపే నిర్వహించే విధంగా గౌ11 ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుండి వెంటనే రెవెన్యూ శాఖాధిపతి అయిన CCLA గారికి, అన్నీ జిల్లా కలెక్టర్లు కు, అందరూ సంయుక్త కలెక్టర్లకు, ఇతరా అధికారులకు

ఆదేశాలు ఇవ్వవలసినదిగా కోరడమైనది.


●  ఇటీవల విధినిర్వహణలో  ఉండి (ఇన్సిడెంట్ కమాండర్ గా )  చనిపోయిన తహశీల్దార్లు మరియు నిత్యం కరోన క్వారంటీన్ సెంటర్లలో ఉంటూ కరోన బారినపడి మరణించిన రెవెన్యూ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం నుండీ ఎక్సగ్రేషియా/ఆర్ధిక సహాయం మంజూరు చేయాలని మెమోరాండం సమర్పించడమైనది.


 *పైన తెలిపిన సమస్యలపై గౌ11 ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ వెంటనే ఈ సమస్యల పరిష్కారానికి వారి అదనపు కార్యదర్శి శ్రీ K. ధనుంజయ రెడ్డి గారిని వెంటనే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా ఉద్యోగుల EHS నగదు రహిత వైద్యం అందించే విషయంలో ఉద్యోగుల నుండి ఎటువంటి వ్యతిరేకత రావడానికి వీలు లేదని, అలాగే ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు సెలవు దినాలలో మరియు ఉదయం 10.30 లోపు సాయింత్రం 5 గంటల తర్వాత ఎటువంటి సమావేశాలు నిర్వహించకుండా చూడాలని, చనిపోయిన ఉద్యోగులకు ప్రభుత్వం నుండి అవసరమైతే ఉద్యోగుల భాగస్వామ్యంతో ఎంతోకొంత ఆర్థికసహయం గురించి కూడా ఆలోచించాలని ఆదేశించారు.* 

మా సమస్యలపై ఎంతో సానుకూలంగా స్పందించిన గౌ11ముఖ్యమంత్రి గారికి ఆంద్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలుపడమైనది.


గౌ 11ముఖ్యమంత్రి గారిని కలిసిన ఈ కార్యక్రమంలో AP JAC అమరావతి సెక్రెటరీ జనరల్ శ్రీ Y. V. రావు, ఆంద్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర స్పోర్ట్స్& కల్చరల్ సెక్రటరీ శ్రీ Ch. నరసింహరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు  శ్రీ N. శ్రీనివాస్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీలు శ్రీ KS శర్మ, శ్రీమతి యం. మాధురి, శ్రీ G. ప్రవీణ్ కుమార్ రెడ్డి, శ్రీ యస్.ప్రేమ్ కుమార్ లు పాల్గొన్నారు.